
గణితం బోధిస్తున్న డీఈఓ సోమశేఖరశర్మ
అశ్వారావుపేటరూరల్: ఆయన జిల్లా విద్యాశాఖాధికారి.. అయినప్పటికీ కొద్ది సేపు విద్యార్థులకు పాఠాలు బోధించి టీచర్‌గా మారిపోయారు. అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం డీఈఓ సోమశేఖరశర్మ ఆకస్మికంగా సందర్శించారు. పదోవ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి పలు పాఠ్యాంశాలపై ప్రశ్నించారు. ఆ తర్వాత తానే టీచర్‌గా మారిపోయి బ్లాక్ బోర్డుపై విద్యార్థులకు గణిత బోధన చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. కష్టపడి, ఇష్టంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. అనంతరం మన ఊరు – మన బడి పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంటకాలను రుచి చూశారు. ఆయనతోపాటు ఎంఈఓ పి.కృష్ణయ్య, పరీక్షల విభాగం ఏసీజీఈ మాధవరావు, సెక్టోరియల్ అధికారులు నాగరాజశేఖర్, సతీశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment