సాక్షి,బూర్గంపాడు(భద్రాద్రి): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని సారపాకలోని రాజీవ్‌నగర్‌లో ఓ యువతి ఆందోళన చేపట్టిన విషయం విదితమే. శనివారం రాత్రి పోలీసుల కౌన్సిలింగ్, ఐద్వా ప్రతినిధుల ఆందోళనలతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. సారపాక రాజీవ్‌నగర్‌కు చెందిన ఇర్పా నర్మద, అదే కాలనీకి చెందిన బి.కిరణ్‌కుమార్ గత ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు.
అయితే కిరణ్‌కుమార్ పెళ్లికి నిరాకరించటంతో నర్మద ప్రియుడి ఇంటి ఎదుట శనివారం ఆందోళన చేపట్టింది. ఆమె ఆందోళనకు ఐద్వా ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. శనివారం రాత్రి పోలీసుల కౌన్సిలింగ్‌తో కిరణ్‌కుమార్ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఐద్వా ఆధ్వర్యంలో బూర్గంపాడులోని రామాలయంలో ప్రేమజంటకు పెళ్లి జరిపించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు సీతాలక్ష్మి, లీలావతి, సున్నం గంగ, జీవనజ్యోతి, పాపినేని సరోజని, జి.రాధ, రమణ, చుక్కమ్మ, సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పొడియం నరేందర్, కొనకంచి శ్రీని వాస్, గుర్రం సుదర్శన్ పాల్గొన్నారు.
చదవండి: గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి
Comments
Please login to add a commentAdd a comment