![Governor Tamilisai Visits Bhadradri Temple - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/31/Governor-Tamilisai.jpg.webp?itok=A569q7VN)
భద్రాచలం: శ్రీరామనవమి వసంత ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్యను గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భద్రాద్రి రామయ్య దర్శించుకోవడానికి వెళ్లిన గవర్నర్ తమిళసైకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళసై స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
భద్రాచలం మిధిలా స్టేడియంలో రామయ్య పుష్కర పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని వివిధ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి రుత్వికులు తీసుకొచ్చిన 12 నది జలాలతో స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించారు.
ఈ క్రమంలోనే రామయ్య పుష్కర పట్టాభిషేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. నేటి భద్రాద్రి వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌లు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment