సియోల్ : దక్షిణ కొరియాలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఆదివారం ఉగాది, శ్రీరామ నవమి పండగలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దేశ రాజధాని సియోల్ సమీపంలోని సువన్ నగరంలో గల సంగుక్వాన్ (ఎస్‌కేకేయూ) విశ్వవిద్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. దక్షిణ కొరియా తెలుగు సంఘం(టీఏఎస్‌కే) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక తెలుగు విద్యార్థులు, పలు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఉగాది పచ్చడి రుచి చూసి, పంచాగ శ్రవణం చేశారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పానకం పంచారు. ఆటపాటలతో అలరించారు. టాస్క్ కోర్ కమిటీ సభ్యలు డాక్టర్ సుశ్రుత కొప్పుల, డా. వేణు నూలు, అనిల్ కావల, డా. కొప్పాలి స్పందన రాజేంద్ర, అంకంరెడ్డి హరినారాయణ, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటి నేతృత్వం వహించారు. అనంతరం మహిళలు కోలాటంతోను, చిన్నారులు ఫ్యాషన్ షోతోను అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment