సాక్షి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంప్ హౌస్లను మంత్రులు పరిశీలించారు
అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామన్న ఉత్తమ్.. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు పనులు వేగవంతం చేయాలని ఉత్తమ్ అన్నారు.
‘‘గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు ఎటువంటి అనుమతులు లేవు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు తీసుకుని వచ్చాం. సీతారామ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నాం. 2026న ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి గోదావరి జలాలు అందిస్తాం సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా లక్షా 52 వేలు సాగులోకి వస్తుంది. పాలేరు లింకు కెనాల్‌కి నీళ్లు అందిస్తాం. పాలేరు కింద నాగార్జున సాగర్ కింద భూములకు నీరు అందుతుంది. భద్రాచలం, ఇల్లందుకు సీతారామ ప్రాజెక్టు వచ్చేలా చేస్తాం’’ అని ఉత్తమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment