పండ్లు అమ్మే ఒక మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని అంకోలా బస్టాండ్‌లో పండ్లు అమ్మే ఒక మహిళ ‘పండ్లు అమ్మడమే కాదు పరిసరాల పరిశుభ్రత కూడా నా బాధ్యత’ అంటోంది. బస్ స్టాండ్ పరిసరాల్లో ఎక్కడ పండ్ల తొక్కలు కనిపించినా వాటిని తీసుకువచ్చి చెత్త డబ్బాలలో వేస్తూ ఉంటుంది. ‘ఇలా చేయమని ఎవరైనా చెప్పారా?’ అని అడిగితే– ‘ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ’ అంటుంది.
ఈ మహిళ వీడియో క్లిప్‌ను ఆదర్శ్ హెగ్డే అనే యువకుడు ట్విట్టర్‌లో షేర్ చేస్తే వైరల్ అయింది. నెటిజనులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘మన రోల్ మోడల్’ ‘ఎంత గొప్ప మనసో!’ ‘రియల్ ఉమెన్ ఎంపవర్‌మెంట్’ ‘నిజమైన హీరో కోసం ఎన్నో ఏళ్లుగా వెదుకుతున్నాను. ఇవాళ్టికి దొరికింది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి.
This lady is fruit seller & she sells fruits wrapped in leaves at Ankola Bus stand,Karnataka. Some people after finish eating they throw the leaves from bus window. But this lady goes there picks up the leaves and puts it in dustbin. Its not her work but she's doing it. 🙂🙏👍 pic.twitter.com/TaqQUGZuxP
— Adarsh Hegde (@adarshahgd) April 10, 2023
Comments
Please login to add a commentAdd a comment