
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్‌లో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. స్థానిక కంఠేశ్వర్ కాలనీలోని ఓ ఇంట్లో నాలుగు నెలల నుంచి ముగ్గురు యువకులు నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్, సాయి, మహేష్ అనే ముగ్గురు యువకులు కంఠేశ్వర్ ప్రాంతంలో ఒక టీ కొట్టు నిర్వహిస్తున్నారు. వీరు ముగ్గురు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా తెలుస్తోంది. అయితే వీరిలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఆ యువకులు నివసిస్తున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని గది తలుపు బద్దలు కొట్టి చూడటంతో ఈ హత్యల సంగతి బయటపడింది. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ జంట హత్యలు మూడు రోజుల క్రితం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరిలో మరో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment