సాక్షి, తుర్కయంజాల్: కరోనా కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. బతుకు దెరువు కోసం కొత్త కొత్త పనులు చేస్తూ పూట గడుపుతున్నారు. నగరంలోని చంద్రాయణగుట్టకు చెందిన ఖాజా వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. కోవిడ్ కారణంగా గిరాకీలు లేక పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో అతడికి ఏ మాత్రం అనుభవం లేని తాటి ముంజలు అమ్మడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు మాల్, మర్రిగూడెం సమీపంలోని గ్రామాలకు వెళ్లి తాటి ముంజలు తీసుకొచ్చి తుర్కయంజాల్‌లో విక్రయిస్తున్నాడు. ప్రసుత్తం చేస్తున్న పని కొత్తది అయినప్పటికీ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడటంలో తప్పులేదని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment