
కోడలిపై చేయి చేసుకుంటున్న అత్త
పాల్వంచ: కోడలు అదనపు కట్నం తేవడం లేదని అత్త చేయి చేసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిఽధిలోని పిచ్చయ్య బంజరకు చెందిన రాజేశ్ మొదటి భార్య మృతి చెందడంతో శ్రీలతను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లు ఉండగా, శ్రీలతకు కుమారుడు ఉన్నాడు. ముగ్గురీ ఆలనాపాలన శ్రీలతనే చూసుకుంటోంది. కాగా కొన్ని రోజులుగా అత్త లక్ష్మీబాయి పది లక్షల కట్నం ేతేవాలంటూ వేధిస్తోందని శ్రీలత ఆవేదన వ్యక్తం చేసింది. అనేక మార్లు తనను హింసించి, చేయి చేసుకుంటోందని కన్నీళ్ల పర్యంతయింది. ఈ విషయమై ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
కరకగూడెం: పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ ఏసీఎంఓ రమణయ్య , స్పెషల్ ఆఫీసర్ ఎస్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని చిరుమళ్ల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం జగన్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment