
లండన్: తెలుగు వారి కోసం కోవిడ్-19 దృష్ట్యా కన్సల్టేషన్, ప్రశ్నోత్తరాల వర్చ్యుయల్ కార్యక్రమాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) నిర్వహించారు. ఈ కార్యక్రమంతో కోవిడ్-19పై అవగాహనను కల్పిస్తూనే, ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ల బృందం సమాధానాలను నివృత్తి చేసింది. తాల్ ఇప్పటివరకు కోవిడ్-19 పై (మే 9, మే 16)న రెండు ఆన్లైన్ సెషన్లను నిర్వహించింది. జూమ్‌లో జరిగిన ఈ వర్చువల్ సెషన్‌లో సుమారు 300కు పైగా ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
డాక్టర్ ప్యానెల్ ప్రొఫెసర్ వేణు కవర్తపు (ఆర్థో, కింగ్స్ కాలేజ్, లండన్) నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి బుద్ధవరపు (కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్, యూనివర్శిటీ హాస్పిటల్ కోవెంట్రీ & వార్విక్‌షైర్), డాక్టర్ సురేష్ గాంధీ గురిజాలా (యూనివర్శిటీ హాస్పిటల్ కోవెంట్రీ & వార్విక్‌షైర్), డాక్టర్ వెంకట్ గోంగురా (ఆర్థో, ఖమ్మం, ఇండియా), డాక్టర్ విజయ్ పాపినేని (కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, మాయో క్లినిక్స్, అబీ ధాబీ, యుఎఇ) , డాక్టర్ శ్రీలక్ష్మి ఉప్పలపతి (కన్సల్టెంట్ ఇంటెన్సివ్ కేర్, నాగార్జున హాస్పిటల్స్, విజయవాడ, ఇండియా) పాల్గొన్నారు. వీరితో పాటుగా ఫార్మసిస్టులు , ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.
తాల్ చైర్‌పర్సన్ భారతి కందుకూరి మాట్లాడుతూ.. భారత్‌లో నెలకొన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా తాల్ తరపునుంచి సహయం చేయడానికి ఎప్పుడు ముందుటామని పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్-19పై అవగాహనను కల్పించడానికి మరిన్ని సెషన్లను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తాల్ అడ్వజర్లు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ బాలాజీ కల్లూర్ , కిషోర్ కస్తూరి, నవీన్ గడమ్‌సేతి , అశోక్ మడిశెట్టి ఎంతగానోకృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment