సాక్షి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయం పట్టుకుందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆదివారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment