
జైహింద్ దేవి (ఫైల్)
తమిళనాడు, టీ.నగర్: దిండివనంలో మహిళా సీఐ ఆది వారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విల్లుపురం జిల్లా, దిండివనం సమీపం కావేరిపాక్కానికి చెందిన మాణిక్యవేలు భార్య జైహింద్ దేవి (38). ఈమె బ్రహ్మదేశం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేశారు. ప్రస్తుతం పదోన్నతి పొంది కడలూరు జిల్లా నైవేలి థర్మల్ పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా వెళ్లారు. ఇలావుండగా ఆమె ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియరాలేదు. దిండివనం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. దిండివనం డీఎస్పీ కనకేశ్వరి విచారణ జరుపుతున్నారు.