
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో పిడుగుపాటుకు ఓ బాలుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్లారెడ్డి ఇంతలో చెట్టుపై పిడుగు పడటంతో వినయ్ (14) మృతి చెందాడు. సుమన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినయ్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
భూ తగదాలు, ఒకరు మృతి
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాన్‌సాన్‌పల్లిలో అన్నదమ్ముల మధ్య భూ తగాదాల నేపథ్యంలో కత్తిపోట్లతో ఒకరు మృతి చెందారు. పత్తి చేను వద్ద జరిగిన ఘర్షణలో రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు మోహరించారు.
వీడిన మహిళ హత్య మిస్టరీ
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో మహిళ హత్య మిస్టరీ వీడింది. జగిత్యాల మండలం ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన రజితను గంగాధర్ అనే వ్యక్తి పరిచయం పెంచుకొని ఆమెను హత్య చేసి నగలు చోరీ చేశాడు. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment