సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కూడికలు, తీసివేతల అనంతరం ఎంపీ అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వాలని భావించిన హైకమాండ్ నిర్ణయం మేరకు మళ్లీ పాత కాపుల పేర్లనే టీపీసీసీ సూచించింది. నిజామాబాద్,జహీరాబాద్ లోక్‌సభ స్థానాల కోసం వచ్చిన దరఖాస్తులను వారం రోజుల క్రితమే జిల్లా కాంగ్రెస్ కమి టీ యథాతథంగా టీపీసీసీకి పంపించింది. దీం తోపాటు అసెంబ్లీ టికెట్ల ఆశావహుల జాబితా ను సైతం అందజేసింది. వడపోత అనంతరం రెండు లోక్‌సభ స్థానాలకు మధుయాష్కీ, సురేశ్‌షెట్కార్ పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి శనివారం రాత్రి అందజేశారు.
నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మధుయాష్కీ పేరును టీపీసీసీతోపాటు ఏఐసీసీ సభ్యుడు వెంకట శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించగా, జహీరాబాద్ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్‌ను డీసీసీ, పీసీసీ సభ్యుడు ఎం. జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సి ఫారసు చేశారు. కాగా, తొమ్మిది అసెంబ్లీ ని యోజకవర్గాలకు సంబంధించి ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరు నుంచి ఐదుగురి పేర్లను డీసీసీ సిఫారసు చేసింది. ఈ జాబితాపైనా కసరత్తు చేసిన టీపీసీసీ తుది నిర్ణయం కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందజేసింది. నాలుగైదు రో జులలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు అసెంబ్లీ ఆశావహులలో టెన్షన్ మొదలైంది.
ఎంపీ అభ్యర్థులలో ఆందోళన
తెలంగాణ జిల్లాలకు సంబంధించి ‘సిట్టింగ్’లకు ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులు అనుకూలమా? ప్రతికూలమా? అన్న అంశాల జోలి కి వెళ్లకుండా, సింగిల్ ఎజెండాతో కాంగ్రెస్ అధిష్టానం బెర్తులు ఖరారు చేసే దిశలో ఉంది. నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీకి ఈసారి గడ్డుపరిస్థితులు తప్పవ నే మాట వినిపిస్తోంది. 2004 ఎన్నికలలో టీ ఆర్‌ఎస్‌తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ పోటీచేసి గెలుపొందారు.
2009 ఎన్నికలలో తెలంగాణ అంశంలో దూకుడుగా వ్యవహరించిన ఆయనకు తెలంగాణవాదుల నుంచి మద్దతు లభించి విజయం సాధించారు. 2004లో టీడీపీ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 1,37,981 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2009 ఎన్నికలకు వచ్చేసరికి మహాకూటమి అభ్యర్థి (టీఆర్‌ఎస్) బిగాల గణేశ్‌గుప్తాపై 60,390 మెజార్టీ సాధించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 2009 నాటికి టీఆర్‌ఎస్ అభ్యర్థి 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ తగింది.
కవిత రంగప్రవేశంతో
ఈసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కే సీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చిన కవిత తెలంగాణవాదులు, ముఖ్యంగా మహిళలను అభిమానాలను చూరగొన్నా రు. కవితపై పోటీ మధుయాష్కీకి ఆషామాషీ కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానానికి వస్తే గత ఎన్నికలలో సురేశ్ షెట్కార్ టీఆర్‌ఎస్ అభ్యర్థి సయ్య ద్ యూసుఫ్ అలీపై కేవలం 17,407 ఓట్లతో గెలుపొందారు. సురేశ్‌కు 3,95,767 ఓట్లు వస్తే.. యూసుఫ్‌కు 3,78,360 వచ్చాయి. ఈసారి కూడ టీఆర్‌ఎస్ ఓ వ్యాపారవేత్తను, బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతుండగా జహీరాబాద్‌లో పోరు రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఖరారైనా విజయావకాశాలపైనా ఆందోళన చెందుతున్నారు.
వీరిలో ఎవ్వరో?
లోక్‌సభతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల అ భ్యర్థుల జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన జరుపుతోంది. వారం రోజుల కిందట డీసీసీ ఆశావహుల జాబితాను టీపీసీసీకి అందజేయగా, శనివారం సాయంత్రం ఆ జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు టికెట్లు ఆశిస్తున్నారు. తొమ్మిది సెగ్మెంట్ల లో ఆశావహుల సంఖ్య మొత్తం 27కు చేరింది. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌తో పాటు ఆయన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్లు రెండేసి నియోజకవర్గాలలో ఉండగా ఎవరెవరికి టికెట్లు వస్తాయనేది ‘ఢిల్లీ’ ప్రకటన తర్వాతే తేలుతుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ పూర్తయిన వెంటనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబి తాలు వెలువడనున్నాయి.
కాంగ్రెస్ ‘అసెంబ్లీ’ తాజా జాబితా
Published Mon, Mar 24 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
Advertisement
Advertisement