స్వామివారి పెళ్లి పనులు షురూ.. | Bhadrachalam Sita Rama Swamy Kalyanam Work Start | Sakshi
Sakshi News home page

స్వామివారి పెళ్లి పనులు షురూ..

Published Thu, Mar 21 2019 11:37 AM | Last Updated on Thu, Mar 21 2019 11:39 AM

Bhadrachalam Sita Rama Swamy Kalyanam Work Start - Sakshi

ఉత్సవాలకు అంకురార్పణ సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న అర్చకులు 

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం హోలీ సందర్భంగా నిర్వహించే డోలోత్సవం, వసంతోత్సవానికి బుధవారం అంకురార్పణ చేశారు. ముందుగా పవిత్ర గోదావరి నది నుంచి మేళతాళాల నడుమ రామాలయానికి తీర్థపు బిందెను తీసుకొచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 6 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న రామయ్యకు కల్యాణం జరిపిస్తారు. కాగా, హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామికి నేడు సహస్ర ధారతో ప్రత్యేక స్నపన కార్యక్రమం ఉంటుంది.

అనంతరం అందంగా అలంకరించిన స్వామి వారిని ఊయలలో ఆశీనులను చేసి డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలను ఆలపిస్తుండగా నక్షత్ర, కుం¿భ హారతులను స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించనున్నారు.   ముందుగా అంతరాలయంలోని మూలవరులకు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మీతాయారమ్మ వారికి, అభయాంజనేయ స్వా మివారికి వసంతాన్ని చల్లి భక్తులపై పసుపునీళ్లను చల్లుతారు.సాయంత్రం మేళతాళాల నడుమ తాత గుడి సెంటర్‌ వరకు తిరవీధి సేవ నిర్వహిస్తారు. 


తలంబ్రాల తయారీ... 
శ్రీరామనవమి రోజున స్వామివారి కల్యాణోత్స వానికి వినియోగించేందుకు 150 క్వింటాళ్ల తలం బ్రాల తయారీకి గురువారం శ్రీకారం చుట్టనున్నా రు. ప్రతియేటా 100క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తుండగా అవి సరిపోవడం లేదు. దీంతో ఈఏడాది 150 క్వింటాళ్లు  తయారు చేయా లని నిర్ణయించారు. 100 క్వింటాళ్ల బియ్యం చీరాలకు చెందిన భక్తులు సమర్పిస్తుండగా,  మరి కొందరు దాతల ఇంకొన్ని బియ్యం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మిగిలిన బియ్యాన్ని దేవస్థానం వారు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా గురువారం నిర్వహించనున్నారు. చిత్రకూట మండపంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, స్వామివారి కల్యాణంలో పాల్గొనే ఆచార్య బ్రహ్మ ఋత్విక్‌ల సతీమణులు పసుపు దంచుతారు. తలంబ్రాలను సైతం వారితోనే మొదట కలిపిస్తారు. అనంతరం పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్క, గులాల్, అత్తరు, పన్నీరు, నూనె, సుగంధ ద్రవ్యాలను కలిపి 508 మంది భక్తురాళ్లచే తలంబ్రాలను తయారు చేయిస్తారు.

 
రేపు సామూహిక శ్రీలక్ష్మీ పూజలు.. 
ఆలయప్రాంగణంలోనిశ్రీలక్ష్మీతాయారమ్మవారి సన్నిధిలో శుక్ర వారం ఫాల్గుణోత్తర బహుళ విదియను పురస్కరించుకొని శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మ వారికి సామూహిక పూజలు నిర్వహించనున్నా రు. రూ.500 రుసుం చెల్లించిన భక్తులకు దేవస్థానం వారు లక్ష్మీ అమ్మవారివెండిప్రతిమ, ప్రసా దం, అమ్మ వారి పూజా కుంకుమను అందజేస్తారు.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement