
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం సీఎం కేసీఆర్ జరిపిన దౌత్యం ఫలించింది. ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు పొందిన సీతారామ ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment