
సాక్షి, నిజామాబాద్ : రక్షించాల్సిన కానిస్టేబులే కీచకుడిగా మారాడు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ దయానంద్ స్థానిక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తాండాలో చోటుచేసుకుంది. కానిస్టేబుల్ ప్రవర్తనతో తండావాసులు ఆందోళన చేపట్టారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దయానంద్‌పై చర్యలకు అధికారులు ఆదేశించారు. అతనిపై వేటు పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment