అన్నపురెడ్డిపల్లి: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలు పంచుకునేందుకే క్యాంపు కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆయన అనుచరుడు పర్సా వెంకటేశ్వరరావు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 2019లో టికెట్ ఇవ్వకపోయినా ప్రజల మధ్యే ఉంటున్నానని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అని మండలాల్లో, మున్సిపాటీల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పదవులు ఉన్నా లేకున్నా.. అధికారం ఉన్నా, లేకపోయినా.. తనకు ప్రజలే ముఖ్యమని, ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్సా వెంకటేశ్వర్లు, బోడా పద్మ, భీంరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుబ్బాకుల రాము, మారకాల లక్ష్మారెడ్డి, వీరబాయిన నాగేశ్వరరావు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Published Sun, Feb 26 2023 12:50 AM | Last Updated on Sun, Feb 26 2023 5:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment