
కాలిఫోర్నియా : దక్షిణ కాలిఫోర్నియా తెలుగు అసోసియేషన్ (TASC) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటలపోటీలు, వంటల పోటీలు విజయవంతమయ్యాయని టాస్క్ ప్రెసిడెంట్ బుచ్చి రెడ్డి తెలిపారు. మహిళల త్రోబాల్ క్రీడలో దాదాపు 150మంది పాల్గొన్నారు. మొత్తంగా 12టీమ్‌లు పోటీపడిన ఈ ఆటలో ఇర్విన్ ట్రయల్‌బ్లేజర్స్ టీమ్ మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు వంద మంది మహిళలు వంటల పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో గెలిచిన వారందరికీ ఏప్రిల్ 20న నిర్వహించే ఉగాది వేడుకల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు టాస్క్ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment