అప్పుడే పుట్టిన పసిబిడ్డ చెత్తకుప్పలో.. | Newborn Baby Girl Found In Garbage At Nirmal District | Sakshi
Sakshi News home page

అప్పుడే పుట్టిన పసిబిడ్డ చెత్తకుప్పలో..

Published Mon, Apr 19 2021 11:42 AM | Last Updated on Mon, Apr 19 2021 1:59 PM

Newborn Baby Girl Found In Garbage At Nirmal District - Sakshi

కుభీర్‌(ముథోల్‌): నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం పల్సిలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పల్లో పారేశారు. గ్రామంలోని సాయిబాబా ఆలయం వెనక నిర్మానుష్య ప్రదేశంలో చెత్తకుప్పల నుంచి ఆదివారం ఉదయం ఏడుపు వినిపించడంతో అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న స్థానికులు శిశువును గుర్తించారు. గ్రామస్తులు స్థానిక ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సమాచారం అందించడంతో ఆయన అక్కడకు చేరుకుని శిశువును ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు.

ఐసీడీఎస్‌ సీడీపీవో నాగలక్షి్మ, సూపర్‌వైజర్‌ భారతి శిశువును భైంసా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం శిశువును ఆదిలాబాద్‌లోని శిశు గృహకు తరలించారు. శిశువును చెత్తకుప్పలో ఎవరు పడేశారన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement