
(ఫైల్ ఫోటో)
సాక్షి, నిజామాబాద్ : జక్రాన్ పల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట అర్గుల్ రైతులు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు పట్టా భూములు ఇవ్వమంటూ రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే హైవే కోసం భూములు ఇచ్చి నష్టపోయామని, 600 ఎకరాలు కాకుండా 300 ఏకరాలే తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక, రైతుల ఆందోళనతో జిల్లాలో ఎయిర్ పోర్ట్ అథారిటీ బృందం తమ పర్యటనను వాయిదా వేసుకుంది. సర్వే పనులను రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో పర్యటనును వాయిదా వేసుకుంది.