suresh shetkar
-
సురేష్ షెట్కార్‌కు దిగ్విజయ్ బుజ్జగింపు
హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారు. దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సూచించగా.. టికెట్ తనకే కావాలని మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సురేష్ షెట్కార్‌ను బుజ్జగించి.. ఉప ఎన్నిక బాధ్యతలను చేపట్టాలని సూచించారు. మంగళవారం గాంధీభవన్‌లో దిగ్విజయ్‌తో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక గురించి చర్చించారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 29న నారాయణ్‌ఖేడ్‌లో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ఇదిలావుండగా పీసీసీలో పని విభజన లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. పీసీసీ పాత కార్యవర్గం ఉందో లేదో స్పష్టత ఇవ్వాలని కోరారు. -
సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ
సంగారెడ్డి (మెదక్): మెదక్ జిల్లా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సోమవారం భారీర్యాలీ నిర్వహించింది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పీసీసీ కార్యదర్శి కుసమకుమార్, ఇతర కార్యకర్తలు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
రాహుల్‌గాంధీని కలసిన మాజీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ షెట్కార్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఎన్డీయే కూటమి ఆరు నెలల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రాహుల్ మాజీ ఎంపీలకు సూచించారు. -
జహీరా‘బాద్షా’ ఎవరో...
రాజకీయ, భౌగోళిక వైవిధ్యాలకు చిరునామా జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. రెండు జిల్లాల అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడిన ఈ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దులో ఉంది. ఓ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండగా, మరో జిల్లాలో బలహీనంగా ఉండడంతో ఇక్కడి ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. సొంత బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలపైనే గురిపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గం: జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది : 2009 ఎవరెన్ని సార్లు గెలిచారు : కాంగ్రెస్- 1 ప్రస్తుత ఎంపీ : సురేష్ షెట్కార్ ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులు : 12 మంది మొత్తంఓటర్లు : 14,30,413 పురుషులు : 7,03,823 స్త్రీలు : 7,26,516 ఇతరులు : 74 నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు : జహీరాబాద్, అందోలు, నారాయణ్‌ఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ (నిజామబాద్ జిల్లా ) ప్రధాన అభ్యర్థులు : సురేష్ షెట్కార్(కాంగ్రెస్), మహమ్మద్ మొహియొద్దీన్ (వైఎస్సార్సీపీ), బీబీ పాటిల్(టీఆర్ఎస్), మదన్మోహన్ రావు(టీడీపీ) మహమ్మద్ ఫసియొద్దీన్- సంగారెడ్డి: నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దయి, జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. మెదక్ జిల్లాలోని మూడు, నిజామాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ సురేష్ షెట్కార్ బరిలో ఉన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన ఆయన గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఐదేళ్లలో ఆయన అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, టీఆర్ఎస్ అభ్యర్థి భీంరావు బస్వంత్‌రావు పాటిల్, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి కె. మదన్ మోహన్‌రావు నుంచి సురేష్ షెట్కార్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఉద్యమం మీదే భారం.. నిజామాబాద్ జిల్లా సిర్పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త బీబీ పాటిల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు చివరి నిమిషంలో టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణుల నుంచే విమర్శలొచ్చాయి. ఉద్యమ ప్రభావం పాటిల్‌కు ఎంత వరకు ఉపకరిస్తుందన్నది అనుమానమే. ఆయనకు తెలుగు భాష రాదని.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఆర్ఎస్ బలంగానే ఉన్నా.. మెదక్ జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలపై ఏమాత్రమూ పట్టు లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారవచ్చు. పొత్తుపైనే ఆశలు.. టీడీపీ తరఫున నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఐటీ కంపెనీ అధినేత కె.మదన్ మోహన్ రావు బరిలో ఉన్నారు. ఆయన టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సమీప బంధువు. ఇక్కడ టీడీపీ బలహీనంగా ఉన్నా, బీజేపీతో పొత్తు- నరేంద్ర మోడి గాలిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ పథకాలే అండ.. హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ మొహియొద్దీన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ముస్లిం అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోవడం విశేషం. వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందిన వారు తనను ఆదరిస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. సమస్యలతో సహవాసం.. - ఎగువ ప్రాంతంలో మంజీరానది పారుతున్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం తాగు, సాగునీరుకు నోచుకోలేకపోయారు. - తాగునీటి కోసం పల్లె ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉండే చెలమలు, వ్యవసాయ బావులపై ఆధారపడాల్సిన దుస్థితి. - మద్దతు ధర లభించక చెరకు రైతు నష్టపోతున్నారు. - పరిశ్రమలు లేక స్థానికంగా ఉపాధి అవకాశాల్లేవు. వందల సంఖ్యలో గిరిజన తండాలుండగా.. ఏటా గిరిజన కుటుంబాలకు వలసబాట తప్పదు. ఏడాదిలో సగభాగం తండాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. - కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వేల మంది గల్ఫ్ బాధితులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. - గణనీయ సంఖ్యలో ఉన్న బీడీ కార్మికుల బతుకులు పొగ చూరుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసి బీడీలు చుట్టినా పూట గడవని స్థితిలో ఉన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు. క్షయ, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) అనుకూలం.. - కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే ప్రచారం - మృదు స్వభావి..వివాదాలకు దూరంగా ఉండడం - ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేయడం - బరిలో ఉన్న ప్రత్యర్థుందరూ కొత్తవాళ్లే కావడం ప్రతికూలం... - సమస్యలు పరిష్కారం కాక ప్రజల్లో వ్యతిరేకత - స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం - జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండడం - సొంత పార్టీలో అంతర్గ కుమ్ములాటలు నే గెలిస్తే... - ప్రతి గ్రామానికి మంజీర నీటి సరఫరా - పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి - బోధన్-బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు - కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి మదన్ మోహన్ రావు (టీడీపీ) అనుకూలం.. - ఆర్థికంగా బలంగా ఉండడం - సామాజిక సేవా కార్యక్రమాలు - సైకిల్ యాత్రతో గ్రామాల్లో పర్యటించడం - నరేంద్ర మోడి అంశం ప్రతికూలం... - రాజకీయాలకు కొత్త కావడం - టీడీపీ సంస్థాగతంగా బలహీనపడడం - బీజేపీ పొత్తుతో మైనారిటీ ఓట్లు దూరం కావడం నే గెలిస్తే... - వలసల నివారణ కోసం పరిశ్రమల స్థాపనకు కృషి - బోధన్ నుంచి బీదర్ వరకు జుక్కల్, బాన్సువాడ, నారాయణ్ఖేడ్ల మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు - గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులకు పునరావాసం - మంజీర నుంచి ప్రతి గ్రామానికి తాగునీరు - పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తా బీబీపాటిల్ (టీఆర్ఎస్) అనుకూలం.. - తెలంగాణవాదం బలంగా ఉండడం - వ్యాపారవేత్తగా గుర్తింపు - తెలుగు కన్నడిగుల మద్దతు ప్రతికూలం... - తెలుగు భాష రాకపోవడం - చివరి నిమిషంలో పార్టీ టికెట్‌పై బరిలో దిగడం - ప్రజల్లో ప్రచారం లేకపోవడం - బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేశారనే ఆరోపణలు నే గెలిస్తే... - గిట్టుబాటు ధరతో పాటు రైతుల ఇతర సమస్యల పరిష్కారం - కాలుష్య రహిత పరిశ్రమల స్థాపన ..యువతకు ఉపాధి కల్పన - రైల్వే లైనుల ఆధునికీకరణ మహమ్మద్ మొహియొద్దీన్ (వైఎస్సార్సీపీ) అనుకూలం... - దివంగత సీఎం వైఎస్ పథకాల ప్రభావం - మైనారిటీల ఓట్లు గణనీయంగా ఉండడం - గత ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం - వ్యాపారవేత్తగా ప్రజలతో సత్సంబంధాలు ప్రతికూలం.. - తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడం - ప్రత్యర్థులతో పోలిస్తే ఆర్థికంగా బలహీనమే నే గెలిస్తే... - స్థానిక కంపెనీల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు - కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెద్దాస్పత్రి నిర్మాణం - ప్రతి పల్లెకు మంజీర నీటి సరఫరా - రైతు ఆత్మహత్యల నివారణకు కృషి - ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్ల నియామకం -
భాషరాని వారు..ఏం సేవచేస్తారు!
టీఆర్ఎస్ను వ్యాపారసంస్థగా మార్చిన కేసీఆర్ జహీరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ కోటగిరి, న్యూస్‌లైన్ : భాషరాని బీబీపాటిల్‌కు జహీరాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని వ్యాపార సంస్థగా మార్చారని జహీరాబాద్ కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ విమర్శించారు. శుక్రవారం ఆయన కోటగిరిలో విలేకరులతో మాట్లాడారు. డబ్బులున్న వారికి టికెట్లు ఇస్తూ, జెండాలు మోసిన వారికి అన్యాయం చేసిన కేసీఆర్‌కు ఇతర పార్టీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గతంలో బీబీపాటిల్ బీజేపీలో చేరినట్లు ప్రకటనలు చేసి, ఆ పార్టీ కండువాను కూడా వేసుకున్న ఆయనను కేసీఆర్ దరిచేర్చుకొని డబ్బులకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. రెండు లోక్‌సభ సీట్లున్న కేసీఆర్ తెలంగాణ ఎలా సాధిం చారో, ఎవరివల్ల తెలంగాణ వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కృషిచేసిన సోనియాగాంధీని ఆకాశానికి ఎత్తి వారి ఇంటికి వెళ్ళిన కేసీఆర్ అనంతరం సోనియాను దెయ్యం,భూతం అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. డబ్బులిస్తే కేసీఆర్ దేనికైనా సిద్ధమేనని విమర్శించారు. చంద్రబాబు ఊసరవెల్లి తెలంగాణపై రెండు ప్రాంతాల్లో రెం డువిధాలుగా వ్యవహరించిన టీ డీ పీ అధినేత చంద్రబాబు ఊసరవె ల్లి అని విమర్శించారు. అధికార దా హంతో తెలంగాణలో,సీమాంధ్రలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే తపనతో మతతత్వపార్టీ అయిన బీజేపీతో జతకట్టడం శోచనీయమన్నారు. తెలంగాణలో తమ పార్టీ లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ, సీమాంధ్రలో తెలంగాణను అడ్డుకుంది మొదటి నుంచి తమపార్టీయేనని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. చంద్రబాబును రెండు ప్రాంతాల ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఈ ప్రాంత ప్రజలు చేతి గుర్తుకు ఓటేసి కృతజ్ఞతలు తెలుపాలన్నారు. సమావేశంలో బాన్సువాడ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు పవన్,మహ్మద్,రాజ్దేశాయ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ‘అసెంబ్లీ’ తాజా జాబితా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కూడికలు, తీసివేతల అనంతరం ఎంపీ అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వాలని భావించిన హైకమాండ్ నిర్ణయం మేరకు మళ్లీ పాత కాపుల పేర్లనే టీపీసీసీ సూచించింది. నిజామాబాద్,జహీరాబాద్ లోక్‌సభ స్థానాల కోసం వచ్చిన దరఖాస్తులను వారం రోజుల క్రితమే జిల్లా కాంగ్రెస్ కమి టీ యథాతథంగా టీపీసీసీకి పంపించింది. దీం తోపాటు అసెంబ్లీ టికెట్ల ఆశావహుల జాబితా ను సైతం అందజేసింది. వడపోత అనంతరం రెండు లోక్‌సభ స్థానాలకు మధుయాష్కీ, సురేశ్‌షెట్కార్ పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి శనివారం రాత్రి అందజేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మధుయాష్కీ పేరును టీపీసీసీతోపాటు ఏఐసీసీ సభ్యుడు వెంకట శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించగా, జహీరాబాద్ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్‌ను డీసీసీ, పీసీసీ సభ్యుడు ఎం. జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సి ఫారసు చేశారు. కాగా, తొమ్మిది అసెంబ్లీ ని యోజకవర్గాలకు సంబంధించి ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరు నుంచి ఐదుగురి పేర్లను డీసీసీ సిఫారసు చేసింది. ఈ జాబితాపైనా కసరత్తు చేసిన టీపీసీసీ తుది నిర్ణయం కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందజేసింది. నాలుగైదు రో జులలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు అసెంబ్లీ ఆశావహులలో టెన్షన్ మొదలైంది. ఎంపీ అభ్యర్థులలో ఆందోళన తెలంగాణ జిల్లాలకు సంబంధించి ‘సిట్టింగ్’లకు ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులు అనుకూలమా? ప్రతికూలమా? అన్న అంశాల జోలి కి వెళ్లకుండా, సింగిల్ ఎజెండాతో కాంగ్రెస్ అధిష్టానం బెర్తులు ఖరారు చేసే దిశలో ఉంది. నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీకి ఈసారి గడ్డుపరిస్థితులు తప్పవ నే మాట వినిపిస్తోంది. 2004 ఎన్నికలలో టీ ఆర్ఎస్తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ పోటీచేసి గెలుపొందారు. 2009 ఎన్నికలలో తెలంగాణ అంశంలో దూకుడుగా వ్యవహరించిన ఆయనకు తెలంగాణవాదుల నుంచి మద్దతు లభించి విజయం సాధించారు. 2004లో టీడీపీ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 1,37,981 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2009 ఎన్నికలకు వచ్చేసరికి మహాకూటమి అభ్యర్థి (టీఆర్ఎస్) బిగాల గణేశ్గుప్తాపై 60,390 మెజార్టీ సాధించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 2009 నాటికి టీఆర్ఎస్ అభ్యర్థి 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ తగింది. కవిత రంగప్రవేశంతో ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా కే సీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చిన కవిత తెలంగాణవాదులు, ముఖ్యంగా మహిళలను అభిమానాలను చూరగొన్నా రు. కవితపై పోటీ మధుయాష్కీకి ఆషామాషీ కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానానికి వస్తే గత ఎన్నికలలో సురేశ్ షెట్కార్ టీఆర్ఎస్ అభ్యర్థి సయ్య ద్ యూసుఫ్ అలీపై కేవలం 17,407 ఓట్లతో గెలుపొందారు. సురేశ్‌కు 3,95,767 ఓట్లు వస్తే.. యూసుఫ్‌కు 3,78,360 వచ్చాయి. ఈసారి కూడ టీఆర్ఎస్ ఓ వ్యాపారవేత్తను, బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతుండగా జహీరాబాద్‌లో పోరు రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఖరారైనా విజయావకాశాలపైనా ఆందోళన చెందుతున్నారు. వీరిలో ఎవ్వరో? లోక్‌సభతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల అ భ్యర్థుల జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన జరుపుతోంది. వారం రోజుల కిందట డీసీసీ ఆశావహుల జాబితాను టీపీసీసీకి అందజేయగా, శనివారం సాయంత్రం ఆ జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు టికెట్లు ఆశిస్తున్నారు. తొమ్మిది సెగ్మెంట్ల లో ఆశావహుల సంఖ్య మొత్తం 27కు చేరింది. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌తో పాటు ఆయన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్లు రెండేసి నియోజకవర్గాలలో ఉండగా ఎవరెవరికి టికెట్లు వస్తాయనేది ‘ఢిల్లీ’ ప్రకటన తర్వాతే తేలుతుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ పూర్తయిన వెంటనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబి తాలు వెలువడనున్నాయి. -
బెర్తులు బేఫికర్
సాక్షి, సంగారెడ్డి: సిట్టింగ్ లోక్‌సభ సభ్యులనే పార్టీ తరఫున బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. పాత రేసు గుర్రాలతోనే పందెం నెగ్గాలని యోచిస్తోంది. మెదక్ నుంచి విజయశాంతి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ల అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకత్వం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ‘వార్ రూం’లో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నిర్వహిస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీలతో పాటు వారికి ప్రత్యామ్నాయంగా ఇతర అభ్యర్థుల పేర్లను సూచిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీ సీసీ), గాంధీభవన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లు స్క్రీనింగ్ కమిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించి ఉన్నాయి. ‘వార్ రూం’ భేటీలో మెదక్, జహీరాబాద్ లోక్‌సభల నుంచి మళ్లీ సిట్టింగ్ అభ్యర్థులనే బరిలో దింపాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయ అభ్యర్థులతో పోలిస్తే సిట్టింగ్ లోక్‌సభ సభ్యులే ధీటైన పోటీ ఇస్తారనే భావనను పార్టీ నాయకత్వం వెల్లడించినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ప్రకటించనుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాములమ్మ ధీటైన అభ్యర్థి ఆరునూరైన మెదక్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తానని ఎంపీ విజయశాంతి మంకుపట్టు పడుతున్నారు. ఆమెకే టికెట్ కేటాయించాలని టీపీసీసీ ప్రతిపాదిస్తే.. ఆర్ మోహన్ నాయక్, సోమేశ్వర్ రెడ్డి, రాపోలు విజయభాస్కర్, ఉమాదేవిల పేర్లను గాంధీభవన్ సిఫారసు చేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారిలో విజయశాంతి ధీటైన అభ్యర్థిగా అధిష్టానం భావిస్తోంది. రేసులో ముందుంజలో ఉండటంతో ఆమెకు టికెట్ ఖాయమని చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చాగండ్ల నారేంద్రనాథ్పై 6077 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ప్రారంభంలో టీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరిగా చక్రం తిప్పిన రాములమ్మ.. పార్టీ అధినేత కేసీఆర్‌తో చెల్లమ్మ అని అనిపించున్నారు. ఈసారి ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతికి బదులు స్వయంగా కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది. దీని పర్యావసానాల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం.. ఆ కొంత కాలానికి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ తరఫున మళ్లీ టికెట్ ఆశించిన చాగండ్ల నరేంద్రనాథ్ పార్టీని వీడి బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో మెదక్ లోక్‌సభ స్థానం ఈ ఆసక్తికర పరిణామాలను చవిచూసింది. ఒక వేళ టీఆర్ఎస్ తరఫున మెదక్ లోక్‌సభ నుంచి కేసీఆర్ బరిలోకి దిగితే ఆయనకు, విజయశాంతికి మధ్య ఆసక్తికరమైన పోరు జరిగే సూచనలున్నాయి. సురేష్‌కు లైన్ క్లియర్ జహీరాబాద్ లోక్‌సభ స్థానం టికెట్టు కోసం సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ ఎం. జైపాల్‌రెడ్డిల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సుదర్శన్‌రెడ్డి, ఎం. జైపాల్‌రెడ్డిల పేర్లను టీపీసీసీ ప్రతిపాదిస్తే డీసీసీ మాత్రం సురేష్ షెట్కార్ పేరునే ప్రతిపాదించింది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సైతం సురేష్ షెట్కార్ పేరునే బలపర్చినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే శివరావు షెట్కార్ కుమారుడు సురేష్ షెట్కార్ 1994లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆసమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో టీడీపీ అభ్యర్థి ఎం.విజయ్పాల్రెడ్డికి విజయం వరించింది. సురేష్ షెట్కార్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో పదవులు చేపట్టారు. 2004లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సీట్ల సర్థుబాటులో భాగంగా 2009లో సురేష్ షెట్కార్ జహీరాబాద్ లోక్‌సభకు మారాల్సి వచ్చింది. నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి పి.కిష్టారెడ్డి, జహీరాబాద్ లోక్‌సభ నుంచి సురేష్ షెట్కార్‌లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆనాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఈ సర్దుబాటును మళ్లీ కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.