Dress code Implemented
-
Kashi Vishwanath Temple: వారణాసి ఆలయంలో పోలీసులకు అర్చకుల డ్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు దోతీ కుర్తా ధరించారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. వారికి దోతీ కుర్తా, సల్వార్ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్‌కోడ్‌గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుందని చెప్పారు. పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఆలయంలో పోలీసులు పూజారుల దుస్తులు ధరించాలంటూ ఆదేశాలు ఇచి్చనవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, విశ్వనాథ ఆలయంలో పోలీసుల డ్రెస్‌కోడ్‌ను వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమరి్థంచారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆలయాల్లో పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయని అన్నారు. రద్దీగా ఉన్నప్పుడు పోలీసులు నెట్టివేస్తే భక్తులు ఆగ్రహిస్తారని తెలిపారు. ఆర్చకుల వేషధారణలో ఉన్నవారు నెట్టివేస్తే పెద్దగా సమస్యలు రాబోవన్నారు. -
సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్
సాక్షి, అమరావతి: ప్రజల సౌకర్యార్థం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు చేయబోతుంది. మొత్తం 19 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లు మినహా మిగిలిన వారికి యూనిఫామ్ అందిస్తోంది. పురుష ఉద్యోగులు లైట్ బ్లూ కలర్ చొక్కా, క్రీమ్ కలర్ ప్యాంట్ ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు లైట్ బ్లూ కలర్ టాప్, క్రీమ్ కలర్ పైజామా, క్రీమ్ కలర్ చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌ను యూనిఫామ్‌గా నిర్ణయించింది. ఒక్కొక్కరికి మూడు జతల కోసం 7.50 మీటర్ల చొక్కా క్లాత్, 4.05 మీటర్ల ప్యాంట్ క్లాత్‌ను.. మహిళ ఉద్యోగులకు టాప్ కోసం 7.50 మీటర్లు, పైజామాకు 7.25 మీటర్లు, చున్నీకి మరో 7.50 మీటర్ల క్లాత్‌ను పంపిణీ చేస్తున్నారు. మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లు మినహా 1,00,104 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 95 వేల మందికి ఇప్పటికే యూనిఫామ్ వస్త్రాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీకల్లా మిగిలిన వారికీ అందజేస్తామని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు సులభంగా గుర్తించేందుకు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, విధుల పట్ల నిబద్ధతతను పెంపొందించేందుకు యూనిఫామ్ ఉపయోగపడుతుందని, ప్రజలు కూడా వీరిని సులభంగా గుర్తించే అవకాశం లభిస్తుందని అధికారులు వివరించారు. తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలనే ఆదేశాలను ప్రభుత్వం ఇంకా జారీ చేయలేదని.. ప్రజల సౌకర్యార్థం భవిష్యత్‌లో తప్పనిసరి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. -
‘సంప్రదాయం’గా వస్తేనే.. శ్రీవారి దర్శనం
⇒ ప్రస్తుతం ఆర్జిత సేవలు, వీఐపీ, రూ.300,రూ.50 సుదర్శనంలో డ్రస్కోడ్ అమలు ⇒సర్వదర్శనం, కాలిబాట దర్శనంలోనూ తప్పనిసరి చేయాలని టీటీడీ యోచన సాక్షి, తిరుమల : సనాతన హైందవ ధర్మాలు, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేయాలని టీటీడీ సంకల్పించింది. ఇప్పటికే ఆర్జిత సేవలు, వీఐపీ, రూ.300, రూ.50 సుదర్శనంలోనూ ఇదే విధా నం అమలు చేస్తున్నారు. మిగిలిన సర్వదర్శనం, కాలిబాట దర్శనంలోనూ సంప్రదాయ దుస్తులను అమలు చేయాలని భావిస్తున్నారు. ఫలితాలిస్తున్న సంప్రదాయ వస్త్రధారణ రెండు దశాబ్దాలకు ముందు సంప్రదాయ వస్త్రధారణ కేవలం కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు మాత్రమే అమలు చేశారు. తర్వాత దశలో అని రకాల ఆర్జిత సేవలకు అమలు చేశారు. నాలుగేళ్లుగా వీఐపీ దర్శనాల్లోనూ సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి చేశారు. ఇదే విధానాన్ని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు గత ఆగస్టు 27వ తేదీ నుంచి రూ.300 ఆన్లైన్ టికెట్ల భక్తులకు అమలు చేసేలా చర్యలు చేపట్టారు. దీనినే గత నెల నుంచి 50 రూపాయల సుదర్శనం భక్తులకూ అమలు చేస్తున్నారు. అన్ని దర్శనాల్లోనూ సంప్రదాయ దుస్తుల విధానం అమలు చక్కగా సాగుతోంది. ప్రారంభంలో బాలారిష్టాలున్నా, తర్వాత యథావి ధిగా సాగుతోంది. సర్వదర్శనం, దివ్యదర్శనానికి డ్రస్కోడ్.. ప్రస్తుతం అమలు చేసే దర్శనాల్లో భక్తులు ఇంటిల్లిపాదిగా సంప్రదాయ దుస్తులతో వెళుతున్నారు. ఈ డ్రెస్‌కోడ్‌పై అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. దీంతో మిగిలిన సర్వదర్శనం, దివ్యదర్శనం, చంటిబిడ్డల తల్లిదండ్రుల దర్శనం, వికలాంగులు, వృద్ధుల వంటి దర్శనాలకూ డ్రస్కోడ్ అమలు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆలయ అర్చకులు, ఆగమ పండితులు కూడా ఇదే అభిప్రా యం వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించి రావడం వల్ల భక్తుల్లో భక్తిభావంతో పాటు సనాతన హైందవ సంస్కృతిని చాటేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.