జీవీకే సంస్థ క్వీన్స్లాండ్లో తలపెట్టిన కెవిన్స్ కార్నర్ ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పర్యావరణ అనుమతి మంజూరుచేసింది. 2011 సంవత్సరంలో జీవీకే గ్రూప్ ఆస్ట్రేలియాలోని కెవిన్స్ కార్నర్ ప్రాజెక్టులో నూరు శాతం వాటాను టేకోవర్ చేసింది. దాంతోపాటు ఆల్ఫా కోల్, ఆల్ఫా వెస్ట్ కోల్ ప్రాజెక్టులలో 79 శాతం వాటా పొందింది.
ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని, దీనివల్ల అనేకమందికి ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇలాంటి దానికి ఆస్ట్రేలియా పర్యావరణ అనుమతులు ఇవ్వడం కీలక నిర్ణయమని జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జీవీకే రెడ్డి అన్నారు. ప్రపంచానికి అత్యంత విశ్వాసపాత్రమైన బొగ్గు సరఫరాదారుగా నిలవాలన్న తమ లక్ష్యం దిశగా ఇదో మైలురాయిలా ఉంటుందన్నారు.
జీవీకే ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా సర్కారు పచ్చజెండా
Published Fri, Nov 1 2013 3:54 PM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement