sitarama project
-
పోలవరం అనుమతీ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సీతారామ– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అంశంపై నిర్వహించనున్న టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశానికి తమను పిలవలేదని, సీడబ్ల్యూసీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అలా అయితే, గోదావరి పరీవాహక ప్రాంతంలోని మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను ఆహ్వానించకుండానే.. 2009లో టీఏసీ నిర్వహించి పోలవరం ప్రాజెక్టుకు ఇచి్చన అనుమతులూ చెల్లుబాటు కావు అని స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ అనుమతులకు సిఫార్సు చేస్తూ గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ రాసింది. ‘ప్రస్తుతం 2017 మార్గదర్శకాలు అమల్లో ఉండగా, 1996 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదు’అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనిల్‌కుమార్ సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 2009, 2011లో అనుమతులను 1996 మార్గదర్శకాల ప్రకారమే ఇచి్చంది. వీటి ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తోంది’అని బదులిచ్చారు. న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని ఏపీ పేర్కొనగా, తప్పుడు ఉద్దేశాలతో కేసులేసినా నిలబడవని తెలంగాణ కౌంటర్ ఇచి్చంది. గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదు అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 కింద ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, అది ఏమాత్రం అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. తాము 531.908 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కలిగి ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ణయించడం ఏకపక్షమన్న ఏపీ వాదనను కూడా తెలంగాణ తోసిపుచ్చింది. ‘రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఉన్న 1,486 టీఎంసీల నీటి వాటా నుంచి తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.215 టీఎంసీలను కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ 2014 జనవరి 2న రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. దానినే నాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పురుషోత్తపట్నం లిఫ్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి లిఫ్టు, గోదావరి–పెన్నా అనుసంధానం తదిత ర ప్రాజెక్టులకు నీటి హక్కులు సాధించుకునేందుకే ఏపీ తప్పుడు ఉద్దేశాలతో ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుకుంటోంది. ఈ ప్రాజెక్టులకు నేటికీ సీడబ్ల్యూసీ నుంచి టెక్నో ఎకనామికల్ క్లియరెన్స్, టీఏసీ అనుమతి లేదు. దీంతో వీటిని రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో ఏపీకి 531.908 టీఎంసీల న్యాయబద్ధమైన వినియోగం ఉన్నట్టు నిరూపించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది’అని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది సీతారామ ప్రాజెక్టు వల్ల ఏపీ హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని సీడబ్ల్యూసీ చెప్పడం సరికాదని ఆ రాష్ట్రం పేర్కొనగా.. ఏపీ అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ ఈ మేరకు తేల్చిందని తెలంగాణ వివరణ ఇచి్చంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల వినియోగంపై గోదావరి ట్రిబ్యునల్ విధించిన ఆంక్షలు ఆ ప్రాజెక్టుకే పరిమితమని, సీతారామ ప్రాజెక్టుకు వర్తించవని తెలిపింది. 35 టీఎంసీలతో దేవాదుల, 195 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో ఆ 85 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టేనని, దీంతో సీతారామ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదన్న ఏపీ వాదనను తోసిపుచి్చంది. ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు కట్టుబడే దేవాదుల, కాళేశ్వరంతో పాటు పోలవరం ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతిలిచి్చందని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం ఉండదు‘పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ 991 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ నిర్ధారించగా, 861 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ కుదించింది. 2018 నాటి సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం పోలవరం వద్ద నీటి లభ్యత 460.7 టీఎంసీలకు తగ్గింది. సీతారామ డీపీఆర్ ప్రకారం అక్కడ నికర లోటు 13.64 టీఎంసీల నుంచి 151 టీఎంసీలకు పెరి గింది. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని న దుల అనుసంధానం సందర్భంగా సీడబ్ల్యూసీ తేల్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన నేపథ్యంలో పోలవరం వద్ద నీటి లభ్యతపై తాజా అధ్యయనం జరపాలి’అని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ పరీ వాహకంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభా వం ఉండదని నిర్ధారించిందని తెలంగాణ బదులిచ్చింది. -
‘సీతారామ’ అంచనాలు మోపెడు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరింతగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2016 ఫిబ్రవరి 18న రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణా నికి అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత 2018 ఆగస్టు 2న రూ.13,057.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచింది. తాజాగా అంచనా వ్యయాన్ని రూ.19,800 కోట్లకు సవరిస్తూ పాలనాపర అనుమతులు జారీ చేయాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు డిస్ట్రి బ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు నీటిపారుదల శాఖ ఇటీవల రూ.1,842 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించడంపై ఇటీవల అధికారుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించిన అనంతరం పాలనాపర అనుమతులు కోరుతూ ప్రతిపాదనలను సమర్పించడం గమనార్హం. 16 ప్యాకేజీలుగా కాల్వల పనులు 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల నిర్మాణం, ఇతర ప్రధాన పనులు పూర్తికాగా, డి్రస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో సీతారామను చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా డి్రస్టిబ్యూటరీల పనుల పూర్తికి ఆదేశించింది. ప్రాజెక్టు కాల్వల పనులను 16 ప్యాకేజీలుగా విభజించగా, 1–8 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వ, 9–12 ప్యాకేజీలుగా సత్తుపల్లి ట్రంక్ కాల్వ, 13–16 ప్యాకేజీలుగా పాలేరు లింక్ కాల్వ పనులను చేర్చారు. ఇక డిస్ట్రిబ్యూటరీల పనులను మరో 8 ప్యాకేజీలుగా విభజించి రూ.3,858.93 కోట్ల అంచనాలతో అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించారు. గతంలో నిర్వహించిన ఓ సమీక్షలో డిస్ట్రిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రూ.1,842 కోట్ల అంచనాలతో కొత్తగూడెం సీఈ టెండర్లను ఆహ్వానించారు. అందులో కేవలం రూ.768 కోట్లకే పరిపాలన అనుమతి ఉండగా, రూ.1,074 కోట్ల పనులకు అనుమతి లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ ఎ.శ్రీనివాస్ రెడ్డి ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వం వారిద్దరిని మందలించి సంజాయిషీ కోరింది. దీంతో కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు పాలనాపర అనుమతుల కోసం తాజాగా ప్రతిపాదనలు సమర్పించడం గమనార్హం. ప్రామాణిక ధరల పట్టిక 2024–25 ఆధారంగా అంచనాలను రూ.19,800 కోట్లకు పెంచాలని ఆయన కోరారు. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల కోసం సిఫారసు చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనుంది. -
‘సీతారామ’పై ఈఎన్సీ, సీఈకి షోకాజ్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పరిపాలనా అనుమతులు లేకుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లను ఆహ్వనించిన అంశంపై మంత్రుల సమక్షంలో వాగ్వాదానికి దిగినందుకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ (సీఈ) శ్రీనివాస్‌రెడ్డికి ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు సంజాయిషీ ఇవ్వాలని వారిని ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత శనివారం సీతారామ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో పాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను ఆహ్వనించిన అంశం చర్చకు రావడం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం సీఈ ఎ.శ్రీనివాస్‌రెడ్డే అనుమతుల్లేకుండా టెండర్లు ఆహ్వనించారని అనిల్‌కుమార్ అభ్యంతరం తెలిపినట్లు.. అనుమతుల విషయంలో అనీల్కుమారే సహకరించట్లేదని శ్రీనివాస్‌రెడ్డి మంత్రుల సమక్షంలో వాదించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను అదే రోజు ఆదేశించారు.మంత్రులను తప్పుదోవ పట్టించినందుకు సస్పెండ్ చేయిస్తానని సీఈపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం గురించి సాక్షి ప్రధాన సంచికలో ‘అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల సీతారామ టెండర్లు’శీర్షికతో వచ్చిన వార్తా కథనంపై కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. సీఎం, మంత్రులు ఆదేశించడంతోనే డి్రస్టిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లను ఆహ్వానించినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్‌తోపాటు నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్)కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. డి్రస్టిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను ఆహ్వనించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సమీక్షలో ఆదేశించారని గుర్తుచేశారు.అలాగే సెపె్టంబర్ 27న నిర్వహించిన సమీక్షలో డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు టెండర్లు పిలవాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆదేశించారని పేర్కొన్నారు. రూ.13,057.98 కోట్ల సవరణ అంచనాలతో గతంలో ఇచ్చిన పరిపాలనా అనుమతుల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు సైతం ఉన్నందున టెండర్ల విషయంలో ముందుకు వెళ్లాలని ఆ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సూచించారన్నారు. ఆ సమావేశం మినట్స్‌లో ఈ విషయాలన్నీ ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయ అంచనాల సవరణకు పరిపాలనా అనుమతులు వస్తాయన్న నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటరీల పనులకు తాజాగా టెండర్లను ఆహ్వానించినట్లు లేఖలో పేర్కొన్నారు. -
అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల ‘సీతారామ’ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ. 768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మిగిలిన రూ. 1,074 కోట్ల పనులకు ఆమోదం తెలపడంపై నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం చేపట్టిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పరిపాలనా అనుమతుల్లేకుండానే టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారని సంబంధిత చీఫ్ ఇంజనీర్‌పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో మంత్రులు నిర్వహించిన ఓ సమీక్షలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించగా.. ప్రాజెక్టు అధికారులు అనుమతులు పొందకుండానే తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశిస్తే దానర్థం అనుమతుల్లేకుండానే టెండర్లు ఆహ్వానించాలని కాదని, అనుమతులన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని ఉన్నతాధికారులు అంటున్నారు. అనుమతులు రాకుంటే ఏం చేస్తారు? అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కమిటీ ఆమోదించాకే రూ. 10 కోట్లు, ఆపై విలువగల పనుల టెండర్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పనులకు అన్ని రకాల అనుమతులు ఉంటేనే సీఓటీ కమిటీ టెండర్లను ఆమోదిస్తుంది. అనుమతుల ఉత్తర్వుల్లో పేర్కొన్న పదాల్లో స్వల్ప తేడాలున్నా మళ్లీ కొత్త ఉత్తర్వులతో వస్తేనే ఆమోదముద్ర వేస్తుంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు డి్రస్టిబ్యూటరీలకు సంబంధించిన ఆరు టెండర్లకు బిడ్ల దాఖలు గడువు ఈ నెల 8తో ముగియనుండగా మరో టెండర్ గడువు 4తో ముగియనుంది. ఆ తర్వాత ఈ బిడ్లను సీఓటీ కమిటీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. అయితే అనుమతుల్లేకుండానే టెండర్లు జారీ కావడంతో సీఓటీ కమిటీ నుంచి వాటికి ఆమోదం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అనుమతులు లభించకపోతే టెండర్లను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. కాగా, టెండర్లను ఆహ్వానించిన తర్వాత అనుమతుల్లేని పనులకు ర్యాటిఫికేషన్ (క్రమబద్ధీకరణ అనుమతులు) జారీ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేయగా అంచనాలను సమర్పించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. ఇప్పటికే సీతారామపై వివాదాలు... సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిoది. ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ. 13,057 కోట్లకు అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్టు కింద 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులు జరగాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పనుల అంచనాలను భారీగా పెంచారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను నిర్వహిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ అంశంపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
టెక్నికల్ క్లియరెన్స్‌కు ‘సీతారామ’
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు డీపీఆర్‌ను టెక్నికల్ అప్రైజల్ క్లియరెన్స్ కోసం పంపించేలా కేంద్ర జలసంఘానికి సిఫారసు చేస్తున్నామని గోదావరినది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) చైర్మన్ ముఖేష్‌కుమార్ సిన్హా తెలిపారు. ప్రాజెక్టుపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమానాలను సైతం రికార్డు చేసి సీడబ్ల్యూసీకి పంపిస్తామన్నారు. ఏపీ లేవనెత్తిన సందేహాల్లో చాలావాటిని ఇప్పటికే సీడబ్ల్యూసీ నివృత్తి చేసిందని చెప్పారు. ఇంకా ఏమైనా అనుమానాలుంటే సీడబ్ల్యూసీని నేరుగా సంప్రదించవచ్చని ఏపీని సూచించారు. గోదావరిబోర్డు 16వ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అనుమతులపై ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. గోదావరిబోర్డు ముందు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ రాగా, దానికి టెక్నికల్ అప్రైజల్ క్లియరెన్స్ కోసం బోర్డు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రాజెక్టుకు అనుమతులు తుది అంకానికి చేరాయి. తదుపరి దశలో సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) డీపీఆర్‌ను పరీక్షించి క్లియరెన్స్ ఇవ్వనుంది. టీఏసీ క్లియరెన్స్ లభిస్తే ప్రాజెక్టుకు అనుమతులు లభించినట్టే భావిస్తారు. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశమై ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదిస్తే అన్ని రకాల అనుమతులు లభించినట్టే. గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) జి.అనిల్ కుమార్, అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఏపీ తరఫున ఈఎన్సీ వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర విభాగం సీఈ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రాతిపదికన తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు? రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నీటి పంపకాలే జరగలేదని, ఎలాంటి అవగాహన ఒప్పందం లేదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఎలా క్లియరెన్సులు జారీ చేస్తుందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావుఅభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులతో ఏపీలోని పోలవరం, గోదావరి డెల్టా సిస్టమ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనికి అనుమతులను తిరస్కరించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 33 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు బదులుగా 70 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. ఏపీ అభ్యంతరాలు గోదావరి బోర్డు పరిధిలోకి రావు ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు రచించగా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పుతో పాటు ఆయా ప్రాజెక్టుల లొకేషన్లు, జలాలపై ఉన్న హక్కులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీల జలాలపై హక్కులు ఏర్పడుతాయని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. ఏపీ సమర్పించిన ప్రాజెక్టుల వివరాల ప్రకారం ఆ రాష్ట్రానికి 531 టీఎంసీల జలాలపై హక్కులున్నట్టు సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ జలాలకు రక్షణ కల్పిస్తూనే తెలంగాణలోని ప్రాజెక్టులను అనుమతులు ఇస్తోందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమానాలు గోదావరి బోర్డు పరిధిలో రావని తెలిపారు. అవి సీడబ్ల్యూసీ పరిధిలో వస్తాయని, అక్కడే నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ల విషయంలో సీడబ్ల్యూసీ ఏపీని సంప్రదించలేదని ఆ రాష్ట్రం చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను, నీటి అవసరాలను, ఆయకట్టు వివరాలను, డాక్యుమెంట్లను సీడబ్ల్యూసీకి సమర్పించినట్టు తెలిపారు. వీటిని పరిగణ నలోకి తీసుకొని ఎగువ, దిగువ పరీవాహకంలోని రాష్ట్రాల అవసరాలన్నింటినీ పరిరక్షిస్తూ సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌లు ఇస్తోందన్నారు. ఈ విషయంలో ఏపీ అభ్యంతరాలు సమంజసం కాదన్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలకు అనుగుణంగానే ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. -
‘సీతారామ’ జలం.. ఖమ్మానికి తొలి ఫలం
సాక్షి ప్రతినిధి ఖమ్మం/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎనిమిదేళ్లుగా నిర్మాణం జరుపుకొంటున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు తొలి ఫలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులకు అందనున్నాయి. గురువారం హైదరాబాద్‌లో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నాక సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్దకు చేరుకొని పైలాన్‌ను ఆవిష్కరి స్తారు. ఇక్కడ సీతారామ ప్రాజెక్టులో భాగమైన రెండో పంప్‌హౌస్‌లో మధ్యాహ్నం 12:50 గంటలకు మోటార్లు స్విచ్చాన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోత లను ప్రారంభిస్తారు. అనంతరం డెలివరీ చానల్ వద్ద పొలాల్లోకి ప్రవహించే జలాలకు పూజ చేస్తా రు. అనంతరం మీడియాతో మాట్లాడి వైరాలో జర గనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలి కాప్టర్లో బయలుదేరతారు. మరోవైపు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్‌ను జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్‌హౌజ్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క ప్రారంభిస్తారు. కాగా, బుధవారం పంప్ హౌస్–2 వద్ద ఏర్పాట్లను, పంప్‌హౌస్–3లో ట్రయల్ రన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.వైరా సభలో రూ.2 లక్షల రుణమాఫీపూసుగూడెంలో కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ మధ్యాహ్నం 2.45 గంటలకు ఖమ్మం జిల్లా వైరా చేరుకుంటారు. అక్కడ 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించే బహి రంగ సభలో పాల్గొంటారు. ఇదేవేదికపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చెక్కు లను కొందరు రైతులకు అందజేస్తారు. ఈ సభలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు ప్రసంగించనున్నారు.ఎనిమిదేళ్లుగా..ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ పేర్లతో రెండు ఎత్తిపోతల పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించారు. కానీ మహానేత మరణం తర్వాత ఈ పనులు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్ర విభజనతో ఇందిరాసాగర్ ప్రతిపాదిత స్థలం ఏపీలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులను కలిపేస్తూ ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 6.5 లక్షల ఎకరాలకు గోదావరి నీరు ఇచ్చేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. 2016 ఫిబ్రవరి 16న ప్రాజెక్టు నిర్మాణ పనులకు నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చించగా.. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయినా ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఒక్క ఎకరాకూ నీరు అందించే అవకాశం లేకుండాపోయింది. రాజీవ్ కెనాల్కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రధాన కాల్వ 102 కి.మీ. వద్ద 9.8 కి.మీ. నిడివితో రాజీవ్ కెనాల్‌ను నిర్మించి గోదావరి నీటిని నాగార్జునసాగర్ కాల్వ ద్వారా వైరా రిజర్వాయర్‌కు మళ్లించేలా డిజైన్ చేశారు. తద్వారా 1.20 లక్షల ఎకరాల ఎన్ఎస్పీ ఆయకట్టుకు గోదావరి నీరు అందించే అవకాశముంది. దీంతో నాలుగేళ్ల క్రితం నిర్మాణం పూర్తయి, డ్రై రన్ కూడా జరగని మూడు పంప్‌హౌస్‌లను సిద్ధం చేసే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో పంప్‌హౌస్‌లో రెండేసి మోటార్లు సిద్ధం చేయడమే కాక ప్రధాన కాల్వ పెండింగ్ పనుల్లో వేగం పెంచింది. గిరిజన జిల్లాకు అన్యాయంసీతారామ ప్రాజెక్టు ప్రధాన పనుల కోసం నీరు, భూసేకరణ అంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టి సాగునీటిని మాత్రం ఖమ్మం జిల్లాకు తరలి స్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు ఇప్పటికే ఎన్ఎస్పీ కెనాల్ ద్వారా సాగు నీరు అందుతున్నా ఆ జిల్లాకు చెందిన మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి అదనంగా గో దావరి జలాలను తీసుకెళ్తూ భద్రాద్రికి అన్యాయం చేస్తున్నారని సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమో క్రసీ మాస్‌లైన్ పార్టీలతోపాటు పలు రైతు సంఘా లు ఆరోపిస్తున్నాయి. ఇల్లెందు, పినపాక నియో జక వర్గాలకు గోదావరి జలాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బానోతు హరిప్రియ ఆయా నియోజక వర్గాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
పరాన్నజీవుల్లా మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారుడుతనంతో పరాన్నజీవుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మంత్రులు నెత్తిమీద నీళ్లు చల్లుకొని పోటీలు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులకు పేరు వస్తుందనే భయంతోనే... క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ఈ నెల 15న సీఎం రేవంత్ సీతారామ ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారని చెప్పారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు ఖమ్మంజిల్లా నేతలతో కలిసి సోమవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టులో కాంగ్రెస్ కేసులు వేసినా, బీఆర్ఎస్ అనేక కష్టాలను అధిగమించి పనులు పూర్తి చేసిందన్నారు. కానీ రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం రావడంతో ప్రాజెక్టు తాము కట్టినట్టుగా కాంగ్రెస్ నేతలు కటింగ్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఏళ్లకేళ్లు పట్టే ప్రాజెక్టు డిజైన్, భూసేకరణ, అనుమతులు తదితరాలన్నీ ఏడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రూ.75 కోట్లతో లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. వందేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాడు కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టా రని, గతంలో కేసీఆర్‌కు క్రెడిట్ ఇచ్చిన మంత్రి తుమ్మల.. ప్రస్తుతం మాట మార్చారని చెప్పారు.సత్యవాక్య పరిపాలకులు సీతారాముల పేరుపై కట్టిన ప్రాజెక్టుపై మంత్రులు అబద్ధాలు చెబితే భగవంతుడు కూడా క్షమించడన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున పండుగ నిర్వహిస్తామన్నారు. వాట్సాప్ హెల్ప్‌లైన్ దరఖాస్తుల పరిశీలన రుణమాఫీ అందని రైతుల కోసం తెలంగాణభవ న్లో ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు అందిన దరఖాస్తులను హరీశ్ పరిశీలించారు. 83748 52619 నంబరుకు వాట్సాప్ ద్వారా 72వేలకు పైగా దరఖాస్తులు అందాయని చెప్పారు. ఈ సమావేశంలో మాజీఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రానున్న ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల నుంచి 35 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తీసుకొస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం పూసుగూడెం వద్ద నిర్మించిన రెండో పంప్‌హౌజ్‌లో ఆదివారం ఆయన మోటార్ల ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. మోటారు స్విచ్ వేయగానే గోదావరి నీళ్లు గ్రావిటీ కెనాల్లోకి చేరి పంప్‌హౌజ్ –3 దిశగా పరుగులు పెట్టాయి. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఉత్తమ్ గోదావరి జలాలకు పూజలు చేశారు. కాగా, ఇదేరోజు జరగాల్సిన మూడో పంప్‌హౌజ్ ట్రయల్‌రన్‌ను వాయిదా వేశారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు..రెండో పంప్‌హౌజ్‌లో ట్రయల్‌రన్‌ను ప్రారంభించాక మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి రంగంపై రూ.1.80 లక్షల కోట్లను వెచ్చించినా నామమాత్రంగానే కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చిందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును అందుబాటులోకి తేవాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, గోదావరి నుంచి సీతారామ ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల నీటిని వాడుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ ఆరోపించారు. కానీ ఈ అంశంపై తాము దృష్టి సారించి, కేంద్రంతో చర్చించామని.. మరో పది, పదిహేను రోజుల్లో కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తాయనే నమ్మకం ఉందని తెలిపారు. ఈనెల 15వ తేదీన ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, అదేరోజు వైరాలో జరిగే సభలో రూ.2 లక్షల రుణమాఫీ చెక్కులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.పీవీ హయాం నుంచిగోదావరి నీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందించాలని పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం నుంచి ప్రయత్నాలు జరగ్గా.. అవి ఇన్నాళ్లకు నెరవేరుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రధాన కాల్వ వెంట డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు వెంటనే ప్రారంభించేలా అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి కనీసం రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందే విధంగా పనులు జరగాలని ఆదేశించారు. తలాతోక లేకుండాగతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జల యజ్ఞం ద్వారా రూ.3,500 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన ఓ మహానుభావుడు (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) తలాతోక లేకుండా రీ డిజైన్ పేరుతో ఆ వ్యయాన్ని రూ.18 వేల కోట్లకు పెంచారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో పొంతన లేకుండా అక్కడో పని, ఇక్కడో పని చేయడంతో రూ.8వేల కోట్లు వెచ్చించినా ఎకరాకు కూడా నీరు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లోపాలు సవరిస్తూ, పరిస్థితులను చక్కదిద్దుతున్నామని తెలిపారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి టన్నెళ్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం పూర్తి చేసి పొలాల్లోకి గోదావరి నీరు పారిస్తామని చెప్పారు. -
సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు
సాక్షి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంప్ హౌస్‌లను మంత్రులు పరిశీలించారుఅనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామన్న ఉత్తమ్.. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు పనులు వేగవంతం చేయాలని ఉత్తమ్ అన్నారు.‘‘గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు ఎటువంటి అనుమతులు లేవు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు తీసుకుని వచ్చాం. సీతారామ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నాం. 2026న ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి గోదావరి జలాలు అందిస్తాం సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా లక్షా 52 వేలు సాగులోకి వస్తుంది. పాలేరు లింకు కెనాల్‌కి నీళ్లు అందిస్తాం. పాలేరు కింద నాగార్జున సాగర్ కింద భూములకు నీరు అందుతుంది. భద్రాచలం, ఇల్లందుకు సీతారామ ప్రాజెక్టు వచ్చేలా చేస్తాం’’ అని ఉత్తమ్ తెలిపారు. -
సీతారామకు వేగంగా అనుమతులు సాధించండి
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులతో పాటు పర్యావరణ అనుమతులను సాధించే పనులను వేగిరం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి అనుమతి కోరుతూ గతంలో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించగా, ఇటీవల గోదావరి బోర్డు ఆమోదం కోసం ఆ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ పంపించిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్ కేసును సత్వరంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, పర్యావరణ అనుమతులు పొందడానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుపై శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు పంప్‌హౌస్‌లను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు పంప్‌హౌస్‌లకు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించనున్నామని వెల్లడించారు. అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహింగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు మిగులు పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాల్వల నిర్మాణం ఆగి పోకుండా రైల్వే శాఖతో చర్చించి అనుమతులు పొందాలని ఆదేశించారు. ప్యాకేజ్– 1,2 పనులకు అవసరమైన 3,000 ఎకరాల భూసేకరణను సత్వరంగా పూర్తి చేస్తే నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయవచ్చు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2.60 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం నీరివ్వలేదు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయితే, ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని.. అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, బీరోలు, పోచారంలో సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అలాగే దమ్మాయిగూడెం నుంచి పోచారం వరకు నిర్మాణం జరుగుతున్న కాలువ, సొరంగం పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండగా, ఇప్పటికే మొదటి లిఫ్ట్ ట్రయల్‌రన్ పూర్తిచేసి రెండో లిఫ్ట్ ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్నామని తెలిపారు.మొదటి విడత ఆగస్ట్ 15న..సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మొదటి విడతగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయిస్తామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై ఎక్కడా నీటి నిల్వకు రిజర్వా యర్లు కట్టలేదని, దీంతో 10 టీఎంసీల నుంచి 12 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ నిర్మించాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. కాగా, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్ర నాయక్, నీటిపారుదల శాఖ సీఈ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. -
మే నెలాఖరుకల్లా ‘సీతారామ’ పనులు పూర్తవ్వాలి
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెకు కింద కాలువల పనులను మే నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఆదివారం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సీతారామ ప్రాజెక్టు పురోగతి, చేపట్టాల్సిన పనులపై మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా ఉత్తమ్‌తో కలిసి సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకా సాగర్, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ప్రాజెక్టుపై సుమారు రూ. 7,500 కోట్లు ఖర్చు చేశారని, మూడు పంప్‌హౌస్‌లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. టెండర్లు పూర్తి చేయాలి.. రూ. 70 కోట్లతో ఏన్కూరు వద్ద లింకు కెనాల్ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు వేగంగా చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్లోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, బేతుపల్లి పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇటీవల గండుగులపల్లిలో జరిగిన సమావేశంలో సమీక్షించిన అంశాలను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లగా సంబంధిత పనులను దశలవారీగా ప్రాధాన్యతను బట్టి పూర్తిచేసి మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. యాతాలకుంట భూసేకరణ త్వరగా తేలిస్తే కెనాల్ కింద నీరు ఇవ్వొచ్చన్నారు. ఈ పనులు పూర్తయితే సీతారామ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. సత్తుపల్లి ట్రంకు కెనాల్‌కు సంబంధించి భూసేకరణకు చెల్లించాల్సిన రూ. 12 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పాలేరు టన్నెల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పై పనులన్నీ పూర్తి చేస్తే వైరా రిజర్వాయర్ కింద 1.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. -
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే రాజకీయాలకు గుడ్‌బై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల విడుదలను కళ్లారా చూశాకే రాజకీయాల నుంచి విరమిస్తానని... ఆ కోరిక నెరవేర్చుకునేందుకే ఎన్నికల్లో నిలబడుతున్నానని , ప్రజల కోరిక మేరకే నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి తుమ్మలను ఖమ్మంలోని ఆయన స్వగృహంలో కలిశారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ హోదాలో పొంగులేటి తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారన్నారు. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక అధికారికంగా నీళ్లు వదిలి అదే వేదికపై అందరికీ ధన్యవాదాలు తెలిపి రాజకీయాల నుంచి విరమించాలనేది తన జీవిత కోరిక అని వ్యాఖ్యానించారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పతనం మొదలైంది: శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి, రెండు శాతం ఓట్లు కూడా లేని సమయాన కేసీఆర్ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరి జిల్లాను అభివృద్ధి పథాన నడిపించారని చెప్పారు. అయితే, బీఆర్ఎస్లో కొన్ని శక్తులు ఆయ న్ను అవమానాలు, అవహేళనలకు గురిచేసి బయటకు వెళ్లేలా చేశాయన్నారు. కాంగ్రెస్ పక్షాన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
ఆగిన ‘సీతమ్మ సాగర్’ పనులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిపై చేపట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. సీతమ్మ సాగర్ నిర్మాణ పనులకు సంబంధించి అభ్యంతరాలను లేవనెత్తుతూ కొందరు వేసిన పిటిషన్‌పై గ్రీన్ ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏమైనా పనులు జరుగుతున్నాయా? లేదా ? అనే అంశాలను ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పని ప్రదేశం నుంచి కొంత మిషనరీ, కార్మికులను వెనక్కి రప్పించింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు నిలిపివేయనుంది. బాధితుల ఫిర్యాదుతో.. గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సీడబ్ల్యూసీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి పొందేందుకు తుది డీపీఆర్‌ను సిద్ధం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైన వేసవికాలం వృధా కాకూడదనే ఉద్దేశంతో బ్యారేజీ అనుబం«ధ పనులు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో బాధితులు మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పనులకు సంబంధించి కొన్ని ఫొటోలను సైతం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి బోర్డులో ఎస్ఈ ర్యాంక్‌కు తక్కువ కాని వారు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత కమిటీ జూన్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది. జూలై 12లోగా ఈ కమిటీ తమ నివేదికను అందించాల్సి ఉంటుంది. ఆ ముద్ర పడకూడదని.. తెలంగాణాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోందనే ఆరోపణలు మొదట్నుంచీ ఉన్నాయి. ముఖ్యంగా ‘సీతారామ’డిజైన్ల విషయంలో కోర్రీల మీద కొర్రీలు వేస్తూ వస్తోంది. ఈ సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే ముద్ర పడటం మంచిది కాదనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే బ్యారేజీ, కరకట్టల దగ్గర జరుగుతున్న పనులు ఆపేయాలంటూ నిర్మాణ సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం సీతారామ ఇంజనీర్లను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్‌లో స్టే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. అయితే బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది. మరోవైపు నష్టపరిహారం సైతం తగు మొత్తం చెల్లించడం లేదంటూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు బాధితుల్లో కొందరు సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్నారంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 26న గ్రీన్ ట్రిబ్యునల్ పనులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం
తిరుమలాయపాలెం: రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చి న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రస్తు తం అందరి ముందున్న లక్ష్యమని, జెండా ఏదైనా అజెండా ఒక్కటేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆదివారం నిర్వహించిన పాలే రు నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నిధులు, నీ ళ్లు, నియామకాలు అని చెప్పి అధికారంలో కి వచ్చారని, రాష్ట్రంలో నేడు అప్పులు, రైతులు, యువత ఆత్మహత్యలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. 20కి మించి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన గ్రా మం ఉంటే చూపించాలని పొంగులేటి సవాల్ విసి రారు. 36.86 లక్షల మంది రైతుల్లో 5.86 లక్షల మందికే రుణమాఫీ చేశారని, ఇంకా 31 లక్షల మందికి రుణ మాఫీ కాలేదని, బడ్జెట్లోనూ దానికి ప్రత్యేక నిధులు కేటాయించలేదని విమర్శించారు. రూ.19,600 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు ఆరేళ్లలో రూ.6,200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇంకా రూ.13 వేల కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉందని, సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతామన్న పెద్దమనిషి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయ డంలో కేసీఆర్ దిట్ట అన్నారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సీతారామ’ కొత్త ఆయకట్టు కొంతేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డు ప్రశ్నల వర్షం కురిపి స్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రం నుంచి స్పష్టత కోరిన బోర్డు తాజాగా మరో లేఖను సంధిం చింది. గతంలో గరిష్ట వరద వచ్చినప్పుడు ఉండే ముంపు సమస్యలు, ప్రాజెక్టు డిజైన్లపై పలు ప్రశ్నలు లేవనెత్తిన బోర్డు.. తాజాగా కొత్త ఆయ కట్టుకు ప్రతిపాదించిన నీటి వినియోగం, విద్యుత్ లెక్కలపై ప్రశ్నలు వేసింది. పాక్షిక వివరాలతో నివేదికను ఆమోదించలేమని, పూర్తి వివరాలను వీలైనంత త్వరగా తమకు సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. బోర్డు సంధించిన ప్రశ్నలు ఇలా.. ► పాత ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా 33 టీఎంసీలను వినియోగిస్తూ 4.10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతిపాదిం చారు. తదనంతరం సమీకృత దుమ్ముగూడెం ప్రాజెక్టును 50 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతి పాదించారు. కానీ ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 70 టీఎంసీల నీటిని తీసుకుంటూ కేవలం 3.35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టునే ఎందుకు ప్రతిపాదించారో కారణాలు చెప్పాలి. ► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షల క్యూసెక్కులుగా ఉన్నప్పుడు గోదావరి నీటిమట్టం 62.86 మీటర్లుగా ఉంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు గరిష్ట నీటిమట్టం 60.43 మీటర్లుగా ఉంది. కానీ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్‌ను 56.5 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్‌వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ అంశానికి సంబంధించి అన్ని వరద లెక్కల వివరాలు సమర్పించాలి. ► గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని వినియోగిస్తామని తెలిపారు. మరి వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీలను ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలి. ► ఇక 70 టీఎంసీలను తరలిస్తున్నా ఆ నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవా? ► ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న హెడ్‌రెగ్యు లేటర్‌ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకొనేలా డిజైన్ చేయగా కాల్వ సామర్థ్యాన్ని మాత్రం 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారు. దీనిపై తేడాలెందుకో తెలపాలి. ► ప్రాజెక్టు అప్రైజల్ కమిటీకి ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు విద్యుత్ అవసరాలు 694 మెగావాట్లుగా పేర్కొనగా డీపీఆర్‌లో వాటిని 725 మెగావాట్లుగా పేర్కొన్నారు. ఏది సరైనదో వివరణ ఇవ్వాలి. ► స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధర, డీపీఆర్‌లో పేర్కొన్న యూనిట్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఇందుకుగల కారణాలు తెలపాలి. ► ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 1,480 టీఎంసీల గోదావరి లభ్యత జలాల్లో 900 టీఎంసీలు తమవేనని తెలంగాణ చెబుతోంది. కానీ డీపీఆర్‌లో సాంకేతికంగా 1,480 టీఎంసీల నీటికి ఆమోదం లభించలేదని వ్యాప్కోస్ తెలిపినట్లుగా పేర్కొ న్నారు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన తెలంగాణ నీటిని వినియోగిస్తుందో స్పష్టత ఇవ్వాలి. -
Sitarama project: ముంపు సంగతేంటి...?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై సునిశిత పరిశీలన చేస్తున్న గోదావరి బోర్డు.. తాజాగా సీతారామ ఎత్తిపోతలపై అనేక ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు హైడ్రాలజీ వివరాలు, డ్రాయింగ్లు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, నిధుల ఖర్చులు, వచ్చిన అనుమతులకు సంబంధించి అన్ని వివరాలు తమ ముందుంచాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. డీపీఆర్ ఆమోద ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా తాము కోరిన వివరాలన్నీ సమర్పించాలంటూ తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. ఇందులో ప్రధానంగా.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షలుగా ఉన్నప్పుడు గోదావరి నీటి మట్టం 62.86 మీటర్లుగా ఉందని పేర్కొంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు అత్యధిక నీటి మట్టం 60.43 మీటర్లు ఉందని చెప్పింది. కానీ, ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ 56.5 మీటర్లులో నిర్మి స్తున్నారని, గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్‌వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోందన్న అనుమానాన్ని బోర్డు వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర వరదల లెక్కలతో తమకు నివేదించాలని కోరింది. రబీకి ఎక్కడి నుంచి మళ్లిస్తారు... ఇక గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకుంటా మంటున్నారని, వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలని కోరింది. హెడ్‌రెగ్యులేటర్‌ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా డిజైన్ చేయగా, కాల్వ సామర్థ్యాన్ని 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారని, ఈ తేడాలెందుకో తెలపాలని కోరింది. ఇప్పటికే ప్రాజెక్టులో 50శాతం పనులు పూర్తయ్యా యని చెబుతున్నారని, అయితే ప్రస్తుతం మిగిలిన పనులు, నిధుల ఖర్చు వివరాలు తెలపాలంది. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ అవసరాలు, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధరలు, దీనికి అనుగుణంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలు అందించాలని తెలిపింది. గోదావరికి సంబంధించి తెలంగాణ, ఏపీ సరిహద్దులుగా ఉన్న కొత్త మ్యాప్‌లు, పరివా హక రాష్ట్రాలో వివిధ సందర్భాల్లో జరిగిన ఒప్పం దాల నివేదికలు తమ ముందుంచాలని తెలిపింది. కాళేశ్వరం, సీతారామ ద్వారా 307 టీఎంసీల మేర నీటిని తెలంగాణ వినియోగిస్తుందన్నందున దుమ్ముగూడెం వద్ద లభ్యతగా ఉండే మిగతా జలాలు, సహజ(ఎకో) ప్రవాహాల వివరాలు అందించాలంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు లభించిన అన్ని రకాల అనుమతులు ముఖ్యంగా పర్యావరణ, అటవీ, రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం వంటి వివ రాలను సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. -
‘సీతారామ ప్రాజెక్టు’ వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(కేసీఆర్) అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సిఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. చదవండి: ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేసీఆర్ గుడ్‌న్యూస్ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సీలు మురళీధర్ రావు, హరేరామ్, సిఇలు వెంకట కృష్ణ, శంకర్ నాయక్, మధు సూదన్ రావు, ఎస్.ఇ. శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు ‘‘అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది. దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటి ద్వారా ఖమ్మం జిల్లా యావత్తు నీరు అందించవచ్చు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి, అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్ కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలి. సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాలువలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాలి. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్ కల్లా పూర్తి చేయాలి. కృష్ణా నదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదు. అంతా అనిశ్చితి ఉంటుంది. కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి’’ అని సిఎం చెప్పారు. -
‘సీతారామ’ వేగం పెంచండి
సాక్షి, కొత్తగూడెం: కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, మే చివరికల్లా మొదటి ప్యాకేజీ పనులు పూర్తవ్వాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ ఆదేశించారు. శనివారం అశ్వాపురం మండలంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చిన బృందం నేరుగా అశ్వాపురం గౌతమీనగర్ హెవీవాటర్ ప్లాంట్‌లోని పర్ణశాల అతిథి గృహానికి చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుమ్మరిగూడెం వద్ద ప్రస్తుతం ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీతమ్మసాగర్ పేరుతో మరో ఆనకట్ట నిర్మించేందుకు నిర్ణయించిన ప్రాంతాన్ని పరిశీలించారు. మ్యాప్‌ల ద్వారా కాంటెక్ సంస్థ, అధికారులతో మాట్లాడి కొత్త బ్యారేజీ ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం, వరద ముంపు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంప్‌హౌసులు, కెనాల్ పనుల వివరాలు తెలు సుకున్నారు. అనంతరం బీజీకొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మొదటి ప్యాకేజీ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ అధికారులు, నిర్మాణ సంస్థ బాధ్యులతో మాట్లాడి పంప్‌హౌస్ పనుల పురోగతిని, పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే వివరాలు తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం సీతారామ పనుల తీరుపై మేఘా సంస్థ అధికారులతో సీతారాంపురం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. విద్యుత్ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలని సూచించారు. 8 ప్యాకేజీలపై సమగ్ర సమీక్ష పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండొద్దని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నిర్ణీత కాలంలోనే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు 8ప్యాకేజీల పనులను రజత్‌కుమార్ సమగ్రంగా సమీక్షించారు. మొదటి ప్యాకేజీలో 75 శాతం పనులు పూర్తి కావచ్చాయని, రెండో ప్యాకేజీ పనులను వేగవంతం చేశామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పనులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఎస్ఈ నాగేశ్వరరావును ఆదేశించారు. 3వ ప్యాకేజీ పనులు పురోగతిలో ఉన్నాయని, 4వ ప్యాకేజీలో మిషన్ భగీరథ పైపులైన్ల పనుల కారణంగా 60 శాతం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇసుక కొరత ఉందని, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఇసుక విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. మార్చి 22 నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు ఒక దశకు వచ్చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈలు వెంకటకృష్ణ, నాగేశ్వరరావు, ఈఈ బాబురావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులున్నారు. -
‘సీతారామ’ ప్రాజెక్ట్ పరిశీలనకు సీఎం కేసీఆర్?
సాక్షి, కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో భద్రాద్రి జిల్లాలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంను జిల్లాకు తీసుకొచ్చేలా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినట్లేనని రేగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకే. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని సైతం ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్ వద్ద ఒక లింక్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బంది వచ్చినా ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజీకొత్తూరు వద్ద ఫేస్–1 పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశముంది. ఇక తాజాగా దుమ్ముగూడెం వద్ద రూ.3,400 కోట్లతో మరో ఆనకట్ట నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు నీటి కొరత లేకుండా 30 టీఎంసీలా నీరు నిల్వ ఉండేలా దీనికి రూపకల్పన చేశారు. గోదావరిలో ప్రతిఏటా వస్తున్న వరద నీరంతా వృథాగా సముద్రంలోకి వెళుతోంది. మరోవైపు గత వేసవిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో అశ్వాపురం మండలంలోని భారజల కర్మాగారంలో రెండురోజుల పాటు ఉత్పత్తి నిలిపేశారు. దుమ్ముగూడెం హైడల్ ప్లాంట్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మరో ఆనకట్ట నిర్మించేలా కార్యాచరణ రూపొందించారు. రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్.. ఏజెన్సీ ఏరియాలో సాగునీటి కోసం రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత నెల 21న నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి మణుగూరు సబ్‌డివిజన్‌లో పర్యటించారు. 30వ తేదీన మంత్రి అజయ్‌కుమార్ పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యటించిన సీఎం.. సీతారామ ప్రాజెక్టు వద్దకు రానున్నారు. అలాగే జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పడంతో పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సీఎం పర్యటన ఖాయమైనట్లే పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన మొదట పినపాక నియోజకవర్గంలో ఉండేలా కృషి చేశాను. సీఎం అంగీకారంతో ఇది సాధ్యమవుతోంది. పోడుభూముల సమస్య పరిష్కారానికి కూడా కేసీఆర్ అంగీకరించారు. సీఎం పర్యటన తరువాత ఈ సమస్య కొలిక్కి వస్తుంది. – రేగా కాంతారావు, ప్రభుత్వ విప్ -
‘సీతారామ’ పూర్తి చేయిస్తా
సాక్షి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉభయ జిల్లాల ప్రజల సమస్యలు తనకు కూలంకశంగా తెలుసునని, రెండు జిల్లాల అభివృద్ధికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో గోదావరి నీళ్లు తాగి, మైదాన ప్రాంతంలో పెరిగానని అన్నారు. ఉమ్మడి జిల్లాపై పట్టు ఉందని, ప్రజలతో తన కు, తన కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తనకు మంత్రి పదవి ఉన్నప్పటికీ ఎప్పటిలా సామాన్యుడిలాగే ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటా నని తెలిపారు. తన కుటుంబం కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చిందని, తాను కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నానని.. క్రమశిక్షణతో తన బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు. జిల్లాకు అతి ముఖ్యమైన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రానైట్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, తన వద్దకు వచ్చిన ప్రతి సమస్యనూ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని, వడివడిగా జిల్లాల అభివృద్ధి ముందుకు సాగేలా కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గాన్ని అభి వృద్ధి చేసుకునే అవకాశం వచ్చిం దని, నగరం అభివృద్ధికి ఇప్పటికే పలుచోట్ల రోడ్ల విస్తరణ చేసి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, ప్రజలు సహకరిస్తే మిగిలిన రోడ్ల వైడింగ్ చేపడతామని వివరించారు. రోడ్లపై ఏర్పడిన గుం తలను పూడ్చేందుకు ప్రస్తుతానికి ప్యాచ్ వర్క్‌లు చేయిస్తున్నామని, వర్షాలు కురుస్తుండడంతో పనులు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం చివరి వరకు ఖమ్మంలో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఖమ్మంలో నిర్మిస్తున్న నూతన బస్ స్టేషన్‌ను మోడల్ బస్ స్టేషన్‌గా చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో పర్యటించిన తాను త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి సమస్యలపై దృష్టిసారిస్తానని ప్రకటించారు. -
ఆగస్టులో ట్రయల్ రన్
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్టు మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. మండల పరిధిలోని వీకే రామవరం, కమలాపురం గ్రామాల్లో జరుగుతున్న పంప్‌హౌస్, కెనాల్ నిర్మాణ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వీకే రామవరంలో జరుగుతున్న పనులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కమలాపురంలో పనులు నత్తనడకన జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకుని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులు చేయాలి కాని.. కుంటిసాకులు చెప్తూ జాప్యం చేయడమేమిటని ఏజెన్సీలను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పనులు జరగకపోవడానిక కారణాలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జాప్యం జరిగిన రోజులకు సంబంధించి సిబ్బంది వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. సైట్ మేనేజింగ్, ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయం ఏమాత్రం లేదన్నారు. దశల వారీగా రోజుకు ఎంత పని చేయాల్సి ఉందనే అంశంపై ప్రణాళిక తయారుచేసుకుని దాని ప్రకారం పనులు చేస్తే త్వరగా పూర్తవుతాయన్నారు. రోజువారీ ఎంత కాంక్రీట్ పనులు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకుని, మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను అందచేస్తామని, ఆ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మొదటి, రెండు, మూడు పంప్‌హౌస్‌ల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా సీఎం కార్యాలయం నుంచి సీసీ టీవీలు ఏర్పాటు చేసుకుని పనులను ప్రతీ రోజూ పర్యవేక్షిస్తానన్నారు. ప్రాజెక్ట్ మొదటి, రెండో దశలకు 6 మోటార్లు, మూడో దశకు 7 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్‌రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు గ్రావిటీ కెనాల్ 1,2,3,4,7,8 పనులు అక్టోబర్ మాసం చివరి నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్ పనుల్లో వేగం పెంచాలని, రానున్న వర్షాకాలం నాటికి సివిల్ పనులు పూర్తి చేయకపోతే వర్షాల వలన ఇబ్బందులు వస్తాయన్నారు. బీజీ కొత్తూరుకు వస్తుండగా కాలువ పనులు జరగడంలేదని గుర్తించానని, ఒక్క మనిషి కూడా కాలువ పనులు చేయడంలేదన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, సీఎంఓ ఓఎస్డీ పెద్దారెడ్డి, ఈఈ నాగేశ్వరరావు, ములకలపల్లి తహశీల్దార్ ముజాహిద్, ప్రతిమ ఏజెన్సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అశ్వాపురం: సీతారామ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ నిర్మాణ సంస్థను, అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ–1లో భాగంగా మండల పరిధిలోని బీజీకొత్తూరులో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్‌హౌస్ పనులను ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీతో కలిసి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ శుక్రవారం సందర్శించారు. పంప్‌హౌస్ పనులు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పంప్‌హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, పనులు ఎంత వరకు పూర్తయ్యాయి, పనుల్లో పురోగతిని, గోదావరి జలాలు పంప్‌హౌస్ వరకు ఎప్పటి వరకు తరలిస్తారనే వివరాలు తెలుసుకున్నారు. బీజీకొత్తూరు పంప్‌హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, కెనాల్‌పై వంతెనల నిర్మాణాలు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, జనవరి 23న పనులను సందర్శించిన సమయంలో మార్చిలో మోటర్లు డ్రై రన్ నిర్వహించి మే నెల కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదని, పనులపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని స్మితా సబర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ, అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో అలసత్వం వహిస్తే వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మొదటి పంహౌస్ , కెనాల్ పనులు వేగవంతం చేయాలన్నారు. మోటర్లు, పంపులు అమర్చే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ కల్లా పాలేరు జలాలకు సీతారామ జలాలు అనుసంధానం చేసేలా పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో అలసత్వం వహించినా, పనులు గడువు లోపు పూర్తి చేయకున్నా ఊరుకునేది లేదని తగిన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థను, ప్రాజెక్ట్ అధికారులను హెచ్చరించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రతీ రోజు జరిగిన పనులపై తనకు పూర్తి నివేదిక అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈ టీ.నాగేశ్వరరావు, ఈఈ బాబూరావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం శ్రీనివాసరావు, ఏఈలు రమేష్, శ్రీనివాస్, స్వాతి, రాజీవ్‌గాం«ధీ, దుర్గాప్రసాద్, మణుగూరు డీఎస్పీ సాయిబాబా, సీఐ రమేష్, తహసీల్దార్ అరుణ, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
‘సీతారామ’లో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగు అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. కేంద్ర అటవీ మరియు పర్యావరణ మం త్రిత్వ శాఖ ప్రాజెక్టుకు అవసరమైన తుది పర్యావరణ అనుమతికి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ యస్.కర్కెట్ట అనుమతుల మంజూరుకు సంబంధించి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వి.సుధాకర్‌కు మంగళవారం లేఖ పం పించారు. గతేడాది నవంబర్ 27న జరిగిన ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) సమావేశంలో సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని ఈ ప్రాజెక్టు అధికారులు కేంద్ర పర్యావరణ శాఖకు సిఫారసు చేసిన సంగతి తెలి సిందే. వారి సిఫారసు మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అనుమతిని జారీ చేసింది. పనులకు తొలగిన అడ్డంకి దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్ జిల్లాల్లో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు మరియు 1,39,836 హెక్టార్ల స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో 3 జిల్లాల్లో 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు దారి పొడుగునా చిన్న నీటి చెరువులను నింపడం, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఒక హెడ్ రెగ్యులేటర్‌ని, 372 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 4 పంప్‌హౌజ్‌ల నిర్మాణం, డెలివరీ సిస్టర్న్ నిర్మాణం, 9 కిలోమేటర్ల పైప్ లైన్, వాగులపై క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్, టన్నెల్స్, కాలువలపై క్రాస్ రెగ్యులేటర్లు మరియు తూముల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణాలకు మొత్తంగా 8,476 హెక్టార్ల భూమి అవసరం ఉండగా అందులో 1,531 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఈ భూముల వినియోగానికి పర్యావరణ అనుమతి తప్పనిసరి. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి పొందేందుకు గత ఆగ స్టులో మూడు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ అభిప్రాయ సేకరణ వివరాలతో కూడి న నివేదికను సాగునీటి శాఖ ఈఏసీకి సమర్పించగా, అన్ని పరిశీలించిన ఈఏసీ శాఖ అధికారులు.. ఇచ్చిన వివరణలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. వారి సిఫారసు మేరకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ – 2006కి లోబడి మంత్రిత్వ శాఖ ఈ నెల 7న తుది పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుకు లేఖ రాసింది. ఈ అనుమతి పదేళ్ళ వరకు మనుగడలో ఉంటుందని లేఖలో పేర్కొంది. వచ్చే ఖరీఫ్ నాటికే తొలి ఫలితాలు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.13,384.80 కోట్లు కాగా, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మూడేళ్లల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. తొలి ఫలితాలు మాత్రం ఈ జూన్, జూలై నాటికి పొందేలా కార్యాచరణ రూపొందించింది. ప్రాజెక్టుల పరిధిలోమూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణం చేయనుండగా ఇం దులో మొదటి పంప్‌హౌజ్‌ను జూన్, జూలై నాటికి, రెండో పంప్‌హౌజ్‌ను ఆగస్టు, సెప్టెంబర్ నాటికి, మూడో పంప్‌హౌజ్‌ను అక్టోబర్, నవంబర్‌నాటికి పూర్తి చేసేలా సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో నీళ్లందని ఆయకట్టుకు సీతారామ ద్వారా వచ్చే ఖరీఫ్‌లోనే నీళ్లందించాలని సూచించారు. దీనికోసం 130 కిలోమీటర్ల కాల్వల తవ్వకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కాల్వల తవ్వకం పూర్తయితే.. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేసి సాగర్ కింది కాల్వలకు కలపాలని, వీలైనన్ని ఎక్కువ చెరువులు నిలపాలని సైతం సీఎం సూచించినట్లుగా తెలిసింది. ఫలించిన కేసీఆర్ దౌత్యం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ని కలిసి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని కోరారు. అనంతరం మంత్రి హర్షవర్ధన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగానూ ఈ అంశాన్ని కేసీఆర్ మరోసారి లేవనెత్తారు. ఈ దౌత్యం ఫలించి అనుమతులు మంజూరయ్యాయని అధికారులంటున్నారు. పర్యావరణ అనుమతిని మంజూరు చేసినందుకు కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం సీఎం కేసీఆర్ జరిపిన దౌత్యం ఫలించింది. ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు పొందిన సీతారామ ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. -
జూన్‌లోగా ‘సీతారామ’ మొదటి దశ పనులు
సాక్షి, కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ బృందం తెలిపింది. గురువారం ఐదుగురు ఇంజనీర్ల బృందం భద్రాద్రి జిల్లాలో పర్యటించింది. సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద జరుగుతున్న మొదటి దశ పంప్‌హౌజ్, పాల్వంచ మండ లం నాగారం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద జరుగుతున్న రెండోదశ పంప్‌హౌజ్, కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్‌హౌజ్ పనులను పరిశీలించింది. అనంతరం ఒడ్డురామవరం వద్ద విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఎస్పీ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి నుంచి ఈ పథకాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మిం చాలనుకున్న రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌లను కలిపి రీ ఇంజినీరింగ్ చేసి సీతారామ రూపొందించినట్లు తెలిపారు. చురుకుగా పనులు సీతారామ మొదటి దశ పంప్‌హౌస్ వరకు మెయిన్ కెనాల్ పనులు చురుకుగా జరుగుతున్నాయని ఎంఎస్పీ రెడ్డి తెలిపారు. ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద నిర్మిస్తున్న రెండోదశ పంప్‌హౌజ్ పను లు వచ్చే అక్టోబరులోగా పూర్తవుతాయని తెలిపారు. ములకలపల్లి మండలంలోని కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్‌హౌజ్ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.110 కిలోమీటర్ల కెనాల్లో 50 కిలోమీటర్ల కెనాల్ 3,800 ఎకరాల అటవీ ప్రాంతం లో ఉందన్నారు. ఇందుకు సంబంధించి అటవీ అనుమతులు తీసుకున్నారన్నారు. దీంతో ఆటంకా లు లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు.వచ్చేనెలలో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ బృందంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.చంద్రమౌళి, వ ర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్, ఉపాధ్యక్షులు డాక్టర్ రమణనాయక్, మహాత్మరెడ్డి ఉన్నారు. వీరి వెంట సీతా రామ సీఈ సుధాకర్, ఎస్ఈ నాగేశ్వరరావు ఉన్నారు.