పుట్టేదీ ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. ఆడపిల్ల పుట్టిన తర్వాత చంపడం, చెత్తకుప్పల్లో పడేసే దారుణాల గురించి కూడా ఎన్నో విన్నాం. ఆడపిల్లగా పుట్టి పెరిగినా సమాజంలో చిన్న చూపు మాత్రం పోలేదు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పరిస్థితి కాస్త మారింది. పుట్టబోయేది ఎవరైనా సరే తల్లిదండ్రులు వారిని సంతోషంగా పెంచి పెద్ద చేస్తున్నారు. తాజాగా కూతురు పుట్టిందన్న సంతోషంలో ఓ కుటుంబం ఉబ్బితబ్బి అయిపోయింది. కూతురిని ఆసుపత్రి నుంచి ఇంటికి ఆహ్వానించేందుకు వినూత్నంగా ఆలోచించారు. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా హెలికాప్టర్‌తో స్వాగతం పలికారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పూణే జిల్లాలోని ఖేడ్ పట్టణానికి చెందిన విశాల్ జరేకర్ అనే న్యాయవాదికి జనవరి 22న పాప పుట్టింది. బోసారి పట్టణంలో జన్మించిన ఆ పాపకు రాజలక్ష్మీ అని నామకరణం చేశారు. కాగా విశాల్ కుటుంబంలో చాలా ఏళ్ల తరువాత ఆడపిల్ల పుట్టింది. దీంతో చిట్టితల్లిని ఇంటిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించారు. చిన్నారిని ఖేడ్‌లోని ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను బుక్ చేశారు. ఇందుకోసం లక్షరూపాయలు ఖర్చు చేశాడు. ఇంటి దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సరైన స్థలం లేకపోవడంతో వ్యవసాయ క్షేత్రంలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. అలా హెలికాప్ట్ ద్వారా విశాల్ తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు.
చదవండి: హృదయ విదారకం: బిడ్డను కాపాడటం కోసం శత్రువుకెదురెళ్లి తల్లి ప్రాణ త్యాగం
#WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper
— ANI (@ANI) April 5, 2022
We didn't have a girlchild in our entire family. So, to make our daughter's homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father
(Source: Family) pic.twitter.com/tA4BoGuRbv
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా అమ్మాయి తండ్రి విశాల్ మాట్లాడుతూ.. ఇంట్లో ఆడపిల్ల పుట్టడాన్ని పండుగలా జరుపుకోవాలనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకే ఈ విధంగా చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే మనషులకు విశాల్ ఆదర్శంగా నిలిచాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment