
కౌలాలంపూర్ : మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి మలేషియాలోని భారత రాయభార కార్యాలయం, వారి బంధువులతో సంప్రదింపులు జరిపారు. మలేషియా నుంచి మృతదేహాన్ని మంగళవారం ఎంహెచ్198 విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. విమానాశ్రయం నుంచి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత అంబులెన్స్ సహకారంతో మృతదేహాన్ని వారి గ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.