garbage bin
-
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్‌లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్‌లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఉంది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. -
అది చెత్తకుండి కాదు..! కంట్రోల్ వాల్వ్..!!
కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్‌లైన్ భగత్‌నగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది. అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్‌బిన్‌గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్‌గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది. శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్‌కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్‌కు భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
మన రోల్ మోడల్.. ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ!
పండ్లు అమ్మే ఒక మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని అంకోలా బస్టాండ్‌లో పండ్లు అమ్మే ఒక మహిళ ‘పండ్లు అమ్మడమే కాదు పరిసరాల పరిశుభ్రత కూడా నా బాధ్యత’ అంటోంది. బస్ స్టాండ్ పరిసరాల్లో ఎక్కడ పండ్ల తొక్కలు కనిపించినా వాటిని తీసుకువచ్చి చెత్త డబ్బాలలో వేస్తూ ఉంటుంది. ‘ఇలా చేయమని ఎవరైనా చెప్పారా?’ అని అడిగితే– ‘ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ’ అంటుంది. ఈ మహిళ వీడియో క్లిప్‌ను ఆదర్శ్ హెగ్డే అనే యువకుడు ట్విట్టర్లో షేర్ చేస్తే వైరల్ అయింది. నెటిజనులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘మన రోల్ మోడల్’ ‘ఎంత గొప్ప మనసో!’ ‘రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్’ ‘నిజమైన హీరో కోసం ఎన్నో ఏళ్లుగా వెదుకుతున్నాను. ఇవాళ్టికి దొరికింది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. This lady is fruit seller & she sells fruits wrapped in leaves at Ankola Bus stand,Karnataka. Some people after finish eating they throw the leaves from bus window. But this lady goes there picks up the leaves and puts it in dustbin. Its not her work but she's doing it. 🙂🙏👍 pic.twitter.com/TaqQUGZuxP — Adarsh Hegde (@adarshahgd) April 10, 2023 -
చెత్త బుట్టలో ఉంగరాన్ని పడేసుకున్న మహిళ.. ‘స్పందన’తో స్పందన
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ చిత్రమైన ఫిర్యాదు అందింది. ఒక మహిళ ఫోన్ చేసి తన ఉంగరం పొరపాటున ప్రభుత్వ చెత్త బుట్టలో పడిపోయిందని చెప్పింది. ఆ ఉంగరాన్ని వెతికించి.. ఇవ్వాలని కోరింది. దీంతో శానిటేషన్ సిబ్బంది చెత్తనంతా జల్లెడ పట్టి.. చివరకు ఉంగరాన్ని ఆమెకు అప్పగించారు. వివరాలు.. ఇన్నీస్‌పేటకు చెందిన నాగలక్ష్మి సోమవారం తన ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి.. సమీపంలోని ప్రభుత్వ చెత్త తొట్టెలో వేసింది. ఆ తర్వాత కొంతసేపటికి.. తన చేతికి ఉన్న 6 గ్రాముల బంగారు ఉంగరం కనబడకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. చెత్త బుట్టలో జారిపోయి ఉంటుందన్న సందేహంతో.. అక్కడకు వెళ్లింది. కానీ అదంతా చెత్తతో నిండిపోయి ఉండటంతో.. నాగలక్ష్మి ‘స్పందన’ కార్యక్రమాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ దినేశ్‌కుమార్.. స్థానిక సచివాలయ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను అప్రమత్తం చేశారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ బుద్ధ శ్రీను, శానిటేషన్ సెక్రటరీ ఎం.రాజేశ్, పారిశుధ్య కార్మికులు బంగారు శ్రీను, జయకుమార్, మేస్త్రీ శ్రీను దాదాపు 5 గంటల పాటు చెత్తనంతా వెతికి.. ఉంగరాన్ని బాధితురాలికి అందజేశారు. దీంతో నాగలక్ష్మి వారికి కృతజ్ఞతలు తెలిపింది. -
చెత్త బ్యాగ్ రూ.లక్షా 40వేలు.. వైరలవుతోన్న మీమ్స్
అంతలేదని కొట్టి పారేస్తున్నారా? అది నిజం. లగ్జరీ బ్రాండ్ బలెన్సియాగా ఈ బ్యాగులను తయారు చేసింది. కంపెనీ ‘ట్రాష్ పౌచ్’గా పిలుస్తున్న ఈ బ్యాగులను దూడ తోలుతో తయారుచేసి.. గ్లాసీ కోటింగ్ ఇచ్చింది. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో వీటిని తయారు చేసింది. బ్యాగును క్లోజ్ చేసేందుకు బ్యాక్‌పాక్‌కు ఉన్నట్టుగా త్రెడ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతే లగ్జరీగా వింటర్–22 కలెక్షన్లో విడుదల చేసింది. ఆ వీడియోలు కాస్తా ట్విట్టర్లోకి వచ్చాయి. అంతే ఆ ధర చూసి కళ్లు తిరిగిన ట్విట్టర్ యూజర్స్ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. కొందరైతే తిట్ల దండకమే మొదలుపెట్టారు. ‘‘చెత్త బ్యాగుకోసం లక్షన్నర ఖర్చు చేయగలిగినవాళ్లకి దాన్నిండా నింపగలిగేంత క్యాష్ బ్యాంకులో ఉండే ఉంటుంది. అలా నింపేసి అవసరంలో ఉన్నవారికి చారిటీగా ఇచ్చేయొచ్చు కదా’’ అని ట్వీట్ చేశాడో యూజర్. ఇక ‘‘ఆ చెత్త బ్యాగ్‌ను తీసుకుని మీరు వెళ్తే... మిమ్మల్ని దోచుకోవడానికి కొంతమందిని పంపిస్తా’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా లగ్జరీ ఐటమ్స్‌తో వివాదాస్పదం కావడం బలెన్సియాకు కొత్తేం కాదు... ఇదే ఏడాది మేలో ‘రబ్బిష్ బిన్’ పేరుతో చిరిగిపోయిన షూస్‌ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ కంపెనీ. -
చెత్త లేని 'కొత్త నగరాలు'
సాక్షి, అమరావతి: ఎక్కడపడితే అక్కడ చెత్త.. పూడుకుపోయిన కాల్వలు.. రోడ్లపై పారే మురుగు నీరు.. దుర్గంధంతో ముక్కు మూసుకు నడవాల్సిందే.. వీధుల్లో నివాసముండే వారికి చెత్త, మురుగు వాసనతో నిత్యం నరకం.. రెండున్నరేళ్ల క్రితం వరకు పట్టణాలు, నగర వాసుల దుస్థితి ఇది. ఇప్పుడు ఈ నగరాలు కొత్తగా కనిపిస్తున్నాయి. చెత్త, మురుగు, దుర్గంధం నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. రాష్ట్ర ప్రజలు మంచి ఆరోగ్యకర వాతావరణంలో జీవించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనే దీనికి నాంది పలికింది. ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 2న ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలబెట్టేందుకు పట్టణాలు, నగరాలను బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా మార్చే చర్యలు చేపట్టింది. ఇందుకోసం చెత్తను ఇంట్లోనే సేకరించేందుకు ప్రతి ఇంటికీ చెత్త డబ్బాలు పంపిణీ చేసింది. ఇలా 1.20 కోట్ల చెత్త డబ్బాలను అందించి, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గార్బేజ్ స్టేషన్లకు తరలించేందుకు 4,220 వాహనాలను సమకూర్చింది. ఒకప్పుడు మురికి కూపాలుగా ఉన్న ప్రాంతాలను పరిశుభ్ర ప్రాంతాలుగా మార్చింది. మురుగు నీటి శుద్ధికి ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. డంపింగ్ యార్డ్‌ల్లో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త కుప్పలను తరలిస్తోంది. చెత్త ద్వారా సంపదను సృష్టిస్తోంది. ఇందులో కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేపట్టగా, మరికొన్నింటిని పబ్లిక్– ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో చేపట్టింది. ఏడాది కాలంలోనే సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి పట్టణాలు, నగరాలకు కొత్త రూపును తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా చర్యలతో పలు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ పలు నగరాలు జాతీయ స్థాయి అవార్డులను సైతం దక్కించుకున్నాయి. ఇంటింటికీ చెత్త డబ్బాలు గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్కిన్స్, సిరంజిలు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు) చెత్త వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్లను క్లాప్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసింది. 124 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సుమారు 40 లక్షల గృహాలకు రూ.80.17 కోట్లతో 1.20 కోట్ల చెత్త డబ్బాలు అందించింది. ఇళ్ల నుంచి చెత్త సేకరణ, తరలింపునకు మరింత శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకోసం పీపీపీ విధానంలో 3,097 డీజిల్ ఆటో టిప్పర్లను పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చింది. రూ. 60 కోట్లతో మరో 1,123 ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసింది. సేకరించిన చెత్తను శుద్ధి చేసేందుకు 124 మున్సిపాలిటీల్లో 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జీటీఎస్)ను రూ.227.89 కోట్లతో నిర్మిస్తోంది. వీటిలో కొన్ని పూర్తవగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అదనంగా వివిధ ఏజెన్సీల ద్వారా 72 మునిసిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఐఎస్‌డబ్లూఎం) ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తోంది. పట్టణాలకు జాతీయ స్థాయిలో అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా చర్యలతో నగరాలు చెత్త రహితంగా మారుతున్నాయి. 2021లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా 4,320 నగరాలు పోటీపడగా విజయవాడ అత్యుత్తమ పరిశుభ్రమైన నగరంగా మూడో స్థానంలో నిలిచింది. తిరుపతి, విశాఖపట్నం నగరాలు బెస్ట్ సిటీస్ ఇన్ పబ్లిక్ ఫీడ్‌బ్యాక్‌గా నిలిచాయి. దక్షణాదిలో పుంగనూరు సైతం బెస్ట్ సిటీగా అవార్డు దక్కించుకుంది. నెల్లూరు పట్టణం సైతం సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇదే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో బెస్ట్ గార్వేజ్ ఫ్రీ సిటీలుగా దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలను ఎంపిక చేయగా విజయవాడ 5 స్టార్ రేటింగ్ సాధించడం స్వచ్ఛతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. 2020లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా 4,242 నగరాలు పోటీపడగా విజయవాడ, విశాఖ, తిరుపతి ఉత్తమ నగరాలుగా అవార్డులు సాధించాయి. చెత్త నుంచి సంపద తయారీ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ నగరాల నుంచి నిత్యం 6,900 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. గతంలో నగరాలు, పట్టణాల్లో సేకరించిన ఘన వ్యర్థాలను డంపింగ్ యార్డుల్లో వేయడంతో ఆ ప్రాంతాల్లో కొండలను తలపిం చేలా చెత్త గుట్టలు తయారయ్యాయి. పట్టణాల విస్తరణతో ఈ చెత్త గుట్టల చుట్టూ జనావాసాలు పెరిగాయి. చెత్త, దాని నుంచి వచ్చే దుర్వాసన ఆ ప్రాంతాలను కలుషితం చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మెరుగైన చర్యలు చేపట్టింది. మొత్తం 124 పట్టణ సంస్థల్లో పేరుకుపోయిన దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తోంది. అంతే కాకుండా ఇళ్ల నుంచి తెచ్చిన చెత్త నగరంలో ఎక్కడా పోగుపడకుండా 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను (జీటీఎస్) ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలోనే వివిధ రకాల చెత్తను వేరుచేసి ఎరువు, విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు. గుంటూరు, విశాఖపట్నం వద్ద చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు నిర్మించింది. వీటిలో ప్రతిరోజు 2,,335 మెట్రిక్ టన్నుల చెత్తను విద్యుత్ తయారీకి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్లో ఉన్న ఈ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి 22 మెగావాట్ల విద్యుత్ అందుతుంది. మరో 2,650 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి బయోగ్యాస్, ఎరువు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ద్రవ వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు 71 ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎఫ్ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తున్నారు. -
‘చెత్త’ సమస్యకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రోజురోజుకూ వెలుస్తున్న కొత్త ఆవాసాలు, కాలనీలకనుగుణంగా చెత్త కూడా పెరుగుతోంది. ఈ చెత్త ఒకేచోట గుట్టలుగా పేరుకుపోకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే చిన్న మొత్తాల్లో నిల్వ చేసేందుకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా సర్కిల్‌కు మూడు వంతున 30 సర్కిళ్లకు 90 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్(ఎస్‌సీటీపీ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొన్ని సర్కిళ్లలో మూడు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు దొరకకపోవడం.. కొన్ని ప్రాంతాల్లో దొరికినా స్థానికుల నుంచి ఎదురైన వ్యతిరేకతతో ఎలాగోలా 24 ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటు చేయగలిగారు. స్థల సమస్య కారణంగా మిగతా 66 ఎస్సీటీపీలను ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ చెత్త నిర్వహణ పకడ్బందీగా సాగాలంటే ఏరోజుకారోజు తరలించేందుకు వీలుగా ఎస్సీటీపీలు లేని ప్రాంతాల్లో మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచి వాటి ద్వారా చెత్త తరలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో ఆరు వాహనాలు అదనంగా ఉంచి 72 (రెఫ్యూజి కంటైనర్) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. వీటినే మొబైల్ ఎస్సీటీపీలుగా చెబుతోంది. కనీసం వెయ్యి చదరపు మీటర్ల స్థలం ఉన్నా ఎస్సీటీపీలను ఏర్పాటు చేయగలమని జీహెచ్ఎంసీ పేర్కొంది. అందుకోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి ఎస్సీటీపీలతోపాటు మొబైల్ ఎస్సీటీపీల వల్ల సర్కిళ్లనుంచి చెత్తను ఎప్పటికప్పుడు జవహర్‌నగర్ డంపింగ్యార్డుకుతరలిస్తునట్లు తెలిపింది. డంపింగ్‌యార్డుకు తరలించేవాహనాల్లో పోర్టబుల్ సెల్ఫ్ కాంపాక్టర్, స్టాటిక్ కాంపాక్టర్, సీల్డ్ కంటైనర్ సదుపాయాలున్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తుండటంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొంది. -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
ఇంటి ఆవరణలో నాలుగు లారీల చెత్త జమ చేసి.. ఓ మహిళ వింత ప్రవర్తన
సాక్షి,నేరేడ్మెట్(హైదరాబాద్): ఆమెకు దాదాపు 60 ఏళ్లు. నేరేడ్మెట్ డివిజన్ ఆర్కెపురం బాలాజీ కాలనీలో నివసిస్తున్నారు. ఆమె ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. పేరు ముష్రాభేగం. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..ఇంటి ఆవరణలో చెత్తను పోగుచేసింది. కుళ్లిన కూరగాయలు..పండ్లు, కొబ్బరి మట్టలు, పాత దుస్తులు, దూది పరుపులు..గంపలు, ప్లాస్టిక్ కవర్లు ఇలా రకరకాల చెత్తనంతా జమ చేసింది. కొంత కాలంగా ఆమె సుమారు నాలుగు లారీల చెత్త ఇంటి ఆవరణలో పేరుకుపోయింది. దీంతో విపరీతమైన దుర్వాసన వస్తోంది. రోజు రోజుకూ దోమలు పెరగడంతోపాటు దుర్వాసన తీవ్రమైంది. డెంగీ, మలేరియా, కరోనా రోగాల నేపథ్యంలో కాలనీలోని చుట్టుపక్కల వారు ఆందోళనకు గురయ్యారు. చెత్త తొలగించాలని సూచించినా ఆమె ససేమిరా అన్నారు. పైగా విచిత్రంగా మాట్లాడుతుండటంతో స్థానికులు గురువారం కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ భర్త, టీఆర్ఎస్ సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి నాయకులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. చెత్తను తొలగించాలని చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని పిలిచి తొలగించడానికి ప్రయత్నించారు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నా చెత్త..నా ఇష్టం’ మీరెందుకు తొలగిస్తున్నారంటూ దబాయించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఉపేందర్‌రెడ్డి నేరేడ్మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ అనిల్, మహిళా కానిస్టేబుళ్లతో వెళ్లి నచ్చచెప్పినా మహిళ అదే తీరుగా మాట్లాడింది. కాసేపు పోలీసులతో వాదనలు జరిగాయి. పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో చెత్త తొలగింపునకు అంగీకరించారు. ఎంటామాలాజీ సిబ్బంది మందును పిచికారి చేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించారు. మొత్తం నాలుగు లారీల చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించామని మల్కాజిగిరి మున్సిపల్ శానిటరీ ఇన్చార్జి నాగరాజు సాక్షితో చెప్పారు. చదవండి: ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
బాబోయ్ డంపు.. తట్టుకోలేక ప్రజలు..
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్‌లోని డంపింగ్ యార్డుతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలాకాలం నుంచి దీనిని ఇక్కడ నుంచి తరలించాలని అధికారులను వేడుకుంటున్నా ఎవరూ స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం బాచుపల్లిలోని సర్వే నెంబర్ 186లో ప్రభుత్వ స్థలంలో అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అయితే నిత్యం యార్డు నుంచి వెలువడే దుర్వాసనలు, చెత్తను కాల్చడంతో ఎగసి పడుతున్న మంటలు, పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఇక్కడ నుంచి తరలించాలనే డిమాండ్ ప్రజల్లో ఊపందుకుంది. డంపింగ్ యార్డుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ► నిజాంపేట్ కార్పొరేషన్ బాచుపల్లిలోని సర్వే నంబర్ 186లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చెత్త డంపింగ్ యార్డును గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. ► రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో ఇళ్ల నుంచి సేకరించిన చెత్త టన్నుల కొద్దీ పెరుగుతోంది. ఇలా ప్రతి రోజు నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లోని 96 కాలనీల్లో, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి సుమారు 120 టన్నులకు పైగా చెత్తను సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ► అయితే ఇక్కడ చెత్తను ఇక్కడ వేరు చేసి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించడం అసలు ఉద్దేశం. ► కానీ నేడు ఏకంగా ఇక్కడే డంపింగ్ యార్డు ఏర్పాటైంది. దీంతో డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విష వాయువులతో ఉక్కిరి బిక్కిరి... ► చెత్త తరచూ తగులబెడుతుండటంతో డంపింగ్ యార్డు రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉంది. ► గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. ► అయితే ఈ చెత్తను సిబ్బందే తగుల బెడుతున్నారా.? లేక ఏదైనా రసాయన చర్య వల్ల మండుతోందా.. అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ► ఈ మంటలతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ► అసలే దుర్వాసన ఆపై ఘాటైన పొగతో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ► మంటల మూలంగా వాతావరణంలో అనేక వాయువులు విడుదల అవుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఆందోళనలో స్థానికులు.. ► డంపింగ్ యార్డు ఏర్పాటుతో తమకు ప్రశాంత జీవనం కరువైందని హిల్ కౌంటీ, సాయినగర్ కాలనీ, అదిత్య గార్డెన్, రాజీవ్ గృహకల్ప, బండారి లేఅవుట్, జర్నలిస్ట్ కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు పక్కనే నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభైతే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. విష జ్వరాల బారిన ప్రజలు... ► డంపింగ్ యార్డు కారణంగా రోజుల తరబడి చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు మలేరియా, డెంగీ లాంటి విషజ్వారా -
అప్పుడే పుట్టిన పసిబిడ్డ చెత్తకుప్పలో..
కుభీర్(ముథోల్): నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సిలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పల్లో పారేశారు. గ్రామంలోని సాయిబాబా ఆలయం వెనక నిర్మానుష్య ప్రదేశంలో చెత్తకుప్పల నుంచి ఆదివారం ఉదయం ఏడుపు వినిపించడంతో అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న స్థానికులు శిశువును గుర్తించారు. గ్రామస్తులు స్థానిక ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సమాచారం అందించడంతో ఆయన అక్కడకు చేరుకుని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఐసీడీఎస్ సీడీపీవో నాగలక్షి్మ, సూపర్వైజర్ భారతి శిశువును భైంసా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం శిశువును ఆదిలాబాద్‌లోని శిశు గృహకు తరలించారు. శిశువును చెత్తకుప్పలో ఎవరు పడేశారన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
పాపం.. పసిపాప
గచ్చిబౌలి: చెత్తకుండీలో రెండు రోజుల ఆడశిశువును వదిలి వెళ్లిన సంఘటన సోమవారం రాత్రి కొత్తగూడలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో వెలుగు చూసింది. దీనిని గుర్తించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో అంబులెన్స్ ఈఎంటీ కృష్ణ, పైలెట్ సంతోష్ అక్కడికి చేరుకుని శిశువును పరిశీలించారు. ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్థారించి కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయమై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కుండీలో చెత్తవేస్తే.. వైఫై ఫ్రీ
న్యూఢిల్లీ: ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ అవసరాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమస్త సమాచారాన్ని చిటికెలో అందిస్తూ విజ్ఞానానికి, వినోదానికి వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరంగా మారింది. అపరిశుభ్రత.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదీ ఒకటి. సగం రోగాలు అపరిశుభ్రత కారణంగానే వ్యాపిస్తాయి. ప్రస్తుతం దేశానికి ఇది ప్రాథమిక సమస్యగా మారింది. తమ వినూత్న ఆలోచనతో ఈ రెండింటికీ ఒకే పరిష్కారం కనుగొన్నారు ముంబైకి చెందిన ఇద్దరు కామర్స్ గ్రాడ్యుయేట్లు. అదెలాగో మీరూ చూడండి. 'వైఫై ట్రాష్ బిన్' పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే.. వైఫై ఉచితంగా అందించే ఓ సరికొత్త ప్రయత్నం చేశారు ముంబైకి చెందిన ప్రతీక్ అగర్వాల్, రాజ్ దేశాయ్. ఇందుకోసం 'వైఫై ట్రాష్ బిన్'పేరుతో డస్ట్‌బిన్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో చెత్తవేస్తే వైఫై ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన కోడ్ వస్తుంది. ఈ కోడ్ ద్వారా వైఫైని ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆలోచన ఇలా ముంబైలో ఓ వారంతంలో వారు వెళ్లిన ఓ పార్టీ ఈ ఆలోచనకు కారణమైంది. విశాలమైన ప్రాంతంలో జరిగిన ఆ మ్యూజిక్ ఫెస్టివల్.. మ్యూజిక్, ఫుడ్, డ్రింక్స్‌తో పాటు పెద్ద మొత్తంలో చెత్తకు కూడా వేదికైంది. నెట్వర్క్ కూడా లేని కారణంగా అక్కడ తమ స్నేహితులను గుర్తించేందుకు తమకు ఆరుగంటలకు పైగా పట్టినట్లు అగర్వాల్ తెలిపారు. దీంతో హాట్‌స్పాట్స్ ద్వారా ఉచితంగా వైఫై ఎందుకు అందించకూడదు అనే ఆలోచన ఆ సమయంలో తనకు వచ్చినట్లు చెప్పారు. ఈ ఆలోచనకు డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లో శుభ్రతకు చేపట్టిన సరికొత్త పద్ధతులు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. సొంత నిధులతో టెలికం ఆపరేటర్ ఎంటీఎస్ సహాయంతో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో జరిగే వారాంతపు వేడుకల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించాలని భావించినా అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గెయిల్ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు, చర్చలు జరుగుతున్నట్లు అగర్వాల్ తెలిపారు. కనెక్టివిటీ, మొబిలిటీ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వెలికితీసేందుకు ఎరిక్సన్, సీఎన్ ఎన్ ఐబీఎన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన 'నెట్వర్కడ్ ఇండియా'కార్యక్రమంలో ఇటీవల ఈ వైఫై బిన్స్‌ను ప్రదర్శించారు. -
అమర జవాన్లకు అవమానం
న్యూఢిల్లీ: అమరజవాన్లకు అవమానం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల యూనిఫారాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. అమరులను అవమానించేవిధంగా ఉన్న ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. బాధ్యులను గుర్తించి శిక్షించాలని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు సూచించారు. ఈ ఎన్కౌంటర్లో 14 మంది జవాన్లు మృతిచెందడం తెలిసిందే. జవాన్ల మృతదేహాలకు రాయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం జవాన్ల యూనిఫారాలు, బూట్లు ఆసుపత్రి చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ చేపట్టామని సీఆర్పీఎఫ్ తాత్కాలిక అధిపతి ఆర్సీ తయాల్ చెప్పారు. ఎన్కౌంటర్ కేసును నమోదు చేసుకున్న స్థానిక పోలీసుల అధీనంలో అమర జవాన్ల యూనిఫారాలు ఉండాలన్నారు. శవపరీక్షల అనంతరం ఆసుపత్రి సిబ్బంది వీటిని వ్యర్థ పదార్థాలుగా భావించి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కాని అమరులకు సంబంధించిన ఏ వస్తువునైనా భద్రపర్చాలని కేంద్రహోంమంత్రి ఇదివరకే ప్రకటించారని చెప్పారు. -
ఏకంగా 11 బాంబులు...అదీ చెత్తకుండిలో...