sitarama swamy temple
-
రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్ట
విజయనగరం: రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్టించారు. రుత్వికులు శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. 4 నెలల్లో ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవుడి పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాముని విగ్రహం ధ్వంసం చేసిన వారికి తప్పకుండ శిక్ష పడుతుందని తెలిపారు. నెలల్లోనే ఆలయం నిర్మించి విగ్రహాలను ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవునితో రాజకీయాలు చేయడం మానుకోవాలని, దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని ఆధారాలతో నిరూపించడానికి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆగమ పండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయ ప్రతిష్ట జరిగిందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కార్యక్రమం జరిగిందని చెప్పారు. దీంట్లో రాజకీయ కోణం చూడకూడదని అన్నారు. భద్రాచలం సంప్రదాయాలతోనే రామతీర్థ ఆలయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే శ్రీ రామనవమి రామతీర్థంలో రాష్ట్ర అధికారిక నవమి ఉత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరుతున్నామని చెప్పారు. -
ప్రోటోకాల్ కంటే.. అది సంతోషానిచ్చింది: తమిళిసై
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటోకాల్ వివాదంపై మాట్లాడటానికి ఇష్టపడని గవర్నర్.. వివాదం ఏమి లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంటరీ సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోనీ పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. గతంలో గర్భిణులుకు పౌష్టికాహారం, వైద్య సదుపాయం కల్పించడం కోసం రాష్ట్రంలో 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. చాలా గోండు గ్రామాల్లో చాలామంది గర్భిణీ మహిళలు పౌష్టికాహారం లోపంతో వుండడం గమనించామని తెలిపారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు వారి బీపీ కూడా చాలా ఎక్కువగా ఉండడం గమనించామని పేర్కొన్నారు. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా పచ్చళ్లు తినడం వల్లే జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా మంది పౌష్టికాహారం లోపం, అనిమియాతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. వారందరికీ మెడికల్ క్యాంపులు పెట్టి వారికి వెరీ హైజన్ ఉండే కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ముందు ముందు కూడా ఎక్కువగా గిరిజనుల సమస్యలపై రాజ్‌భవన్ నుంచి దృష్టి పెట్టడం జరుగుతుందని తెలిపారు. -
సీఎం కేసీఆర్ ఈసారైనా వస్తారా..?
భద్రాచలం: శ్రీరామనవమికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారైనా వస్తారా? ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు పట్టుకొస్తారా? యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇక భద్రాద్రిపై దృష్టి పెడతారా? రూ.100 కోట్ల అభివృద్ధి ప్రకటనను అమలు చేస్తారా.. అనే ప్రశ్నలు భక్తుల మెదళ్లను తొలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక 2016లో తొలిసారిగా సీఎం దంపతులు శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు. శ్రీసీతారామచంద్రస్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మళ్లీ వేడుకలకు హాజరు కాలేదు. 2017లో స్వామి వారికి సీఎం మనుమడితో పట్టువస్త్రాలు పంపించడమూ, విమర్శలకు దారితీయడమూ తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లపాటు అంతరాలయంలోనే సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిపారు. భక్తులను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాది వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కల్యాణ ముహూర్తం ప్రకటించినప్పటి నుంచి సీఎం కేసీఆర్ రాకపై చర్చ సాగుతోంది. నిజాం నవాబు తానీషా కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న పట్టు వస్త్రాలు, తలంబ్రాల సమర్పణను ముఖ్యమంత్రి హోదాలో బ్రేక్ చేసిన కేసీఆర్.. ఈ సారైనా వస్తారా? రారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి పూర్తైంది.. మరి భద్రాద్రి..? 2016న భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయితో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. అంతటితో ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అదే క్రమంలో యాదాద్రి ఆలయాన్ని మాత్రం శరవేగంగా పూర్తి చేశారు. వందల కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు. యాదాద్రితో పాటే భద్రాద్రి అని అధికారం పక్షం వారు చెబుతున్నా.. అభివృద్ధి అమలుకు నోచుకోవడంలేదు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తైన నేపథ్యంలో భద్రాచలం రామాలయంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని భక్తులు, జిల్లావాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు. స్థానికులు, భక్తుల్లో అసంతృప్తి భద్రాచల రాముడిపై సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శల దాడి చేస్తున్నాయి. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భద్రాచలం రామాలయం అభివృద్ధి చేయకపోవడం, ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి సాధించలేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకంలో భాగంగా భద్రాచలం, పర్ణశాల ఆలయాలకు రూ.96 కోట్లు ప్రకటించింది. కార్యాచరణ వేగవంతం చేసింది. కల్యాణానికి ముఖ్యమంత్రి, పట్టాభిషేకానికి గవర్నర్లు హాజరు కావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హాజరు కాకుండా, గవర్నర్ తమిళిసైతో పాటుగా బీజేపీ మంత్రులు హాజరయితే విమర్శల తాకిడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఉగాది రోజు సీఎం, గవర్నర్‌కు ఆహ్వానాలు శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరు కావాలని దేవస్థానం తరఫున సీఎం, గవర్నర్లకు ఉగాది రోజున ఆహ్వాన పత్రికలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా ఏప్రిల్ 2న సీఎం, గవర్నర్లను ఆహ్వానించేందుకు ఈవో, అర్చకులు వెళ్లనున్నారు. 1న దేవదాయ శాఖ మంత్రి చేతుల మీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం సీఎం, గవర్నర్‌తోపాటు ఇతర మంత్రులను ఆహ్వానించనున్నారు. -
సీతారామ స్వామి దేవస్థానంలో రామనవమి వేడుకలు
-
దేవుని విగ్రహాలు ధ్వంసం
కరీంనగర్: ఆలయంలోకి చొరబడిన దుండగులు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని సీతారామ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని గత రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.