సాక్షి, హైదరాబాద్: బందోబస్తు విధుల్లో ఉండే పోలీసు మహిళా సిబ్బంది కోసం ఆ శాఖ ప్రత్యేకంగా మొబైల్ రెస్ట్‌రూమ్స్, టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు మొదట 17 వాహనాలను సిద్ధం చేసింది. వీటిని ప్రస్తుతం మేడారం జాతర విధుల్లో ఉన్న పోలీసు మహిళా సిబ్బంది కోసం అందుబాటులో ఉంచబోతున్నారు. శుక్రవారం వీటిని హోంమంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో వీటి సంఖ్యను 25కు పెంచుతామని, బందోబస్తు విధుల్లో ఉండే మహిళా సిబ్బందికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఉంచుతామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రత్యేకంగా ఇందుకు వాహనాలను సమకూర్చుకుని వాటిని మొబైల్ టాయిలెట్లుగా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment