పటాన్‌చెరు రూరల్, న్యూస్‌లైన్:
మండలంలోని బీరంగూడ జయలక్ష్మీనగర్ కాలనీలో గురువారం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. కాలనీలోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయ ఆవరణలో పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతి రోజు కొంతసేపైనా దైవ సన్నిధిలో గడపాలన్నారు. మహిళలు హిందూ సంప్రదాయాలను మరిచిపోరాదన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పానగేష్‌యాదవ్, సర్పంచ్ కాట శ్రీనివాస్‌గౌడ్, వైఎస్సార్ సీపీ పటాన్‌చెరు నియోజకవర్గ సమన్వయ కర్త మహిపాల్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పాండురంగారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా సీతారామ కల్యాణం
Published Thu, Dec 12 2013 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement