చెత్తకుండీలో రెండు రోజుల ఆడశిశువును వదిలి వెళ్లిన సంఘటన కొత్తగూడలో వెలుగు చూసింది
గచ్చిబౌలి: చెత్తకుండీలో రెండు రోజుల ఆడశిశువును వదిలి వెళ్లిన సంఘటన సోమవారం రాత్రి కొత్తగూడలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో వెలుగు చూసింది. దీనిని గుర్తించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో అంబులెన్స్ ఈఎంటీ కృష్ణ, పైలెట్ సంతోష్ అక్కడికి చేరుకుని శిశువును పరిశీలించారు. ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్థారించి కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయమై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.