
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటోకాల్ వివాదంపై మాట్లాడటానికి ఇష్టపడని గవర్నర్.. వివాదం ఏమి లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంటరీ సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలోనీ పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. గతంలో గర్భిణులుకు పౌష్టికాహారం, వైద్య సదుపాయం కల్పించడం కోసం రాష్ట్రంలో 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. చాలా గోండు గ్రామాల్లో చాలామంది గర్భిణీ మహిళలు పౌష్టికాహారం లోపంతో వుండడం గమనించామని తెలిపారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు వారి బీపీ కూడా చాలా ఎక్కువగా ఉండడం గమనించామని పేర్కొన్నారు.
దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా పచ్చళ్లు తినడం వల్లే జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా మంది పౌష్టికాహారం లోపం, అనిమియాతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. వారందరికీ మెడికల్ క్యాంపులు పెట్టి వారికి వెరీ హైజన్ ఉండే కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ముందు ముందు కూడా ఎక్కువగా గిరిజనుల సమస్యలపై రాజ్‌భవన్ నుంచి దృష్టి పెట్టడం జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment