మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఖతర్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తమ దేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ సహా 14 దేశాల నుంచి తమ దేశంలోకి రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో ఉపాధి కోసం ఖతర్ వెళ్లే తెలంగాణవాసు లు ఇప్పట్లో అక్కడకు వెళ్లే అవకాశం లేదు. పలువురు కార్మికులకు వీసాతో పా టు ముందస్తుగానే విమాన టిక్కెట్ కొనుకున్నా, తాజా పరిణామాలతో ఆ దేశం వెళ్లలేని పరిస్థితి.. విమాన సర్వీసుల ర ద్దుపై ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనుందని తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్ వల్ల తమ దేశ ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన కువైట్ ప్రభుత్వం కూడా ఎనిమిది దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
అదే బాటలో తాజాగా ఖతర్ ప్రభుత్వం కూడా రాకపోకలపై నిషే ధం విధించింది. ఈ నిర్ణయంతో భారత్, చైనా, బంగ్లాదేశ్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్ నుంచి ఖతర్‌కు రాకపోకలు నిలిచి పోయాయి. ఖతర్‌లో ఆదివారం వరకు 24 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ ప్రభావం ఉన్న ఈ 14 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. కాగా, ఖతర్‌లో ఉన్న తెలంగాణవాసులు ఒకవేళ తమ సొంత ఊళ్లకు వెళ్లాలంటే అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. ఖతర్‌లోని వివిధ నిర్మాణ కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలలో వేలాది మంది తెలంగాణ వాసులు ఉపాధి పొందుతున్నారు. రోజూ పలువురు అక్కడి నుంచి స్వదేశానికి రాకపో కలు సాగిస్తారు. తాజా పరిణామాలతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి.
ఇప్పట్లో రాలేం..: ఖతర్ నుంచి ఇప్పట్లో ఇండియాకు రాలేం. అలాగే మన దేశం నుంచి ఖతర్‌కు వచ్చే వారు కూడా కొన్ని రోజుల పాటు ఓపిక పట్టాల్సిందే. కరోనా విస్తరించకుండా ఉండడానికి ఖతర్ ప్రభుత్వం 14 దేశాల రాకపోకల పై నిషేధం విధించింది. కొత్తగా వీసాలు తీ సుకున్న వారు కూడా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. – అబ్బగోని శ్రీధర్ గౌడ్, ఖతర్
Comments
Please login to add a commentAdd a comment