జూన్‌లోగా ‘సీతారామ’ మొదటి దశ పనులు | Retired Engineers Visited Sitarama Lift Irrigation Project | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 2:52 AM | Last Updated on Fri, Jan 4 2019 2:52 AM

Retired Engineers Visited Sitarama Lift Irrigation Project - Sakshi

సాక్షి, కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు వచ్చే జూన్‌ నాటికి పూర్తవుతాయని తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ బృందం తెలిపింది. గురువారం ఐదుగురు ఇంజనీర్ల బృందం భద్రాద్రి జిల్లాలో పర్యటించింది. సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద జరుగుతున్న మొదటి దశ పంప్‌హౌజ్, పాల్వంచ మండ లం నాగారం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద జరుగుతున్న రెండోదశ పంప్‌హౌజ్, కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్‌హౌజ్‌ పనులను పరిశీలించింది.

అనంతరం ఒడ్డురామవరం వద్ద విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌పీ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి నుంచి ఈ పథకాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మిం చాలనుకున్న రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌లను కలిపి రీ ఇంజినీరింగ్‌ చేసి సీతారామ రూపొందించినట్లు తెలిపారు. 

చురుకుగా పనులు 
సీతారామ మొదటి దశ పంప్‌హౌస్‌ వరకు మెయిన్‌ కెనాల్‌ పనులు చురుకుగా జరుగుతున్నాయని ఎంఎస్‌పీ రెడ్డి తెలిపారు. ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద నిర్మిస్తున్న రెండోదశ పంప్‌హౌజ్‌ పను లు వచ్చే అక్టోబరులోగా పూర్తవుతాయని తెలిపారు. ములకలపల్లి మండలంలోని కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్‌హౌజ్‌ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.110 కిలోమీటర్ల కెనాల్‌లో 50 కిలోమీటర్ల కెనాల్‌ 3,800 ఎకరాల అటవీ ప్రాంతం లో ఉందన్నారు.

ఇందుకు సంబంధించి అటవీ అనుమతులు తీసుకున్నారన్నారు. దీంతో ఆటంకా లు లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు.వచ్చేనెలలో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ బృందంలో తెలంగాణ రిటైర్డ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.చంద్రమౌళి, వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దామోదర్, ఉపాధ్యక్షులు డాక్టర్‌ రమణనాయక్, మహాత్మరెడ్డి ఉన్నారు. వీరి వెంట సీతా రామ సీఈ సుధాకర్, ఎస్‌ఈ నాగేశ్వరరావు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement