చెన్నై : దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ర్టాల్లో తమిళనాడు ఒకటి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 15 వరకు అమల్లో ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు రవాణాను ఈనె 31 వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయించింది. అయితే ఆటోలు, క్యాబ్‌లకు మాత్రం అనుమతులిన్నట్లు పేర్కొంది. రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని, దీనిలో భాగంగానే ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు సహకరించకుంటే ఆ కష్టం అంతా వృధాగా పోతుందని కరోనా నివారణకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. (పంజాబ్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినం)
Comments
Please login to add a commentAdd a comment