
యాదాద్రిలో వ్యాక్సిన్ కోసం తోపులాట
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్ వద్ద గురువారం తోపులాట జరిగింది. రెండు రోజుల తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం, దానికి తోడు సిబ్బంది సమయానికి రాకపోవడంతో వ్యాక్సిన్ కోసం ఒక్కసారిగా ప్రజలు దూసుకువచ్చారు. తోపులాటలో పలువురు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. 800 మంది టీకా కోసం రాగా, సాయంత్రానికి 450 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు.– రామన్నపేట
కరోనా థర్డ్‌వేవ్ ప్రచారంతో టీకా తీసుకునేందుకు వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి గురువారం వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోరువానను కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరీ బారులు తీరారు. – బూర్గంపాడు
Comments
Please login to add a commentAdd a comment