
సాక్షి, నిజామాబాద్ : దీపావళి పండగ నేపథ్యంలో జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ముమ్మర దాడులు జరిపారు. మొత్తం 167 కేసులు నమోదు చేసి 799 మందిని అరెస్టు చేశారు. రూ. 15,04,180 స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ డివిజన్‌లో 105 కేసులు నమోదు అయ్యయి. 464 మందిని అరెస్టు చేశారు. రూ. 8,15,000 స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్‌లో 41 కేసులు నమోదు చేసి 233 మందిని అరెస్టు చేశారు. రూ. 5,69,580 స్వాధీనం చేసుకున్నారు. బోధన్ డివిజన్‌లో 21 కేసులు నమోదు చేసి 102 మందిని అరెస్టు చేశారు. రూ.1,19,600 స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment