
సాక్షి, చెన్నై: డ్యూటీలో ఉన్న మహిళా పోలీసులు సరదాగా బీచ్‌లో తీన్మార్ స్టెప్పులేశారు. టిక్ టాక్ మోజులో పడి యూనిఫామ్‌లో ఉన్నామన్న సంగతి కూడా మరిచి.. రొమాంటిక్ పాటకు కాలు కదిపారు. ఇంకేముంది వెంటనే లైక్స్ కోసం దాన్ని టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు. కడలూరు రిజర్వ్ పోలీసు బెటాలియన్ చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సమీపంలోని బీచ్‌లో ఓ తమిళ పాటకు తీన్మార్ స్టెప్పులు వేస్తూ టిక్ టాక్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాకీ దుస్తుల్లోనే ఇరువురు కానిస్టేబుళ్లు స్టెప్పులు వేయటం పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించింది. వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment