సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అభినందించారు. మహిళలు, పిల్లలు భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ‘సైబ్ హర్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం మరో అద్భుతం సాధించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఇంటర్ నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాల వినియోగం గణనీయంగా పెరగడంతో సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. సులువుగా మోసాలకు గురయ్యే అవకాశం ఉన్న పిల్లలు, మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ‘సైబ్ హర్’ పేరుతో పోలీసులు స్పెషల్ ప్రోగ్రాం చేపట్టారు. దాదాపు 15 లక్షల మందికి సైబర్ నేరాలు జరిగే విధానం- నేరాల నుంచి బయటపడేందుకు పోలీసులు అవగాహన కల్పించారు. వారిని మనసారా అభినందిస్తున్నానని’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment