పోలీసుల అదుపులో ఒడిశా యువతులు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఒడిశా యువతులు

Published Sat, Jun 3 2023 8:10 AM | Last Updated on Sat, Jun 3 2023 8:29 AM

కారులో ప్రయాణిస్తున్న యువతులు  - Sakshi

కారులో ప్రయాణిస్తున్న యువతులు

భద్రాద్రి: పొట్టకూటి కూసం ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్తూ మార్గమధ్యలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఒడివా రాష్ట్రం కోరాపుట్‌కు చెందిన 13 మంది యువతులు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూట్‌లోని ఓ దుస్తుల కంపెనీలో పనిచేసేందుకు వెళ్తున్నారు.

యువతులు రెండు కార్లు (వాహనాల్లో) బయలు దేరారు. మార్గమధ్యలో ఓ కారు చెడిపోయింది. దీంతో ఒకేకారులో సర్దుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చండ్రుగొండలోని ఓ పెట్రోల్‌బంకులో కారు ఆపి సేదతీరుతున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ విజయలక్ష్మి సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అదుపులో తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

యువతుల వద్ద ఉన్న కంపెనీ గుర్తింపు కార్డులను పోలీసులు తనిఖీ చేయగా అవి ఓ ప్రముఖ దుస్తుల కంపెనీకి చెందినవిగా ఉన్నాయి. కాగా, ఈ అంశంపై డీఎస్పీ అబ్దుల్‌ రెహమాన్‌ను వివరణ కోరగా పోలీసులకు పట్టుపడిన యువతులను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం యువతులను పంపిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement