అర్చకుల మాదిరి డ్రెస్‌లో మహిళా, పురుష పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు దోతీ కుర్తా ధరించారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. వారికి దోతీ కుర్తా, సల్వార్ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్‌కోడ్‌గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుందని చెప్పారు.
పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఆలయంలో పోలీసులు పూజారుల దుస్తులు ధరించాలంటూ ఆదేశాలు ఇచి్చనవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, విశ్వనాథ ఆలయంలో పోలీసుల డ్రెస్‌కోడ్‌ను వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమరి్థంచారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆలయాల్లో పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయని అన్నారు. రద్దీగా ఉన్నప్పుడు పోలీసులు నెట్టివేస్తే భక్తులు ఆగ్రహిస్తారని తెలిపారు. ఆర్చకుల వేషధారణలో ఉన్నవారు నెట్టివేస్తే పెద్దగా సమస్యలు రాబోవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment