తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యత్వం రికార్డు స్థాయిలో పెరిగింది. చాలా ఏళ్ల పాటు 35 వేలకు అటు ఇటుగా ఉన్న సభ్యుల సంఖ్య 2021 చివరి నాటికి రికార్డు స్థాయిలో 70 వేల వరకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన 'తానా' నూతన సభ్యుల చేరికతో మరింత ఉత్సాహంతో దూసుకుపోతుంది. అమెరికాలోని మొట్టమొదటి తెలంగాణ సంఘంగా రిజిస్టరైన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) ప్రస్తుత సభ్యుల సంఖ్య సుమారు 800 గా ఉన్నట్టు సమాచారం. డాక్టర్ దివేష్ అనిరెడ్డి, వెంకట్ మారంల నేతృత్వంలో కొత్తగా కొలువుతీరబోయే టీడీఎఫ్ కమిటీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించనుంది. నార్త్ అమెరికా తెలుగు అసోసియేన్ (నాట్స్)లో వేల సంఖ్యలో సభ్యులు ఉండగా.. నిత్యం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
గత ఐదారేళ్లుగా అమెరికాలోని ఇతర తెలంగాణ సంఘాలు కూడా విస్తృతం అవుతున్నాయి. ఇప్పటికే అమెరికా తెలంగాణ సొసైటీ (ఏటీఎస్), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ)లలో సభ్యత్వ నమోదు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారు అమెరికాలో ఏర్పాటు చేసుకున్న నేషనల్ లెవల్ ఆర్గనైజేషన్స్ (జాతీయ స్థాయి సంఘాలు) అధ్యక్షులు స్వరాష్ట్రాలకు వచ్చినప్పుడు వారికి ప్రజల నుంచి మంచి ఆదరణ, సామాజిక గౌరవం లభిస్తోంది. పుట్టిన గడ్డపై ప్రేమతో స్వరాష్ట్రాలలో అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రవాసి సంఘాల సభ్యులందరికీ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అభినందనలు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment