సీఐ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం
⇒ఆయనపై జ్యుడిషియల్ విచారణ జరిపించండి
⇒బాధిత కానిస్టేబుల్ రేణుక డిమాండ్
తిరుపతి క్రైం: ‘ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్‌గా ఉన్న మాకే పోలీస్ శాఖలో న్యాయం జరగడం లేదు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కుప్పం సీఐ, చిత్తూరు డీఎస్పీలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి’ అని బాధిత కానిస్టేబుల్ వి.రేణుక డిమాండ్ చేశారు. కుప్పం సీఐ రాజశేఖర్ వేధింపులు తాళలేక కుప్పంకు చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఈ నెల 2వ తేదీన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం విది తమే.
అందులో నిర్మల చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, రేణుక న్యాయం కోసం శుక్రవారం తిరుపతి సాక్షి కార్యాలయానికి చేరుకున్నారు. తమపై కుప్పం సీఐ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, పత్రికల్లో రాయలేని విధంగా వేధించారని ఆరోపించారు. చిత్తూరు డీఎస్పీ గిరిధర్‌కు ఫిర్యాదు చేస్తే ‘పోలీస్ అధికారులైన మాపైనే ఫిర్యాదు చేస్తావా.. నీకు డిపార్టుమెంట్లో డ్యూటీలు చేయాలని లేదా’ అని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనను కులం పేరుతో, లైంగికంగా వేధిం చడం వల్లే ఆత్మహత్య చేసుకోవా లని అనుకున్నానన్నారు. సీఐని కాపాడేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మద్దతుతోనే తనకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు.