Environmental clearance
-
Fact Check: రామోజీ.. ఇసుకపై బురద రాతలు మానవా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రామోజీరావు వక్రరాతలు మానడంలేదు. నిత్యం తన ఈనాడు పత్రికలో ఇసుకపై బురద వార్తలు రాస్తూనే ఉన్నారు. తన గలీజుతనాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్నారు. ఇసుక తవ్వకాల్లో లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు రామోజీరావు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తనకు చెప్పినట్లే కథనాలు అల్లేస్తున్నారు. వాటిని చూసి ప్రజలు నమ్మేస్తారని అపోహ పడుతున్నారు. చంద్రబాబు హయాంలో గతంలో ఎప్పుడూ లేనంత పెద్దఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజలకు సులభంగా ఇసుక అందుతున్నా కూడా ప్రభుత్వంపై దు్రష్పచారానికి ఒడిగడుతున్నారు. నిజానికి ఇసుక తవ్వకాల్లో ఎన్జీటీ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 110 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు ఉన్నా.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలతో వాటిల్లో తవ్వకాలను నిలిపివేసింది. తర్వాత ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరిగి అన్ని అనుమతుల కోసం గనుల శాఖ దరఖాస్తు చేసింది. అందులో భాగంగా ఇప్పటివరకు 61 ఓపెన్ రీచ్‌లకు అనుమతులు లభించాయి. మిగిలిన వాటికి మరో వారం రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్న డీసిల్టింగ్ పాయింట్లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా ‘ఉల్లంఘనలు నిజం’ అంటూ పతాక శీర్షికతో పచ్చి అబద్ధాలను ఈనాడు అచ్చేసింది. ఎన్జీటీకి 3 నెలలకోసారి నివేదిక ఇచ్చేలా చర్యలు ఇసుక విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్జీటీ నుంచి వచ్చిన సూచనలు, మార్గదర్శకాలతో దీన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు గనుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం తనిఖీలు న్యాయస్థానాల ఆదేశాలతో జిల్లాల కలెక్టర్లతో కూడిన బృందాలు రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఇటీవల పరిశీలించాయి. ఆయా రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా అనే అంశాలను రికార్డు చేశాయి. ఈ నివేదికలను న్యాయస్థానాలకు సమర్పించారు. ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ తీసుకున్న చర్యల కారణంగా అనుమతి లేని రీచ్‌ల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. ఇదే అంశాన్ని కలెక్టర్లు కూడా తమ నివేదికలో స్పష్టం చేశారు. ఈనాడు మాత్రం కలెక్టర్లు వచ్చి వెళ్లిన తరువాత ఇసుక తవ్వకాలు మళ్లీ జరుగుతున్నాయంటూ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచురించింది. అదికూడా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలించి వెంటనే తవ్వకాలు ప్రారంభించారంటూ నిస్సిగ్గుగా రాసింది. ఒకవైపు ఇసుక రీచ్‌ల్లో అధికారిక తనిఖీలు జరుగుతూ ఉంటే, మరోవైపు ఎవరైనా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలిస్తారా? అసలు తవ్వకాలే జరగడం లేదని అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదిక ఇస్తే, రోజుకు రెండు వేల టన్నుల ఇసుక తవ్వుతున్నారంటూ, కంప్యూటరైజ్డ్ వే బిల్లులు లేకుండానే ఆ ఇసుకను రవాణా చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. పాత ఫోటోలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేసింది. జరగని రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్ లేదంటూ, రీచ్‌ల్లో సీసీ కెమేరాలు లేవని, అడుగడుగునా ఉల్లంఘనలే జరుగుతున్నాయని గగ్గోలు పెట్టడం రామోజీ వక్రబుద్ధికి నిదర్శనం. ఆ పత్రికకు నిబద్ధత ఎక్కడిది? గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వర్షాల వల్ల ఇసుక తవ్వకాలు రీచ్‌ల్లో జరగలేదు. వేసవికాలంలో ముందుజాగ్రత్తగా సిద్ధం చేసిన ఇసుక డిపోల నుంచే ప్రజలకు విక్రయాలు జరిగాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ ఈనాడు పత్రిక దానిని అక్రమ ఇసుక తవ్వకాలు కిందనే నిర్ధారించడం ఆ పత్రికకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. బాధ్యతారహితంగా ఈనాడు ప్రచురించే ఇటువంటి కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, మైనింగ్ శాఖ -
మన రోల్ మోడల్.. ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ!
పండ్లు అమ్మే ఒక మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని అంకోలా బస్టాండ్‌లో పండ్లు అమ్మే ఒక మహిళ ‘పండ్లు అమ్మడమే కాదు పరిసరాల పరిశుభ్రత కూడా నా బాధ్యత’ అంటోంది. బస్ స్టాండ్ పరిసరాల్లో ఎక్కడ పండ్ల తొక్కలు కనిపించినా వాటిని తీసుకువచ్చి చెత్త డబ్బాలలో వేస్తూ ఉంటుంది. ‘ఇలా చేయమని ఎవరైనా చెప్పారా?’ అని అడిగితే– ‘ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ’ అంటుంది. ఈ మహిళ వీడియో క్లిప్‌ను ఆదర్శ్ హెగ్డే అనే యువకుడు ట్విట్టర్లో షేర్ చేస్తే వైరల్ అయింది. నెటిజనులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘మన రోల్ మోడల్’ ‘ఎంత గొప్ప మనసో!’ ‘రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్’ ‘నిజమైన హీరో కోసం ఎన్నో ఏళ్లుగా వెదుకుతున్నాను. ఇవాళ్టికి దొరికింది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. This lady is fruit seller & she sells fruits wrapped in leaves at Ankola Bus stand,Karnataka. Some people after finish eating they throw the leaves from bus window. But this lady goes there picks up the leaves and puts it in dustbin. Its not her work but she's doing it. 🙂🙏👍 pic.twitter.com/TaqQUGZuxP — Adarsh Hegde (@adarshahgd) April 10, 2023 -
2025 నాటికి కోటి టన్నుల ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్ సిమెంట్స్ భారీగా విస్తరిస్తోంది. 2025 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10 మిలియన్ టన్నులకు (కోటి టన్నులకు) చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రతి 10 ఏళ్లకు సామర్థ్యాన్ని రెండింతలు చేయాలన్నది సంస్థ ధ్యేయం. ప్రస్తుతం ఉన్న మూడు ప్లాంట్లతో కలిపి సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 5.75 మిలియన్ టన్నులు. తాజా విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్, ఒడిశాలో ఏర్పాటు చేయనున్న రెండు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను దక్కించుకుంది. ఈ నెలలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వాల కాలుష్య నియంత్రణ మండలి నుంచి క్లియరెన్సులు రానున్నట్లు సాగర్ సిమెంట్స్ జేఎండీ సమ్మిడి శ్రీకాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇవి పూర్తి అయితే తయారీ సామర్థ్యం 8.25 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ఒక్కొక్కటి రూ.725 ధరలో 31,00,000 కన్వర్టబుల్ వారంట్లను జారీ చేస్తామని తెలిపారు. 2021 మార్చికల్లా పూర్తి.. కంపెనీ ఒక మిలియన్ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద ఏర్పాటు చేస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 5.5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును సైతం నిర్మిస్తోంది. వీటి కోసం రూ.425 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో ఈక్విటీ రూ.150 కోట్లు ఉంటుంది. ఇక ఒడిశాలోని జాజ్‌పూర్ వద్ద ఉన్న జాజ్‌పూర్ సిమెంట్స్‌ను(జేసీపీఎల్) ఇటీవలే రూ.108 కోట్లు వెచ్చించి సాగర్ సిమెంట్స్ దక్కించుకుంది. 100 శాతం అనుబంధ సంస్థగా ఉండే జాజ్‌పూర్ సిమెంట్స్ ద్వారా రూ.308 కోట్లతో 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నా రు. ప్రతిపాదిత కొత్త ప్రాజెక్టుల కోసం యంత్రాలకై ఆర్డర్లు ఇచ్చామని, డెన్మార్క్, జర్మనీకి చెందిన దిగ్గజ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయని చెప్పారాయన. 2021 మార్చికల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కొత్త మార్కెట్లకు.. సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం దక్షిణాది మార్కెట్లతోపాటు మహారాష్ట్ర, ఒడిశాలో విస్తరించింది. ఇండోర్ ప్లాంటు పూర్తయితే పశ్చిమ మధ్యప్రదేశ్, ఆగ్నేయ రాజస్తాన్, తూర్పు గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఇండోర్, వడోదర, బోపాల్, అహ్మదాబాద్ నగరాలు 110 నుంచి 330 కిలోమీటర్ల పరిధిలో ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఒడిశా ప్లాంటు రాకతో ఉత్తర, మధ్య ఒడిషా, తూర్పు ఛత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్, దక్షిణ పశ్చిమ బెంగాల్లో సిమెంటు మార్కెట్ చేసేందుకు వీలవుతుంది. భువనేశ్వర్, కటక్, బాలాసోర్, కోల్‌కతా, రాంచి, జంషెడ్పూర్ పట్టణాలను కవర్ చేయవచ్చునని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లుగా ధర పెంచలేదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు కావాల్సిన సిమెంటును రెండేళ్లుగా కంపెనీలు తక్కువ ధరలో సరఫరా చేస్తున్నాయి. డీజిల్ ధర ఈ రెండేళ్లలో 25 శాతం పెరిగిందని, వ్యయ భారం ఉన్నా హామీ ఇచ్చిన ధరలోనే కంపెనీలు సిమెంటును సప్లయ్ చేశాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల్లో గతేడాది సిమెంటు అమ్మకాల్లో 40 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది వృద్ధి స్థిరంగా ఉండొచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం సీఎం కేసీఆర్ జరిపిన దౌత్యం ఫలించింది. ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు పొందిన సీతారామ ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. -
50 వేల చ.మీ. ప్రాజెక్ట్‌లకు ఈసీ అక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: దేశీయ నిర్మాణ రంగానికి కాసింత ఉపశమనం లభించింది. 20 వేల చ.మీ. నుంచి 50 వేల చ.మీ. బిల్టప్ ఏరియాలో నిర్మించే నివాస ప్రాజెక్ట్ లకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ (ఈసీ) మున్సిపల్ శాఖలోనే తీసుకునే వీలుంది. 20 వేల చ.మీ. నుంచి 1.50 లక్షల చ.మీ. బిల్టప్ ఏరియాలో నిర్మించే పారిశ్రామిక షెడ్లు, ఆసుపత్రులు, హోటల్స్ వంటి వాణిజ్య ప్రాజెక్ట్‌లకైతే (కేటగిరీ–బీ) కూడా స్థానికంగానే తీసుకునేలా కేంద్రం నిబంధనలను సడలించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీ)ల్లోని భవన నిర్మాణ నిబంధనల్లోనే ఇంటిగ్రేట్ చేస్తారు. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలు, పంచాయతీలు, డీటీసీపీ పరిధిలోనే పర్యావరణ అనుమతులు మంజూరవుతాయి. ఆయా ప్రాజెక్ట్లల్లో సహజ మురుగు నీటి వ్యవస్థ, నీటి సంరక్షణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, పునరుత్పాదక విద్యుత్, వ్యర్థాల నిర్వహణ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. గడువులోగా పూర్తవుతాయ్.. స్థానికంగానే ఈసీ అనుమతులు మంజూరు చేస్తే ప్రాజెక్ట్‌లు గడువులోగా పూర్తవ్యటమే కాకుండా వడ్డీల భారం తగ్గుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌లను చేసేందుకు డెవలపర్లు ముందుకొచ్చే అవకాశముంటుందని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు జక్సే షా తెలిపారు. -
మొదలు కానున్న ‘తుపాకులగూడెం’!
పర్యావరణ క్లియరెన్స్‌లతో బ్యారేజీ నిర్మాణ పనులకు లైన్‌క్లియర్ సాక్షి, హైదరాబాద్: గోదావరిలో నికర, మిగులు జలాలను వాడుకునేందుకు చేపట్టిన కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో మొదలు కానున్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యావరణ అనుమతులు తెచ్చుకు నేందుకు ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ బ్యారేజీ పనులకు అను మతిని ఇవ్వడంతో.. పనులు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక ప్రాజెక్టు పరిధిలో 233 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించేందుకు అధికారులు సిద్ధమవు తున్నారు. 2.28 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో మొత్తం 50 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి దేవాదుల, ఎస్సారెస్పీల కింద ఉన్న 6 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఆ గ్రామాల ముంపు కారణంగానే.. కంతనపల్లి బ్యారేజీ నీటి నిల్వలను 85 మీటర్లకు నిర్ణయించ డంతో ఎఫ్ఆర్ఎల్లోని 100 మీటర్ల పరిధిలో 12 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11వేల ఎకరాల భూసేకరణ అవసరం. దీంతో ప్రాజెక్టు ప్రతిపాదనను కంతనపల్లి నుంచి మార్చి తుపాకులగూడెం వద్ద నిర్మించాలని నిర్ణయించారు. కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి రూ.1809 కోట్లతో అంచనా ఉండగా దాన్ని ఓ కాంట్రాక్టు సంస్థ 9% లెస్తో రూ.1643.67 కోట్లకు పనులు దక్కించుకుంది. అనంతరం మారిన ప్రతిపాదన కారణంగా తుపాకులగూడెం బ్యారేజీ అంచనాలను కొత్తగా రూ.2121 కోట్లతో సిద్ధం చేశారు. -
జీవీకే ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా సర్కారు పచ్చజెండా
జీవీకే సంస్థ క్వీన్స్‌లాండ్‌లో తలపెట్టిన కెవిన్స్ కార్నర్ ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పర్యావరణ అనుమతి మంజూరుచేసింది. 2011 సంవత్సరంలో జీవీకే గ్రూప్ ఆస్ట్రేలియాలోని కెవిన్స్ కార్నర్ ప్రాజెక్టులో నూరు శాతం వాటాను టేకోవర్ చేసింది. దాంతోపాటు ఆల్ఫా కోల్, ఆల్ఫా వెస్ట్ కోల్ ప్రాజెక్టులలో 79 శాతం వాటా పొందింది. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని, దీనివల్ల అనేకమందికి ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇలాంటి దానికి ఆస్ట్రేలియా పర్యావరణ అనుమతులు ఇవ్వడం కీలక నిర్ణయమని జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జీవీకే రెడ్డి అన్నారు. ప్రపంచానికి అత్యంత విశ్వాసపాత్రమైన బొగ్గు సరఫరాదారుగా నిలవాలన్న తమ లక్ష్యం దిశగా ఇదో మైలురాయిలా ఉంటుందన్నారు.