sita rama kalyanam
-
వెండితెర శ్రీరాముడిగా మెప్పించింది వీళ్లే (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం
-
Watch Live: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం
-
శ్రీరాముని దివ్య రూపం.. ఏఐ ఫోటోలు
-
నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తారు..? నవమి నాడే కళ్యాణం ఎందుకంటే.. ఆగమ శాస్త్రం ప్రకారం... శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. అందువల్ల గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే.. ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం వేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించబడింది. శ్రీరామ చంద్రుడు, జానకి దేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు. వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదమే సీతమ్మ తల్లి. చైత్రమాసం శుద్ద నవమి రోజున లోక కళ్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు. తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు. "శ్రీ సీతారామాభ్యాంనమ:" అంటూ పూజలు కూడా చేస్తారు. ఈ శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. శ్రీరామచంద్రుడిని తెలుగు వారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. అంతేకాదండోయ్ రామాలయం లేని ఊరే ఉండదు కూడా. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. మరో కథనం ప్రకారం.. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంటా.. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారట. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడాది భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ చరితార్థం అవుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. (చదవండి: Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..) -
వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం..
సాక్షి, వైఎస్ఆర్: ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. పండు వెన్నెల్లో కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. వరి గింజల కంకులు, ఫల పుష్పాలతో శోభాయమానంగా కల్యాణ వేదికను అలంకరించారు. ఒంటిమిట్టలో కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం ఉదయం శివ ధనుర్భంగా లంకారములో, పురవీధుల్లో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడు ఊరేగాడు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. భక్త జన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపులో.. టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీరామ నవమికి కాకుండా.. సీతారామ కల్యాణ మహోత్సవం ఒంటిమిట్టలో చైత్ర పౌర్ణమి రోజు, పున్నమి కాంతుల్లో జరగడం ఆనవాయితీ. శ్రీరామనవమి రోజు జరిపించాల్సిన కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు జరిపించడం మరింత విశేషం. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుడికి శ్రీరాముడు మాటిచ్చాడట.అందుకే తన కళ్యాణ వేడుకను చంద్రుడు తిలకించేలా చైత్ర పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుందని వరమిచ్చాడని కథనం. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా... రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా అంటారు. ఒంటిమిట్ట ప్రత్యేకత ఇదే జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. శ్రీ రామచంద్రుడిపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. -
భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం కార్యక్రమం.. హాజరైన గవర్నర్
భద్రాచలం: శ్రీరామనవమి వసంత ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్యను గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భద్రాద్రి రామయ్య దర్శించుకోవడానికి వెళ్లిన గవర్నర్ తమిళసైకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళసై స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాచలం మిధిలా స్టేడియంలో రామయ్య పుష్కర పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని వివిధ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి రుత్వికులు తీసుకొచ్చిన 12 నది జలాలతో స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ క్రమంలోనే రామయ్య పుష్కర పట్టాభిషేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. నేటి భద్రాద్రి వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌లు హాజరయ్యారు. -
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
-
సీతారామ కల్యాణం.. కమనీయం
సాక్షి, భద్రాద్రి: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో.. సీతారామకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నముహూర్తాన మాంగల్యధారణ జరిగింది. భద్రాద్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం.. ► తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ► ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాముల్ని ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ► భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అంచనా. అందుకు తగ్గట్లే ఉదయం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ►మిథిలా స్టేడియంలో జరగనున్న సీతారామా కల్యాణం కోసం.. రామ భక్త జనసంద్రం తరలి వచ్చింది. ► కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడి తెర లు ఏర్పాటు చేశారు. ► చిన్నజీయర్ స్వామి ఇతర ప్రముఖులు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ► భక్తులకు మూడు లక్షల మంచినీరు ,లక్ష మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కి సిద్దం చేశారు. ► భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు.. వాటి పంపిణీకి 70 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ► మొదట గర్భగుడిలో రామయ్య మూలవిరాట్‌కు లఘుకల్యాణం నిర్వహిస్తారు. ► ఆపై అభిజిత్ లగ్నంలో వేలాది మంది భక్తుల నడుమ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్యాణం జరగనుంది. ► రేపు(శుక్రవారం) స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ► భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భద్రాదికి తరలివచ్చారు భక్తులు. -
రాములోరి కల్యాణానికి వేళాయె...
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసంత ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేక మహోత్సవం ఆలయం వద్ద ఉన్న మిథిలా స్టేడియంలో జరగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని భారీ స్థాయి లో జరిపేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత ఆరు బయట కల్యాణోత్స వం జరగనుండటంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. కాగా, కల్యాణానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఒకవేళ సీఎం రాకపోతే ఆయన తరఫున కుటుంబసభ్యులు గానీ.. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని సమాచారం. అలాగే, జిల్లా ప్రజల తరఫున తాను స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పోచంపల్లి పట్టువస్త్రాలు ప్రత్యేకం రామయ్య కల్యాణానికి ఈ ఏడాది తొలిసారిగా పోచంపల్లి చేనేత కార్మికులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్ చైర్మన్ జయరాజు ఆధ్వర్యం లో శనివారం ఈ పట్టు వస్త్రాలను రామాలయ ఈఓ శివాజీకి అందచేయనున్నారు. అలాగే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన భక్త బృందం గోటితో వొలిచిన 3 క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించారు. అంతేకాకుండా సీవీఆర్ వస్త్ర దుకాణం వారు స్వామి వారి ముత్యాల కొనుగోలుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. 11, 12 తేదీల్లో గవర్నర్ పర్యటన పాల్వంచ రూరల్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శ్రీరామనవమి మరుసటి రోజు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారికి నిర్వహించే మహా పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరవడం ఆనవాయితీ. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో గవర్నర్, 11న భద్రాచలం చేరుకుంటారు. సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, పట్టాభిషేకంలో పాల్గొంటారు. 12న దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పర్యటిస్తారు. -
శాస్త్రోక్తంగా రామయ్య కల్యాణం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే పరిమిత సంఖ్యలో వేదపండితులు, అర్చకులు, ఇద్దరు మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కొద్దిమంది అధికారులు మాత్రమే కల్యాణ వేడుకలో పాల్గొన్నారు. ప్రతీ సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రికి భక్తులు భారీ గా తరలివచ్చేవారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో భక్తులను కల్యాణ వేడుకలకు అనుమతించకపోవడంతో ఆలయం బోసిపోయింది. అయితే కోట్లాది మంది భక్తులు టీవీల ద్వారా ఈ కమనీయ ఘట్టాన్ని వీక్షించి తరించారు. భద్రాచలంలో భక్తరామదాసు కాలం నుంచి ఏటా శ్రీరామ నవమి వేడుకలను మిథిలా స్టేడియం లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించే బేడా మండ పంలోనే కల్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు లేకుండా రామయ్య కల్యాణం నిర్వ హించడం ఇదే తొలిసారని అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు.. శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణ క్రతువు గురువారం తెల్లవారుజామున రెండు గంటలకే ప్రారంభమైంది. మొదట స్వామివారికి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, ధ్రువమూర్తులకు అభిషేకం నిర్వహించారు. తరువాత అంతరాలయంలోని మూలమూర్తులకు కల్యాణం జరిపించారు. అనంతరం మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్చరణలతో సీతారాముల ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. రజత సింహాసనంపై ఆశీనులను చేశారు. పవిత్ర జలాలతో పుణ్యాహవచనం చేశారు. భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను అలంకరించారు. వేదికపై ఆసీనులైన శ్రీసీతారాములకు అర్చకులు ముందుగా తిరువారాధన, విష్వక్సే న పూజ నిర్వహించి మంటప శుద్ధి చేశారు. ఆ తర్వాత మోక్షబంధన, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణ గావించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేసి, సంకల్పం చెప్పారు. అనంతరం కన్యాదానం, గోదానం, భూదానం నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం లో స్వామి, అమ్మవార్ల ఉత్స వ విగ్రహాలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. భక్త రామదాసు చేయించి న మంగళసూత్రాల తో మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంత రం తలంబ్రాల వేడుకను జరిపించారు. ఈ కార్యక్రమంలో ప్ర భుత్వ సలహాదారు రమ ణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు.. శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ర వాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్ లగ్న సుముహూర్తాన సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు స్వా మి, అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టారు. భద్రాద్రిలో సీతమ్మవారికి మూడు మంగళసూత్రాలు ఉండటం విశేషం. ఇందులో ఒకటి పుట్టింటిది, రెండోది మెట్టినింటిది కాగా, మూ డోది భక్త రామదాసు (కంచర్ల గోపన్న) చేయించినది. భక్త రామదాసు చేయించిన ఆభరణాలు కల్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాముడికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకు పతకం, లక్ష్మణుడికి రామ మాడ అలంకరించారు. ఏపీలోని తూర్పుగోదావరి నుంచి భక్తులు ఈసారీ గోటి (కోటి) తలంబ్రాలు పంపించారు. -
భక్తజనం లేకుండానే రాములోరి కల్యాణం
సాక్షి, భద్రాచలం : శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు జరగనున్నాయి. వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జరుగుతోంది. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగుతోంది. వేదపండితులు, అర్చకులు, పోలీసు, సాధారణ అధికారులు, ఆలయ ప్రతినిధులు ఈ వేడుకకి హాజరయ్యారు. భక్తులు లేకుండానే కోదండరాముని బ్రహ్మోత్సవాలు కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో భక్తులకు అనుమతి నిరాకరించగా, అర్చకుల సమక్షంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే పాల్గొన్నారు.ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం వేదపండితులు ధ్వజారోహనం నిర్వహించారు. -
శ్రీ సీతారాముల కల్యాణం..టీవీలో చూతము రారండి!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: ఊరూరా.. వాడవాడలా కన్నుల పండువగా జరిగే శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత నిరాడంబరంగా జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక సూచనలు చేసింది. భక్తులు రాకుండా కేవలం అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు, ఒకరిద్దరు ఆలయ ధర్మకర్తల సమక్షంలోనే ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాద్రి విచ్చేసి రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించేవారు. కానీ ఈసారి టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి సరిపెట్టుకోవాల్సిందే. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవా రు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగనుంది. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. వేదపండితులు, అర్చకులు, పోలీసు, సాధారణ అధికారులు, ఆలయ ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. నేడు కల్యాణం.. రేపు పట్టాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణానికి సంబంధించి గురువారం తెల్లవారు జామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాతం నిర్వహించనున్నారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం జరిపి అంతరాలయంలోని ధ్రువమూర్తులకు అభిషేకం జరుపుతారు. తర్వాత «మూలమూర్తులకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రజిత సింహాసనంపై ఆశీనులను చేస్తారు. భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను అలంకరిస్తారు. వేదికపై ఆశీనులైన శ్రీ సీతారాములకు సంకల్పం చెప్పి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జీలకర్ర, బెల్లం స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలపై ఉంచుతారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని చేస్తారు. అనంతరం ఎర్రని తలంబ్రాలతో వేడుక నిర్వహిస్తారు. శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. అన్ని దేవాలయాల్లోనూ ఇలాగే.. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం మొ దలు మారుమూల పల్లెల్లోని దేవాలయాల వర కు కేవలం అన్నిచోట్లా ఆలయ కార్యక్రమంగానే స్వామి కల్యాణాన్ని పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయా న్ని ఇప్పటికే దేవాదాయశాఖ అన్ని దేవాలయాలకు సూచించగా, తెలంగాణ విద్వత్సభ కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. స్వయంగా కల్యాణం లో పాల్గొనాలనుకునే భక్తులు కార్యక్రమాన్ని ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని, ఇతరులను ఆహ్వానించవద్దని అధికారులు సూచించారు. ఈసారి పానకం, వడపప్పు అందించటం, అన్నసంతర్పణ చేయటాన్ని నిషేధించారు. -
రామయ్య పెళ్లికి రండి
సాక్షి, లింగాలఘణపురం(వరంగల్) : భద్రాచల రామాలయం రాముడి ప్రేమకు గుర్తయితే జీడికల్ వీరాచలం ఆయన వీరత్వానికి ప్రతీతిగా భక్తులు చెప్పుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి జీడికల్ పున్నమిగా పేరు ప్రఖ్యాతులు గడించిం దంటే ఎంత ప్రాశస్త్యం కలిగిన జాతరో అర్థమౌతుంది. త్రేతాయుగంలో స్వయంభువుగా వెలసిన వీరాచల రామచంద్రస్వామి ఖమ్మం జిల్లా భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. కార్తీక మాసంలో ప్రారంభమైన జాతర నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రతి ఏటా శ్రీరామనవమితో పాటు, కార్తీకమాస పునర్వసు నక్షత్రంలో సీతారాముల కల్యాణోత్సవం జరుపడం ఇక్కడి విశేషం. ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని ప్రాం తాలతో పాటు మహరాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుం టారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీడికల్ రామచంద్రస్వామి పేరుతో 11 ఎకరాల భూమి ఉండడం జాతర ప్రాముఖ్యతకు నిదర్శనం. విద్యుత్ వెలుగుల్లో ఆలయం జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయం విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటోంది. ఈ నెల 11న ప్రారంభమైన జాతరలో 17న సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ లైట్లతో సీతారామలక్ష్మణుల ప్రతిమలు వెలుగొందుతున్నాయి. గోపురంతో పాటు ఆలయం చుట్టూ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవ వేదిక వద్ద చలువ పందిళ్లు వేశారు. ఆలయ సిబ్బంది అంతా భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగిపోయారు. దాతల విరాళాలతో ఆలయం, సత్రాలు, కల్యాణ వేదిక ముందు రేకులతో షెడ్లు వేశారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సీజీఎఫ్ నిధులు సుమారుగా రూ.25లక్షలతో షెడ్లు, నీటి వసతి కల్పించారు. శశాంక అనే ఎన్ఆర్ఐ కల్యాణ వేదిక వద్ద షెడ్ వేశారు. జీడిగుండం, పాలగుండం జీడిగుండం, పాలగుండాలు.. ఆలయంపైన జీడిగుండం, పాలగుండం రెండు ఉంటాయి. పూర్వకాలంలో భీమసేనుడు, చంద్రసేనుడు అనే ఇద్దరు రాజుల యుద్ధంలో చంద్రసేనుడు వీరమరణం పొందుతాడు. అతడి కవల పిల్లలైన బాలచంద్రుడు, బాలచంద్రికలు వేర్వేరుగా ఇతర ప్రాంతాల్లో పెరిగిపెద్దవుతారు. స్వయంవరంలో వీరిద్దరు అన్నచెల్లెల్లు అని తెలియక వివాహం చేసుకోవడంతో ఒక్కసారిగా వీరి శరీరాలు నల్లబడిపోయాయి. వెంటనే ఆకాశగంగ పలుకుతూ 101 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పడంతో వీరిద్దరు పాప విమోచనానికి ఆలయాలన్ని దర్శించుకొని చివరిగా జీడికల్‌లోని జీడిగుండం, పాలగుండాలలో స్నానాలు చేయగా శరీరాలు యథావిధిగా మారుతాయి. ఇలా ఇక్కడే పాప విమోచనం జరిగిందని ప్రతీతి. భక్తులు ఈ గుండాల్లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ఆలయ చరిత్ర.. త్రేతాయుగంలో వీరుడు, భద్రుడు ఇద్దరు మునీశ్వరుల తపోనిష్టతో భద్రాచలంలో భద్రాచల రామయ్య, జీడికల్లో వీరాచల రామచంద్రుడిగా వెలిసినట్లు ప్రతీతి. అందుకే రెండో భద్రాద్రిగా పేరు పొందింది. రాముడు వనవాసం చేసే సమయంలో పర్ణశాలలో ఉన్న సీతమ్మకు మాయ లేడి కనిపించడంతో ఆ లేడి సంహారానికి రాముడు అక్కడి నుంచి బయలు దేరి వెంటాడుతూ వేటాడుతూ జీడికల్ సమీపంలోని లేడిబండ వద్ద సంహరించినట్లుగా చెబుతారు. ఇప్పటికీ అక్కడ శ్రీరామచంద్రుడు లేడీ సంహార అనంతరం సంధ్యావందనం కోసం తన బొటన వేలిని నొక్కగా బండపై ఏర్పడిన గుంతలో నీరు వచ్చిందని ప్రతీతి. ఇప్పటివరకు దాన్ని లేడి బండగా పిలుస్తారు. సంధ్యావందనం అనంతరం వీరుడి ఘోర తపస్సుతో రామనామ జపం వినిపించడంతో అటుగా అడుగులు వేస్తూ రాగా కొద్ది దూరంలో వీరుడి తపస్సును చూసి మెచ్చుకొని ఏం కావాలని కోరుకోమనగా సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు నీ సేవ చేసుకొనే భాగ్యం కల్పించాలని వేడుకోగా అక్కడే స్వయంభువుగా వెలిసినట్లు చెబుతారు. కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి ఈ నెల 17న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన వసతులు ఏర్పాట్లు చేశాం. కల్యాణంలో పాల్గొనే దంపతులు రూ.1516 చెల్లించి రశీదు తీసుకొని కల్యాణం జరిపించే అవకాశం పొందవచ్చు. – శేషుభారతి, ఈఓ జీడికల్ -
సిమి వ్యాలీలో ఘనంగా సీతారాముల కళ్యాణం
కాలిఫోర్నియా : సిమి వ్యాలీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు కలిసి శ్రీసీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. సిమి ఇండియా కమ్యూనిటీ సెంటర్లో జరిగిన శ్రీసీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వేడుకను 700 మందికి పైగా భక్తులు వీక్షించి పరవశించి పోయారు. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించుకొని అమెరికాకి చేరుకొన్న ఉత్సవమూర్తులతో మేళతాళాల సాక్షిగా ఆడపడుచులు కోలాటంతో సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకొంది. అందంగా అలంకరించుకున్న రామ, లక్ష్మణ, హనుమంతుల వారిని, పట్టాభిషేక పాదుకలని పురుషులందరూ వేడుకతో పెళ్లి మంటపానికి ఊరేగింపుగా తీసుకొని వస్తుండగా ఆ ప్రాంగణమంతా గోవింద, రామ నామాలతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి కళ్యాణానికి మరింత శోభను జత చేశారు. శ్రీ సీతా రాముల వారి కళ్యాణం ఆద్యంతం కమనీయంగా జరిగింది. 70కి పైగా జంటలు సామూహిక కళ్యాణంలో భాగస్వామ్యులు అయ్యారు. కళ్యాణం జరుగుతున్నంతసేపు, విజయ కూనపల్లి, హైమల 40మంది సంగీత విద్యార్థులు ఆలపించిన రాముల వారి కీర్తనలు అందరిని అలరింప చేశాయి. ప్రసాద్ రాణి చేసిన వ్యాఖ్యానం పలువురికి భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణంని తలపించింది. నిర్వాహకులు రామ్ కోడితాలా, చందు నంగినేని, మనోహర్ ఎడ్మ, కుమార్ తాలింకి మాట్లాడుతూ, చిన్నప్పుడు రాముల వారి పందిరిలో ఆడుకున్న అనుభవాలు, సహ పంక్తి భోజనాలు, ఆ పండుగ వాతావరణం మళ్లీ గుర్తుకు తెచ్చేలా, మన సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ముందు తరాలవారికి అందించేలా గత 3 సంవత్సరాలుగా ఈ కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. శాస్త్రోస్తంగా పూజ నిర్వహించిన పండిట్ మార్తాండ శర్మకి ప్రత్యేకకృతజ్ఞతలు తెలుపుతూ, ఆ దంపతులిద్దరిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్‌కి, భక్తులందరికీ, దాతలకి ధన్యవాదాలు తెలుపుతూ, మహా నైవేద్యంలో సహకరించిన లీల, బిందు, శిరీష, విజయల బృందానికి, మాలలు చేసిన రూప, అద్భుతంగా పందిరిని అలంకరించిన నీలిమ బృందానికి, భోజనాదులలో ఇబ్బందులు రాకుండా చూసుకున్న సుధీర్ పెండేకంటి, కిషోర్ గరికపాటి, సునీల్ పాతకమూరి, సుధీర్ కోనేరుల బృందానికి, పూజ సామాగ్రితో సాయం చేసిన సారధి గోలే, దొరబాబు కొత్తూరు బృందానికి కళ్యాణం ఆద్యంతం రామ కీర్తనలతో అలరించిన విజయ, హైమ, ప్రసాద్ రాణి బృందానికి, కోలాటంతో అలరించిన లతా తాలింకి బృందానికి, ఆడియో, ఫోటోలో సహాయం అందించిన నాగరాజు బూదిరాజు, అజిత్ బుర్ర, వీరబాబు, మీడియా కోఆర్డినేటర్ ప్రసూనా బాసని, మిగతా వాలంటీర్స్, అనిత తోటపల్లి, అను ఓరుగంటి, అనూష సాగి, బిందు గండే, బిందు పోలవరపు, కావేరీ గూడా, చంద్రముఖి నిమ్మగడ్డ, దీప్తి పాతకమూరి, దీప్తి చిరుత, గాయత్రి, గిరిధర్ నక్కలా, హరిణి కాల్వల, హర్షదా మాదిరాజు, కిషోర్ రామదేను, కృష్ణ చిరుత, లక్ష్మి పెదిరెడ్డి, లక్ష్మి పడాల, లీల ఆగిన, మూర్తి నేమాని, నాగభూషణం, నాగరాజు బుద్ధిరాజు, నీలిమ టంగుటూరి, పద్మ నేల, ఫణి కాంత్, పుష్ప జయరాం, రాజ్ అడపా, రాజ్ గండే, రాజేష్ పెద్దిరెడ్డి, రామ గార్లపల్లి, సాయి మగాగడలా, సాయి వంకినేని, శైలజ మద్దాలి, సంతోష్ ఘంటారాం, సవిత దేవరెడ్డి, శిరీష కోడితాలా, శోభా కల్వకోట, శ్రావణి గొడిశాల,సిద్దు యాదల్లా, శిరీష గాజుల, శిరీష పొట్లూరి, శ్రవణ్, శ్రీదేవి రామదేను, శ్రీకాంత్ బండ్లమూడి, శ్రీలత తాలింకి, శ్రీనివాస్ సంపంగి, శ్రీరామ్ పడాల, సుచరిత అదేమా, సుధా దావులూరి, సుజాత కార్తికేయన్, సుమిత్ర హోసబెట్టు, సునీత పెండేకంటి, సునీత వేదాంతం, సునీత బొప్పిడి, స్వప్న పోపూరి, స్వాతి ఘంటారం, స్వాతి కుప్పిలి, ఉషశ్రీ తేజోమూర్తుల, వెంకట్ ఓరుగంటి, వెంకట నాగ ఇతర వాలంటీర్స్ అందరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం
-
సీతారామ కల్యాణం చూచువారలకు చూడముచ్చట
తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరి. శ్రీరామచంద్రుని జన్మతిథి అయిన చైత్రశుద్ధ నవమినాడు భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రమూర్తులకు తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుంది. ఫాల్గుణ పౌర్ణమినాడు కల్యాణవేడుకకు శ్రీకారం చుడతారు. శ్రీరాముడిని, సీతాదేవిని పెళ్లికుమారుని, పెళ్లి కుమార్తె్తను చేస్తారు. ఆ రోజున వసంతోత్సవం జరుపుతారు. ఇరువురు మూర్తులకు పసుపు వచ్చని నూలు వస్త్రాలు ధరింపజేస్తారు. పసుపు, కుంకుమ, చందనం, సుగంధద్రవ్యాలు కలిపిన జలంతో ‘వసంతం’ తయారు చేస్తారు. దీనిని సీతారాములపై చిలకరింపచేస్తారు. ఆ ఏడాది కల్యాణోత్సవాన్ని నిర్వహించే అర్చకులు, సతీ సమేతంగా పసుపుకొమ్ములను రోళ్లలో దంచుతారు. ఈ పసుపుతో సీతమ్మకు మంగళస్నానం చేయిస్తారు. శ్రీరామునికి సున్నిపిండి, సుగంధద్రవ్యాలు, శీకాయపొడి కలిపిన మిశ్రమంతో మంగళస్నానం చేయిస్తారు. అనంతరం మంగళాక్షతలను కలిపే కార్యక్రమం మొదలుపెడతారు. ఎక్కడా విరగని మేలిరకమైన, పరిశుద్ధమైన బియ్యంతో తలంబ్రాలు తయారుచేస్తారు. వీటిలో బియ్యంతో పాటు పసుపు, కుంకుమ, ఆవునెయ్యి, సుగంధద్రవ్యాల పొడి, గులాల్ కలుపుతారు. వీటితోపాటు విద్యుద్దీపాలు, పుష్పమాలాలంకరణలతో వర్ణరంజితంగా, నూతన శోభతో కల్యాణఘట్టానికి ముస్తాబవుతుంది భద్రగిరి.సీతారాముల పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ రోజున భద్రాద్రి అంతటా. భద్రాద్రిలోని ఆలయంలో సీతారాముల్ని ఫాల్గుణపౌర్ణమి నుంచి ప్రతిరోజూ నూతనవస్త్రాలు, సుగంధభరిత పుష్పాలు, పత్రాలతో అలంకరిస్తారు. బుగ్గన చుక్కలతో, నుదుటన కల్యాణ తిలకాలతో లోకోత్తర సౌందర్యంతో మెరిసిపోతుంటారు సీతమ్మ, రామయ్య. అందుకే ఉత్సవమూర్తులను దర్శించుకోవటానికి కల్యాణానికంటే ముందుగానే ఆలయానికి చేరుకుంటారు భక్తులు. సీతమ్మకు ఒడిబియ్యాన్ని, రాముడికి నూతనవస్త్రాలను సమర్పించి కల్యాణ సంరంభం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. కల్యాణానికి ముందురోజు రాత్రి జరిగే ఎదుర్కోలు వేడుక ఒక మనోజ్ఞమైన ఘట్టం. భద్రాచల రాజవీధిలో అర్చకులు, భక్తులు ఆడ, మగ పెళ్లివారిగా విడిపోయి సునిశిత, హాస్య, వ్యంగ్య చమత్కారోక్తులతో సీతమ్మ ఘనత ఇదీ, రామయ్య గొప్పతనం ఇదీ అంటూ హాస్యభరితంగా వాదించుకుంటారు. చిరరకు సీతారాములిద్దరూ ఒకరికొకరు సమవుజ్జీలు, ఒకరికొకరు తగినవారు అని నిర్ణయానికి వచ్చి ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుంటారు. వసంతం చల్లుకుంటారు. నవమినాడు జరిగే కల్యాణానికి తరలిరావల్సిందిగా ఇరుపక్షాలు ఒకరికొకరు ఆహ్వానపత్రికలు ఇచ్చిపుచ్చుకుంటారు. కల్యాణం అంటే సీతారాములదే. ప్రతి ఏడాది కల్యాణం జరుగుతున్నా ఏయేటికాయేడు మరింత కొత్తగా, ఉత్సాహంగా జరుగుతుంది కల్యాణోత్సవంలోని ప్రతి ఘట్టం. ఎన్నిసార్లు వీక్షించినా తనివితీరని దృశ్యం సీతారాముల కల్యాణోత్సవ సంబరం. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాతండ్రి అంటూ భక్తివాత్సల్యాలతో సీతారామకల్యాణాన్ని వీక్షిస్తారు భక్తకోటి. ఆ ఉత్సవానికి వ్యాఖ్యానాన్నీ అందిస్తారు.మాతా రామః మత్పితా రామచంద్రఃభ్రాతా రామః మత్సఖా రాఘవేశఃసర్వస్వం మే రామచంద్రః దయాళుఃనాన్యం దైవ నైవజానే న జానేనా తల్లి రాముడు, తండ్రి రామచంద్రుడు, అన్నదమ్ములు రామడు, స్నేహితుడు రాముడు, రామచంద్రుడే నా సర్వస్వం, వేరే దైవమే నాకు తెలియదు, నేను ఎరుగను అని ఈ శ్లోకం అర్థం. ఇలా తన కుటుంబంలో రాముడిని, రాముడినే తన కుటుంబంగా భావించిన వ్యక్తులు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని, ఉత్తమ కుటుంబాన్ని పొందగలుగుతారు. గోపరాజు పూర్ణిమాస్వాతి శ్రీరామ కర్ణామృతంలోని ఈ శ్లోకాన్ని శుభలేఖలపై ముద్రించని వారు, దానిని చూడనివారు అరుదు. శ్రీరామ కర్ణామృతంలోని ఈ శ్లోకం సీతారాముల తలంబ్రాల వేడుక గురించి రమ్యంగా వర్ణించారు. సీతమ్మ తెల్లని ముత్యాలు దోసిటిలోకి తీసుకోగా అవి ఎర్రబడ్డాయట. వాటిని రామయ్యపై పోయగా అవి రాముడి తలపాగాపై తెల్లగా, శరీరం మీద పడగానే నీలంగా మారాయట. చివరికి కిందపడేటపుడు మళ్లీ తెల్లగా మారాయట. తెలుపును స్వచ్ఛతకు, సత్వగుణానికి ప్రతీకగా ఎరుపు, నలుపు, నీలాలు రజ, తమో గుణాలకు ప్రతీకలుగా భావిస్తే సత్వగుణాన్ని కలిగి ఉన్న మనుషులను ఏ చెడుగుణాలు పాడు చేయలేవని స్వఛ్చంగా ఉన్న సంసార జీవితాన్ని ఏ శక్తులూ నాశనం చేయలేవని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకున్న జంటలు నూరేళ్లు ఆనందంగా జీవిస్తారు. -
రామరాజ్యానికి అర్థం అదే!
ఆశ్రమంలో వశిష్ఠుడు, అరుంధతి శ్రీరామకల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పదిరోజులు ముందుగానే చలువ పందిళ్లు వేయించారు. కల్యాణానికి వచ్చేవారందరూ కమనీయంగా ఆ వేడుక చూడటం కోసం ఈత ఆకులు, తాటి ఆకుల చాపలు సిద్ధం చేశాడు. పానకం, వడపప్పుకు కావలసిన సంభారాలన్నీ దండిగా ఇచ్చింది కామధేనువు. అన్నీ సిద్ధమయ్యాయి. అరుంధతి వశిష్ఠులవారిని సమీపించి–‘‘స్వామీ! తెల్లవారితే శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుందనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ఆయన అడవుల పాలయ్యాడు కదా. ఆయన ఎంత స్థితప్రజ్ఞుడో కదా! నాకొక సందేహం స్వామీ! ఇన్ని వేల సంవత్సరాలుగా సీతారాముల కల్యాణం ఎందుకు జరిపిస్తున్నారు. రామావతారానికి ముందు, తరువాత కూడా అవతారాలున్నాయి కదా! ఈ రాముడికే ఎందుకు ఇంత వైభోగం. మీరు ఆయన కులపురోహితులు, రాముల వారిని దగ్గర నుంచి చూశారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన సుగుణాలు మీకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియవు! ఏ కారణంగా ఆయనకు నేటికీ కల్యాణం జరుపుతున్నారు. రామరాజ్యం అనే పేరే ఎందుకు స్థిరపడిపోయింది. రామరాజ్యాన్ని అధిగమించే రాజ్యమే రాలేదా!’’ అని ప్రశ్నించింది అరుంధతి. వశిష్ఠుడు గంభీరంగా నవ్వుతూ, ‘‘అరుంధతీ! నా రాముడని నేను గొప్పలు చెప్పడం కాదు కానీ, దశరథ మహారాజుని మించినవాడు నా రాముడు. దశరథుడి పాలన కూడా అద్భుతంగానే సాగింది. కాని ఆయన ముగ్గురిని వివాహం చేసుకున్న కారణంగా, కన్నకొడుకుని అడవుల పాలు చేయవలసి వచ్చింది. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు కదా! ఆ విషయం పక్కన పెడితే –రామపట్టాభిషేకానికి ముందురోజు దశరథుడు రాముడిని పిలిచి, ‘నాయనా! ఈ కోసల రాజ్య ప్రముఖులందరూ రేపు ఉదయం నిన్ను పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. కనక పట్టాభిషిక్తుడు కావలసిన రాజనందనుడు ఏ నియమవ్రతాలు అనుసరించాలో గురువులు చెబుతారు. ఆ ప్రకారం ఈ రాత్రి గడుపు. ఉదయమే మంగళ స్నానానంతరం పట్టాభిషేకం చేస్తారు’ అని నా దగ్గరకు పంపాడు. నేను నా రామునికి ధర్మశాస్త్రం వివరించి, సింహాసనం అధివసించేవాడు, రాత్రి ఉపవసించి, కటిక నేల మీద దర్భాసనం పరిచి పడుకోవాలి. తెల్లవారేవరకూ మౌనంగా ఉండాలి. రాజభోగాలు అనుభవించడానికి అన్ని అధికారాలూ లభించే క్షణంలో తిండి లేకుండా, రాతి నేల మీద పడుకుని, స్నేహితులతో, భార్యతో ముచ్చటలాడుకునే అవకాశం లేకుండా రాత్రి గడపాలి’ అని వివరించాను.‘‘దేని కోసం ఈ నియమం?’’ అని అమాయకంగా ప్రశ్నించింది అరుంధతి.రాజు కాబోయేవానికి తన ప్రజల ఆకలి బాధ తెలియాలి. దారిపక్కన చెట్టు నీడన కాపురం చేస్తూ బండ రాళ్ల మధ్య నిద్రించేవారి బాధ వంటబట్టాలి. రాజ్యం చేతికందనున్న సమయంలో ఆవేశం పెరిగి ‘అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అని వాగ్దానాలు చేయకూడదు, చెయ్యవలసిన లోక క్షేమంకర పథకాలను ఆలోచించుకుని, ఆచరణలో వచ్చే కష్టసుఖాలు తెలుసుకోవాలి. అప్పుడు సింహాసనం ఎక్కినవాడు ప్రజల జీవితావసర కార్యాలు నిరాఘాటంగా నిర్వహించగలుగుతాడు, వారి బాధలను గ్రహించి పరిష్కారం చేయగలిగి, అందరి అభిమానాన్నీ పొందగలుగుతాడు’ అని వివరించాను అన్నాడు.‘‘మరి రాముడు మీ ఆదేశాలను ఆచరించాడా మహర్షీ!’’ అంది అరుంధతి.‘‘నా ఆదేశాలను పాటించి, రామభద్రుడు ఉపవాస నియమంతో, అధశ్శయనంతో, మౌనంగా ఆ రాత్రి గడిపాడు. అందుకే రాముడు ధర్మానికి ప్రతీక అయ్యాడు’’ అన్నాడు వశిష్ఠుడు.తండ్రి మాటలకు మారుమాటాడకుండా నా దగ్గరకు రావటమే కాదు, నేను చెప్పిన నియమాలను కూడా త్రికరణశుద్ధిగా అనుసరించాడు. ‘ఇలా ఎందుకు చేయాలి?’ అని ఎదురు ప్రశ్నించని సుగుణాభిరాముడు నా రాముడు.... అని కించిత్ గర్వంగా అన్నాడు వశిష్ఠుడు, తన శిష్యుడి వినయాన్ని మనసులోనే అభినందిస్తూ. ‘‘రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం కదా! ఆయనకు కూడా ఇన్ని నియమాలు విధించారా స్వామీ!’’ అన్నది అరుంధతి.‘‘మానవరూపంలో ప్రభవించాక పరమేశ్వరుడైనా, ఆదిగర్భేశ్వరి అయినా మానవ ధర్మాన్ని ఆచరించి ఆదర్శం చూపాలి’’ అన్నాడు కులగురువులు వశిష్ఠులు.‘‘ప్రజల కష్టం తెలుసుకోలేని వాడికి రాజు కాగల అర్హత లేదు. కష్టాలను స్వయంగా అనుభవించాలి. రాజుకి ఆకలి బాధ తెలియాలి, కటిక నేల మీద నిద్రించేవాడి బాధ తెలియాలి, బంధువులకు పదవులు కట్టబెట్టకూడదని తెలియాలి. అయినవారికి అనుకూలంగా ప్రవర్తించేవాడికి రాజు కాగల అర్హత లేదని తెలుసుకోవాలి. ఇవన్నీ నా రాముడికి నేను తెలియచెప్పాను. గురువునైన నా ఆజ్ఞను త్రికరణశుద్ధిగా అనుసరించిన నా రాముడు జగదభిరాముడు కాకుండా ఉండగలడా, ఆయన పరిపాలన రామరాజ్యం కాకుండా ఉంటుందా అరుంధతీ!’’ అన్నాడు వశిష్ఠుడు.ఈ దృష్టితో రామాయణం చదివి వివేకంతో వ్యవహరించేవారు అధికారంలో ఉంటే అశేషప్రజల జీవితం ప్రశాంతంగా సాగుతుందని రాముడి నడవడిక ద్వారా తెలియచెప్పాడు ఆదికవి వాల్మీకి. – డా. వైజయంతి పురాణపండ -
స్వామివారి పెళ్లి పనులు షురూ..
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం హోలీ సందర్భంగా నిర్వహించే డోలోత్సవం, వసంతోత్సవానికి బుధవారం అంకురార్పణ చేశారు. ముందుగా పవిత్ర గోదావరి నది నుంచి మేళతాళాల నడుమ రామాలయానికి తీర్థపు బిందెను తీసుకొచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14న రామయ్యకు కల్యాణం జరిపిస్తారు. కాగా, హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామికి నేడు సహస్ర ధారతో ప్రత్యేక స్నపన కార్యక్రమం ఉంటుంది. అనంతరం అందంగా అలంకరించిన స్వామి వారిని ఊయలలో ఆశీనులను చేసి డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలను ఆలపిస్తుండగా నక్షత్ర, కుం¿భ హారతులను స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించనున్నారు. ముందుగా అంతరాలయంలోని మూలవరులకు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మీతాయారమ్మ వారికి, అభయాంజనేయ స్వా మివారికి వసంతాన్ని చల్లి భక్తులపై పసుపునీళ్లను చల్లుతారు.సాయంత్రం మేళతాళాల నడుమ తాత గుడి సెంటర్ వరకు తిరవీధి సేవ నిర్వహిస్తారు. తలంబ్రాల తయారీ... శ్రీరామనవమి రోజున స్వామివారి కల్యాణోత్స వానికి వినియోగించేందుకు 150 క్వింటాళ్ల తలం బ్రాల తయారీకి గురువారం శ్రీకారం చుట్టనున్నా రు. ప్రతియేటా 100క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తుండగా అవి సరిపోవడం లేదు. దీంతో ఈఏడాది 150 క్వింటాళ్లు తయారు చేయా లని నిర్ణయించారు. 100 క్వింటాళ్ల బియ్యం చీరాలకు చెందిన భక్తులు సమర్పిస్తుండగా, మరి కొందరు దాతల ఇంకొన్ని బియ్యం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మిగిలిన బియ్యాన్ని దేవస్థానం వారు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా గురువారం నిర్వహించనున్నారు. చిత్రకూట మండపంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, స్వామివారి కల్యాణంలో పాల్గొనే ఆచార్య బ్రహ్మ ఋత్విక్‌ల సతీమణులు పసుపు దంచుతారు. తలంబ్రాలను సైతం వారితోనే మొదట కలిపిస్తారు. అనంతరం పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్క, గులాల్, అత్తరు, పన్నీరు, నూనె, సుగంధ ద్రవ్యాలను కలిపి 508 మంది భక్తురాళ్లచే తలంబ్రాలను తయారు చేయిస్తారు. రేపు సామూహిక శ్రీలక్ష్మీ పూజలు.. ఆలయప్రాంగణంలోనిశ్రీలక్ష్మీతాయారమ్మవారి సన్నిధిలో శుక్ర వారం ఫాల్గుణోత్తర బహుళ విదియను పురస్కరించుకొని శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మ వారికి సామూహిక పూజలు నిర్వహించనున్నా రు. రూ.500 రుసుం చెల్లించిన భక్తులకు దేవస్థానం వారు లక్ష్మీ అమ్మవారివెండిప్రతిమ, ప్రసా దం, అమ్మ వారి పూజా కుంకుమను అందజేస్తారు. -
నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం
-
శ్రీ సత్యదేవుని కల్యాణం చూతము రారండీ...
నిత్యం కల్యాణాలతో.. పచ్చని పెళ్లి పందిళ్లతో.. పసుపు బట్టలతో తిరుగాడే నవ దంపతులతో కళకళలాడే రత్నగిరిక్షేత్రం అది.. దేశంలో ఎక్కడా జరగని విధంగా నిత్యం వేల సంఖ్యలో వ్రతాలు జరిగే మండపమది..... కొత్తగా పెళ్లైన జంటలు పసుపుబట్టలతోనే నేరుగా అక్కడకు చేరుకుని వ్రతమాచరించే పుణ్య వేదిక. భక్తితో వచ్చిన ప్రతివ్యక్తికి కడుపునిండుగా భుక్తిదొరికేలా నిత్యాన్నదానానికి పేరుగాంచిన సత్రమది... భక్తజనకోటి బారులుతీరి మైమరచి పరవశించే ప్రాంతంగా విరాజిల్లుతోన్న అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామివారి ఆలయం గురించి తెలియని వారుండరు. అటువంటి సత్యదేవునికి నిత్యకల్యాణంతో పాటు వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు కూడా ప్రసిద్ధి చెందినవే. వ్రతానికి ఉన్న విశిష్టతే కల్యాణోత్సవాలకు కూడా ఉంది. ఏడాదికొకసారి నిర్వహించే సత్యదేవుని వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి ప్రారంభమై మే 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 29 రాత్రి 9-30 గంటల నుంచి సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుగనుంది. స్వామివారు రత్నగిరిపై ఆవిర్భవించినప్పటి నుంచి అంటే గత 124 సంవత్సరాలుగా ఏటా ఈ వార్షిక కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రతినిత్యం దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారితో కల్యాణం జరుగుతుంది. భక్తులు చూసి తరించేందుకు, వారే కల్యాణకర్తలుగా ఉండి స్వామి కల్యాణం జరిపే అవకాశం దశాబ్దాలుగా భక్తులకు కలుగుతోంది. నిత్య కల్యాణం పచ్చతోరణం శ్రీసత్యదేవుడు, దేవేరి శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు కొలువైన రత్నగిరిపై స్వామి అమ్మవార్లకు ప్రతీరోజూ కల్యాణం జరగడం ఈ క్షేత్ర విశేషం. నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఈ క్షేత్రంలో ప్రతీరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి 11-30 గంటల వరకూ స్వామి, అమ్మవార్లకు కల్యాణం నిర్వహించడం గత 60 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. స్వామి, అమ్మవార్లకు ప్రతీఏటా వైశాఖమాసంలో శుద్ద ఏకాదశి పర్వదినం నాడు దివ్య కల్యాణాన్ని పండితులు ఘనంగా నిర్వహిస్తారు. వారం రోజుల పాటు కల్యాణ వేడుకలు జరుగుతాయి. ఈ కల్యాణం తిలకించలేక తీవ్ర నిరాశకు గురయ్యే భక్తుల కోసం స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని ప్రతినిత్యం దేవస్థానంలో నిర్వహిస్తూ వస్తున్నారు. వైశాఖమాసంలో వార్షిక కల్యాణం శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం వారు వైశాఖ శుద్ద దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ (ఈ నెల 28 నుంచి మే5 వరకు) స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు నిర్విహ స్తున్నారు. వైశాఖ శుద్ద ఏకాదశి నాడు నిర్వహించే ఈ కల్యాణ వేడుకలను రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులు తిలకించి ముక్తి పొందుతుంటారు. అనంతరం భక్తులకు సత్యదేవుని తలంబ్రాలు పంపిణీ చేస్తారు. ఈ వార్షిక కల్యాణోత్సవాలు జరిగే వారం రోజులు స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించరు. శ్రీసత్యదేవుని కల్యాణానికి పెళ్లి పెద్దలుగా రత్నగిరి క్షేత్రానికి పాలకులైన శ్రీసీతారాములు వ్యవహరిస్తే, శ్రీరామనవమి నాడు జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి శ్రీసత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా వ్యవహరించడం విశేషం. - లక్షింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, రాజమండ్రి -
ఘనంగా సీతారామ కల్యాణం
పటాన్చెరు రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని బీరంగూడ జయలక్ష్మీనగర్ కాలనీలో గురువారం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. కాలనీలోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయ ఆవరణలో పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతి రోజు కొంతసేపైనా దైవ సన్నిధిలో గడపాలన్నారు. మహిళలు హిందూ సంప్రదాయాలను మరిచిపోరాదన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పానగేష్యాదవ్, సర్పంచ్ కాట శ్రీనివాస్‌గౌడ్, వైఎస్సార్ సీపీ పటాన్చెరు నియోజకవర్గ సమన్వయ కర్త మహిపాల్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పాండురంగారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.