మహిళా పోలీసుల ప్రవర్తన సరికాదు: ఎమ్మెల్సీ కవిత | MLC Kavitha Serious On TS Police Students Issue | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసుల ప్రవర్తన సరికాదు: ఎమ్మెల్సీ కవిత

Published Wed, Jan 24 2024 10:01 PM | Last Updated on Wed, Jan 24 2024 10:08 PM

MLC Kavitha Serious On TS Police Students Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసులకు సంబంధించిన ఇటీవలి సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినినిపై పోలీసుల దాడి అమానుషమని  మండిపడ్డారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. శాంతియుతంగా ఉన్న నిరసన చేస్తున్న విద్యార్థినిని ఈడ్చుకెళ్లడం, నిరసనకారులపై అసభ్య ప్రవర్తించడం మంచిది కాదని తెలిపారు.

ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. హ్యూమన్ రైట్స్ కమీషన్ వెంటనే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రవర్తన ఒక కట్టుబాటు కాదు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కవిత పేర్కొన్నారు.

చదవండి:   కేటీఆర్‌ వ్యాఖ్యలకు బండి సంజయ్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement