కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్‌లైన్ భగత్‌నగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది.
అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్‌బిన్‌గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్‌గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది.
శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్‌కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్‌కు భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment