
భద్రాద్రి: మండల కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వివాహిత కుక్కముడి శ్రావణి (25) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఆమెను తన భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన శ్రావణి, దివ్యతేజ్‌కుమార్ నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.
రెండేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రావణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని దివ్యతేజ్‌కుమార్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ, భర్తే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు శ్రావణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి తల్లి రాధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూలూరుపాడు సీఐ వసంత్‌కుమార్, ఎస్‌ఐ విజయలక్ష్మి ఘటనా స్థలాన్ని సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment