
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఇద్దరు అనాథ పిల్లలకు ఎమ్మెల్యే హరిప్రియ అండగా నిలిచారు. భట్టు గణేశ్, స్రవంతి దంపతులు. మూడేళ్ల క్రితం గొంతు కేన్సర్‌తో గణేశ్, మూడు నెలల క్రితం కిడ్నీ సమస్యలతో స్రవంతి మృతి చెందారు. దీంతో వారి పిల్లలు ఏడేళ్ల కృషన్, ఐదేళ్ల హరిప్రియ భారం అమ్మమ్మ నాగమణిపై పడింది. వారి ఇబ్బందులను గణేశ్ మిత్రుడు ఫణి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో వివరించాడు.
వెంటనే స్పందించిన కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ డి.అనుదీప్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మికి ఈ సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ చిన్నారుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటానని, ఇద్దరికీ విద్య, ఇతర అవసరాలకు సాయం అందిస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వారిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment